vetarnary doctors
-
టెండర్ల ద్వారా గొర్రెల పంపిణీ
సాక్షి, హైదరాబాద్: గొర్రెల కొనుగోళ్లలో అక్రమాలపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించింది. ప్రస్తుతం పశువైద్యుల సాయంతో లబ్ధిదారులు ఇతర రాష్ట్రాలకు వెళ్లి గొర్రెలు కొనుగోలు చేస్తున్నారు. ఈ క్రమంలో అవి నీతి, అక్రమాలు చోటు చేసుకుంటున్నట్లు ప్రభుత్వం గుర్తించింది. దీంతో టెండర్ ప్రక్రియ ద్వారా గొర్రె లను కొనుగోలుచేసి, గొల్ల కుర్మలకు పంపిణీ చేసే అంశాన్ని పరిశీలిస్తోంది. అలాగే నేరుగా లబ్ధిదారులకే సొమ్మును జమ చేసి గొర్రెలు కొనుగోలు చేసుకునేందుకు అవకాశం కల్పించే అంశంపైనా కూడా పరిశీలన చేస్తోంది. ఈ రెండింటిలో ఏదో ఒక పద్ధతిని అవలంబిస్తే క్షేత్రస్థాయిలో పెద్దఎత్తున జరుగుతున్న రీసైక్లింగ్‌ను నివారించడంతోపాటు, పశువైద్యుల అక్రమాలకు తాళం వేసినట్లవుతుందని భావిస్తోంది. ఇప్పటివరకు మొత్తం 75.95 లక్షల గొర్రెలను కొనుగోలు చేసినట్లు గొర్రెల, మేకల అభివృద్ధి సమాఖ్య గణాంకాలు చెబుతున్నాయి. అయితే కొనుగోలు చేసి పంపిణీ చేసిన గొర్రెలనే నిబంధనలకు విరుద్ధంగా మళ్లీ కొనుగోలు చేసినట్లు చూపి పంపిణీ చేయడంతో గొర్రెలు యథేచ్ఛగా రీసైక్లింగ్ అయినట్లు తేలింది. కొందరు పశువైద్యులు అమ్మకందారులతో కుమ్మక్కై అక్రమంగా వ్యవహరించారు. ఈ క్రమంలో గొర్రెలు గ్రౌండింగ్ చేయకున్నా చేసినట్లు చూపారు. దీంతో ఆరుగురు పశువైద్యులను సస్పెండ్ కూడా చేశారు. అయినప్పటికీ పశువైద్యులు బాధ్యతరాహిత్యంగా ప్రవర్తిస్తున్నారని ఆ శాఖలోని అధికారులే విమర్శలు చేస్తున్నారు. ఫలితంగానే టెండర్ లేదా నేరుగా లబ్ధిదారుడి ఖాతాకు సబ్సిడీ రూపంలో డబ్బు జమచేసి గొర్రెలు కొనుగోళ్లు చేసేలా ప్రభుత్వం ఆలోచిస్తుంది. సరఫరా గొర్రెలపై సర్వే... 2018 జూన్‌లో సీఎం కేసీఆర్ గొర్రెల అభివృద్ధి పథకాన్ని ప్రారంభించారు. ఈ పథకంపై పశుసంవర్థక శాఖ సర్వే చేపట్టింది. ఏయే గ్రామాల్లో ఎన్ని యూనిట్లు పంపిణీ చేశారు. వాటిలో ఎన్ని గొర్రెలు ఉన్నాయి. ఎన్నింటిని అమ్ముకున్నారు. ఎందుకోసం విక్రయించుకోవాల్సి వచ్చిందనే కారణాలతో ఈ సర్వే చేస్తున్నట్లు ఉన్నతాధికారులు తెలిపారు. -
చిరుతకు పోస్టుమార్టం
నిజామాబాద్ అగ్రికల్చర్(నిజామాబాద్ అర్బన్) : నవీపేట్ మండలంలోని అబ్బాపూర్(ఎం) గ్రామీ సమీపంలో సోమవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతిచెందిన చిరుత పులికి జిల్లా కేంద్రంలోని కోటగల్లిలో జిల్లా పశువైద్యాధికారి కార్యాలయంలో మంగళవారం పోస్టుమార్టం నిర్వహించారు. ప్రమాదంలో పులి పక్కటెముకలు విరిగి ఊపిరితిత్తులకు రంధ్రం పడి తీవ్ర రక్తస్రావం జరగడంతో మృతిచెందినట్లు వైద్యులు రాకేశ్, ఖాజా కైసర్, అంకిత తెలిపారు. చిరుతపులి వయసు సుమారు 5 నుంచి 6 ఏళ్లు ఉంటుందని వైద్యులు పేర్కొన్నారు. పోస్టుమార్టం అనంతరం కళేబరాన్ని అటవీ రేంజ్ అధికారి రవి మోహన్ భట్, ఎఫ్డీఓ వేణుబాబుకు అప్పగించారు. నిజామాబాద్ రూరల్ మండలంలోని మల్లారం రిజర్వ్ ఫారెస్ట్‌లో చిరుత కళేబరాన్ని అటవీశాఖ అధికారులు దహనం చేశారు. -
పశువైద్యుల బదిలీ
అనంతపురం అగ్రికల్చర్ : వైఎస్సార్ కడప జిల్లాలో గురువారం జరిగిన జోనల్ బదిలీల కౌన్సెలింగ్‌లో జిల్లాకు చెందిన ఆరుగురు పశువైద్యులు, 8 మంది మినిస్టీరియల్ స్టాఫ్ బదిలీ అయినట్లు ఆ శాఖ జేడీ డాక్టర్ వి.రవీంద్రనాథఠాగూర్, డీడీ డాక్టర్ కె.జయకుమార్ తెలిపారు. బదిలీల్లో భాగంగా సోమందేపల్లి నుంచి డాక్టర్ ప్రవీణ్ గార్లదిన్నెకు, చియ్యేడుకు డాక్టర్ రమాన్, పాలవాయికి డాక్టర్ క్రిష్ణ, ములకలేడుకు డాక్టర్ ప్రసాద్, సోమలాపురానికి డాక్టర్ ఎ.రమేష్, పాముదుర్తికి డాక్టర్ చెన్నకేశవనాయక్కు బదిలీ అయ్యారన్నారు. మినిస్టీరియల్ స్టాఫ్‌కు సంబంధించి జేడీ ఆఫీస్ నుంచి యాసిన్ రెడ్డిపల్లి క్షేత్రానికి, సుభద్ర జేడీ ఆఫీసు నుంచి పెనుకొండ షీఫార్మ్కు, సతీష్ జేడీ ఆఫీస్ నుంచి పెనుకొండ డీడీ ఆఫీస్‌కు, శ్రీనివాసులు రెడ్డిపల్లి నుంచి జేడీ ఆఫీసుకు, జబ్బార్వలీ పెనుకొండ నుంచి జేడీ ఆఫీస్‌కు, గంగాధర్ పెనుకొండ షీఫార్మ్ నుంచి జేడీ ఆఫీస్‌కు, సుబ్రమణ్యం డీడీ ఆఫీస్ అనంతపురం నుంచి రెడ్డిపల్లికి, చంద్రకుమార్ రెడ్డిపల్లి నుంచి కర్నూలు జిల్లాకు బదిలీ అయినట్లు తెలిపారు.