veta palem
-
అనాథ పిల్లల నేపథ్యంలో...
అనాథ పిల్లలకు సరైన గెడైన్స్ లేకపోతే ఎలాంటి పరిస్థితులను ఎదుర్కొంటారు? వారి భవిష్యత్తు ఎలా ఉంటుంది? అనే కథాంశంతో తెరకెక్కిన చిత్రం ‘వేటపాలెం’. ప్రశాంత్, శిల్ప, లావణ్య ప్రధాన పాత్రల్లో హని, ప్రణి ఫిలింస్ పతాకంపై నంది వెంకటరెడ్డి దర్శకత్వంలో డా. ఎ.వి.ఆర్ నటించి, నిర్మించారు. ఈ చిత్రం పాటల సీడీని బేబి శ్లోక ఆవిష్కరించి, దైవజ్ఞ శర్మకు ఇచ్చారు. ‘‘క్రైమ్ నేపథ్యంలో సాగే ఈ చిత్రంలో మనుసును తాకే సన్నివేశాలుంటాయి’’ అని దర్శక-నిర్మాతలు అన్నారు. ఎం.ఎం. రెడ్డి, సంగీత దర్శకుడు ఎ.ఆర్. సన్నీ మాట్లాడారు. ఈ చిత్రానికి సహ నిర్మాత: తంగిరాల అపర్ణ, సమర్పణ: మాస్టర్ అమరావతి సురోచన్. -
అనగనగా ఓ క్రైమ్ కథ
అనాథల్లా పెరుగుతున్న పిల్లల్లో కొంతమందికి సరైన మార్గనిర్దేశం లేక క్రిమినల్స్‌గా మారుతున్నారు. అలాంటి వారి జీవితాల చుట్టూ సాగుతూ, క్రైమ్ నేపథ్యంలో తెరకెక్కిన చిత్రం ‘వేటపాలెం’. ప్రశాంత్, లావణ్య, శిల్ప ముఖ్యతారలుగా నంది వెంకట్‌రెడ్డి దర్శకత్వంలో డా. ఎ.వి.ఆర్ సుబ్రమణ్యం కీలక పాత్ర పోషించి, నిర్మించిన ఈ చిత్రం విడుదలకు సిద్ధంగా ఉంది. నిర్మాత మాట్లాడుతూ -‘‘కమర్షియల్ హంగులతో సాగే సందేశాత్మక చిత్రమిది. ఈ నెల 27న పాటలు, జనవరిలో చిత్రాన్ని విడుదల చేయనున్నాం’’ అన్నారు. ఈ చిత్రానికి సంగీతం: ఎం.ఆర్.సన్నీ, సహ-నిర్మాత: తంగిరాల అపర్ణ.