రెండో ఏఎన్ఎంలపై వివక్ష తగదు
వైఎస్సార్సీపీ రాష్ట్ర కార్యదర్శి నగేశ్
చొప్పదండి : రెండో ఏఎన్ఎంలపై ప్రభుత్వానికి వివక్ష తగదని, వారిని రెగ్యులరైజ్ చేసి వెంటనే విధుల్లోకి తీసుకోవాలని వైఎస్సార్సీపీ రాష్ట్ర కార్యదర్శి డాక్టర్ కె.నగేశ్ డిమాండ్ చేశారు. తహసీల్దార్ కార్యాలయం ఎదుట రెండో ఏఎన్ఎంలు చేపట్టిన రిలే దీక్షలకు ఆయన గురువారం మద్దతుతెలిపి మాట్లాడారు. తెలంగాణ ఏర్పడితే బతుకులు బాగుపడతాయని ఆశించిన వారికి నిరాశే ఎదురైందన్నారు. తక్కువ వేతనాలు ఇస్తూ, వెట్టిచాకిరీ చేయించుకోవడం శోచనీయమని పేర్కొన్నారు. ప్రభుత్వం దిగొచ్చే వరకు పోరాడుతారన్నారు.