ఉత్సాహభరితంగా క్రీడా పోటీలు
కమలాపూర్: కమలాపూర్ ఎడ్యుకేషనల్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో స్థానిక బాలుర ఉన్నత పాఠశాల క్రీడా మైదానంలో పాఠశాల విద్యార్థులకు నిర్వహిస్తున్న మండల స్థాయి ఆటల పోటీలు శనివారం ఉత్సాహభరితంగా సాగాయి. హోరాహోరీగా సాగిన కబడ్డీ పోటీల్లో విద్యార్థులు క్రీడా నైఫుణ్యాన్ని చాటుకున్నారు. పోటీలకు ట్రస్ట్ వ్యవస్థాపక అధ్యక్షుడు శిరుమల్ల వెంకటనారాయణ, ట్రస్ట్ అధ్యక్షుడు డాక్టర్ ఈటల సమ్మన్న, ఏబీసీ కార్పొరేషన్ వెటరన్ కెమెరామెన్ జగన్నాథ్శర్మ, న్యూఢిల్లీ ఇగ్నో రిటైర్డ్ వైస్ ఛాన్స్లర్ డాక్టర్ రాజశేఖరన్ పిళ్లై, డాక్టర్ దాసి సాంబయ్య అతిథులుగా హాజరై క్రీడాకారులను పరిచయం చేసుకుని పోటీలను వీక్షించారు. కార్యక్రమంలో హెచ్ఎంలు రాంరెడ్డి, పవన్, పీఈటీలు రాజేందర్, రవీందర్, వనజ, పుష్పలత, గీత, రవీందర్, నాగరాజు, వెంకటేశ్, విశ్రాంత పీఈటీ వెంకటేశం పాల్గొన్నారు.