అనంతపురం అగ్రికల్చర్ : వైఎస్సార్ కడప జిల్లాలో గురువారం జరిగిన జోనల్ బదిలీల కౌన్సెలింగ్‌లో జిల్లాకు చెందిన ఆరుగురు పశువైద్యులు, 8 మంది మినిస్టీరియల్ స్టాఫ్ బదిలీ అయినట్లు ఆ శాఖ జేడీ డాక్టర్ వి.రవీంద్రనాథఠాగూర్, డీడీ డాక్టర్ కె.జయకుమార్ తెలిపారు. బదిలీల్లో భాగంగా సోమందేపల్లి నుంచి డాక్టర్ ప్రవీణ్ గార్లదిన్నెకు, చియ్యేడుకు డాక్టర్ రమాన్, పాలవాయికి డాక్టర్ క్రిష్ణ, ములకలేడుకు డాక్టర్ ప్రసాద్, సోమలాపురానికి డాక్టర్ ఎ.రమేష్, పాముదుర్తికి డాక్టర్ చెన్నకేశవనాయక్‌కు బదిలీ అయ్యారన్నారు.
మినిస్టీరియల్ స్టాఫ్‌కు సంబంధించి జేడీ ఆఫీస్ నుంచి యాసిన్ రెడ్డిపల్లి క్షేత్రానికి, సుభద్ర జేడీ ఆఫీసు నుంచి పెనుకొండ షీఫార్మ్‌కు, సతీష్ జేడీ ఆఫీస్ నుంచి పెనుకొండ డీడీ ఆఫీస్‌కు, శ్రీనివాసులు రెడ్డిపల్లి నుంచి జేడీ ఆఫీసుకు, జబ్బార్‌వలీ పెనుకొండ నుంచి జేడీ ఆఫీస్‌కు, గంగాధర్ పెనుకొండ షీఫార్మ్ నుంచి జేడీ ఆఫీస్‌కు, సుబ్రమణ్యం డీడీ ఆఫీస్ అనంతపురం నుంచి రెడ్డిపల్లికి, చంద్రకుమార్ రెడ్డిపల్లి నుంచి కర్నూలు జిల్లాకు బదిలీ అయినట్లు తెలిపారు.
పశువైద్యుల బదిలీ
Published Fri, May 19 2017 11:22 PM | Last Updated on Fri, Jun 1 2018 8:39 PM
Advertisement
Advertisement