పరిశోధనలతోనే దేశ ప్రగతి
నోబెల్ గ్రహీత వెంకట్రామన్ రామకృష్ణన్
సాక్షి, హైదరాబాద్: మౌలిక విజ్ఞానంపై మరిన్ని పరిశోధనలు జరగాల్సిన అవసరం ఉందని నోబెల్ అవార్డు గ్రహీత వెంకట్రామన్ రామకృష్ణన్ అన్నారు. పరిశోధనల ద్వారానే దేశం ప్రగతి సాధించగలదని అన్నారు. ప్రముఖ గణిత శాస్త్రవేత్త సీఆర్ రావు పరిశోధనలపై హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో ఏర్పాటు చేసిన ఆర్ట్గ్యాలరీని రామకృష్ణన్ ఆదివారం ప్రారంభించారు. ప్రాచీనకాలంలో దేశం పరిశోధనలకు పుట్టినిల్లుగా వెలుగొందిందని, ఇప్పుడు పరిస్థితి పూర్తిగా దిగజారిపోతుందని గణితవేత్త సీఆర్ రావు ఆవేదన వ్యక్తం చేశారు. కార్యక్రమంలో శాస్త్రవేత్త సారస్వత, హెచ్సీయూ వీసీ రామకృష్ణ రామస్వామి, అల్లం అప్పారావు తదితరులు పాల్గొన్నారు.