ఉత్కంఠ రేపుతున్న వెనమ్ - ది లాస్ట్ డాన్స్ ఫైనల్ ట్రైలర్
‘మ్యాడ్ మ్యాక్స్, ది రెవినాంట్, ఇన్సెప్షన్’ వంటి సినిమాల్లో నటించిన టామ్ హార్డీ ప్రధాన పాత్రలో నటించిన తాజా చిత్రం ‘వెనమ్: ది లాస్ట్ డాన్స్’. కెల్లీ మార్సెల్ దర్శకత్వం వహించారు. సోనీ పిక్చర్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్, మార్వెల్ సంయుక్తంగా నిర్మించాయి. సోనీ పిక్చర్స్ సంస్థ ఈ చిత్రాన్ని ఇండియాలో ఇంగ్లిష్తో పాటు తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో భారీ స్థాయిలో విడుదల చేయనుంది. 3డితో పాటు ఐమాక్స్ 3డి వెర్షన్లో అక్టోబర్ 25న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. (చదవండి: పద్దెనిమిదో శతాబ్దం నేపథ్యంలో మహేశ్-రాజమౌళి సినిమా)ఈ సందర్భంగా ఈ చిత్రం ఫైనల్ ట్రైలర్ రిలీజ్ చేశారు. ‘‘ఇది నీకు నచ్చకపోవచ్చు... నచ్చదు... నాకు కచ్చితంగా నచ్చదని గ్యారెంటీ ఇస్తున్నాను’, ‘ఆ గ్రహవాసులు మనల్ని కనిపెట్టారు’, ‘దాన్ని ఎవరు పంపించారు... ఆ సృష్టిక్తర’, ‘మీరు కలిసుంటే ఈ ప్రపంచం మనుగడ సాగించలేదు’ వంటి డైలాగులు ట్రైలర్లో ఉన్నాయి. ‘‘టామ్ హార్డీ నటనతో ΄ాటు వెనమ్ క్యారెక్ట్ చేసే యాక్షన్ సీన్స్ హైలెట్‌గా నిలుస్తాయి. ఇప్పటికే విడుదలైన ‘వెనమ్’ మొదటి భాగం, రెండవ భాగం ప్రపంచవ్యాప్తంగా మూవీ లవర్స్‌ని బాగా ఆకట్టుకున్నాయి. ఈ నేపథ్యంలో రాబోతున్న ‘వెనమ్: ది లాస్ట్ డాన్స్’ పై భారీ అంచనాలున్నాయి’’ అని చిత్రబృందం పేర్కొంది.