వేస్ట్‌మేనేజ్‌మెంట్ ప్రాజెక్టును ఉపసంహరించుకోవాలి
నల్లగొండ రూరల్ : రామన్నపేట మండలంలోని కక్కిరేణి గ్రామంలో ఏర్పాటు చేయనున్న వేస్ట్‌మేనేజ్‌మెంట్ ప్రాజెక్టును ఉపసంహరించుకోవాలని తెలంగాణ విద్యావంతుల వేదిక డిమాండ్ చేసింది. ఈ ప్రాజెక్టుపై గురువారం పీఆర్టీయూ భవన్లో టీవీవీ ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశాన్ని నిర్వహించింది. ఈ సమావేశంలో టీవీవీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.ధర్మార్జున్ మాట్లాడుతూ దీని వల్ల ప్రత్యక్షంగా, పరోక్షంగా రామన్నపేట, చిట్యాల, నార్కట్‌పల్లి, నకిరేకల్, సూర్యాపేట మండలాలకు చెందిన 40 గ్రామాల్లోని ప్రజలకు ప్రజారోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతుందన్నారు. వెంటనే చెత్త డంపింగ్ ప్రాజెక్టును ఉపసంహరించుకోవాలన్నారు. మానవ హక్కుల వేదిక రాష్ట్ర కార్యదర్శి జి.మోహన్ మాట్లాడుతూ వ్యవసాయ రంగం జీవన విధానానికి ప్రమాదం పొంచిఉందన్నారు. టీవీవీ జిల్లా ప్రధాన కార్యదర్శి పందుల సైదులుగౌడ్ మాట్లాడుతూ పంటలన్నీ విషతుల్యంగా మారుతాయన్నారు. సీపీఐ నాయకులు శ్రవణ్‌కుమార్, సీపీఐఎంఎల్ న్యూడెమోక్రసీ కార్యదర్శి డేవిడ్ కుమార్, మానవ హక్కుల వేదిక జిల్లా అధ్యక్షుడు సిహెచ్. గురవయ్య, బీసీపీ రాష్ట్ర నాయకులు కె.పర్వతాలు, కల్లూరి మల్లేశం, గోపాల్‌రెడ్డి, టీయూడబ్లూ్యజే జిల్లా అధ్యక్షుడు దూసరి కిరణ్‌కుమార్ తదితరులు ఈ ప్రాజెక్టును వ్యతిరేకించారు. పలు తీర్మానాలు చేశారు. ఈ సమావేశంలో సాగర్, సోమయ్య, భీమార్జున్‌రెడ్డి, ప్రమీల, రవి, కె.వెంకటాచారి, కేశవులు, కొండల్, తదితరులు హాజరయ్యారు.