ఆటో బోల్తా.. ఐదుగురికి గాయాలు
పెనుకొండ రూరల్ : మండలంలోని వెంటకరెడ్డిపల్లి రహదారిలో గురువారం ఆటో బోల్తా పడి ఐదుగురు గాయపడ్డారని ఎస్ఐ జనార్దన్ తెలిపారు. పెనుకొండ నుంచి శెట్టిపల్లికి ప్రయాణికులతో బయలుదేరిన ఆటో మార్గమధ్యంలోని వెంకటరెడ్డిపల్లికి చేరుకోగానే అదుపు తప్పి బోల్తా పడింది. ఘటనలో శెట్టిపల్లికి చెందిన జమిలీబాయి, పార్వతమ్మ, శివమ్మ, గాయత్రిబాయి, ఇస్లాపురానికి చెందిన రామన్న గాయపడ్డారు. వారిని 108లో ఆస్పత్రికి తరలించారు. విషయం తెలిసిన వెంటనే ఎస్ఐ జనార్దన్ ఆస్పత్రికి చేరుకుని ప్రమాదంపై బాధితులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. ఆటో డ్రైవర్ రఘునాథ్పై కేసు నమోదు చేశారు. సర్పంచ్ చలపతి కూడా ఆస్పత్రికి చేరుకుని క్షతగాత్రులను పరామర్శించారు.