నలుగురు తహసీల్దారుల బదిలీ | four tahasildars transfer | Sakshi
Sakshi News home page

నలుగురు తహసీల్దారుల బదిలీ

Published Tue, Aug 22 2017 9:58 PM | Last Updated on Fri, Jun 1 2018 8:39 PM

four tahasildars transfer

అనంతపురం అర్బన్‌: జిల్లాలో నలుగురు తహసీల్దారులను బదిలీ చేస్తూ కలెక్టర్‌ వీరపాండియన్‌ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. గుంటూరు సీఆర్‌డీఏకి వెళ్లిన జి.వసంతకు కదిరి ఆర్‌డీఓ కార్యాలయం ఏఓగా పోస్టింగ్‌ ఇస్తూ బదిలీ చేశారు. అలాగే పెనుకొండ ఆర్డీఓ ఏఓగా ఉన్న ఎం.జి.సరస్వతిని ధర్మవరం ఆర్‌డీఓ ఏఓగా నియమించారు. తాడిమర్రి తహసీల్దారుగా ఉన్న పి.సుబ్బలక్ష్మమ్మను ఆమడగూరు తహసీల్దారుగా నియమించారు. తాడిమర్రి తహసీల్దారు బాధ్యతలను ముదిగుబ్బ తహసీల్దారుకు అదనంగా అప్పగించారు. ఇక సెలవులో ఉన్న కదిరి తహసీల్దారు జి.రామకృష్ణరెడ్డిని డ్వామా ఈజీఎస్‌ విభాగం సూపరింటెండెంట్‌గా నియమించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement