ఫైనాన్స్ వ్యాపారి దారుణ హత్య!
నల్లగొండ : నల్లగొండ జిల్లా సూర్యాపేట పట్టణంలోని పూలసెంటర్ సమీపంలో ఫైనాన్స్ వ్యాపారి దారుణహత్యకు గురయ్యాడు. ఆదివారం ఉదయం ఈ సంఘటన జరిగింది. వీరండి వెంకటాచారి (54) ఇంట్లో రక్తపు మడుగులో హత్యకు గురై పడి ఉన్నాడు. ఈ హత్యకు భార్య పద్మకు కారణమని స్థానికులతోపాటు బంధువులు ఆరోపిస్తున్నారు.
పద్మకు మరో వ్యక్తితో ఉన్న వివాహేతర సంబంధం ఉందని వారు చెప్పారు.ఈ హత్యపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అందులోభాగంగా పోలీసులు పద్మను అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. డీఎస్పీ రషీష్ సంఘటనా స్థలాన్ని పరిశీలించారు.