ఐఆర్ఎస్ అధికారినంటూ..
గుంటూరు: తానో రెవెన్యూ శాఖ అధికారినని చెప్పుకుంటూ ఓ వ్యక్తి పెళ్లిపేరుతో పలువురు మహిళలను మోసగించిన సంఘటన శనివారం వెలుగుచూసింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గుంటూరుకు చెందిన వెంకటరత్నాకర రెడ్డి తాను ఐఆర్ఎస్ అధికారనని చెప్పి పలువురు మహిళలను నమ్మించాడు. వారందరినీ వివాహం చేసుకున్న తర్వాత పెద్ద మొత్తంలో నగదు, బంగారం కాజేసి కనిపించకుండా పోయాడు.
ఇతని బాధితుల్లో ఎన్ఆర్ఐలు, ఓ సినీ నిర్మాత కూడా ఉన్నట్లు సమాచారం. గుంటూరు,హైదరాబాద్ లలో రత్నాకర్ పై బ్యాంకు దొంగతనంతో పాటు పలు కేసులు ఉన్నాయి. బాధితుల ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు నిందితుడిని అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు. కేసుకు సంబంధించి పూర్తివివరాలు తెలియాల్సివుంది.