veteran director
-
చిత్రపరిశ్రమలో విషాదం.. ప్రముఖ దర్శకుడు కన్నుమూత
Bengali Director Tarun Majumdar Passed Away At 92: సినీ ఇండస్ట్రీలో వరుసగా విషాదాలు చోటుచేసుకుంటున్నాయి. తాజాగా ప్రముఖ బెంగాలీ దర్శకుడు తరుణ్ మజుందార్ కన్నుమూశారు. మధ్యతరగతి కుటుంబాల జీవితం, వారు ఎదుర్కొనే ఒడిదొడుకుల ఆధారంగా హృద్యమైన కథల చుట్టూ తిరిగే ఐకానిక్ చిత్రాలను తెరకెక్కించడం ఆయన ప్రత్యేకత. ఇలా భారతీయ చలన చిత్ర రంగంలో ప్రముఖ దర్శకుడిగా మారారు తరుణ్ మజుందార్. 92 ఏళ్ల తరుణ్ గత కొంతకాలంగా వయో సంబంధిత వ్యాధులతో బాధపడుతున్నారు. ఇందు కోసం కోల్‌కతాలోని ఎస్‌ఎస్‌కెఎం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆయన సోమవారం (జులై 4) తుది శ్వాస విడిచారు. బ్రిటీష్ ఇండియాలోని బెంగాల్ ప్రెసిడెన్సీలో 1931, జనవరి 8న తరుణ్ మజుందార్ జన్మించారు. 1959లోని 'చోవా పావా' సినిమాతో డెబ్యూ డైరెక్టర్‌గా ఎంట్రీ ఇచ్చారు. అయితే ఈ సినిమాకు 'యాత్రిక్' పేరుతో సచిన్ ముఖర్జీ, దిలీప్ ముఖర్జీలతోపాటు తరుణ్ మజుందార్ దర్శకత్వం వహించారు. 1960, 70, 80 దశకాల్లో మజుందార్ తెరకెక్కించిన శ్రీమాన్ పృథ్వీరాజ్, కుహెలి, బాలికా వధు, దాదర్ కీర్తి లాంటి సినిమాలకు ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. 1990లో పద్మశ్రీ పురస్కారం వరించగా పలు జాతీయ అవార్డులను సైతం దక్కించుకున్నారు తరుణ్ మజుందార్. చదవండి: కేన్సర్‌తో పోరాటం.. అంతలోనే కరోనా.. 30 ఏళ్లకే స్టార్ నటుడు మృతి హీరో విశాల్‌కు మరోసారి గాయాలు.. షూటింగ్ నిలిపివేత.. మిస్ ఇండియా కిరీటం.. 21 ఏళ్ల అందం సొంతం -
దర్శకులు ఎర్నేని రంగారావు ఇక లేరు
ప్రముఖ దర్శకులు ఎర్నేని రంగారావు గత ఆదివారం (ఈ నెల 18) తుది శ్వాస విడిచారు. కృష్ణా జిల్లా గురజకి చెందిన రంగారావు 20 ఏళ్ల వయసులోనే సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టారు. కెరీర్ ఆరంభంలో మద్రాస్‌లోని వాహినీ స్టూడియోస్‌లో జయరామ రెడ్డితో కలిసి పెయింటర్‌గా, మౌల్డర్‌గా చేశారు. ‘పాతాళ భైరవి’ సినిమాలోని విగ్రహం మౌల్డింగ్‌కి పని చేసినవాళ్లలో రంగారావు ఒకరు. రెండేళ్లు వాహినీ స్టూడియోస్‌లో చేసి, డైరెక్షన్ మీద ఆసక్తితో ప్రముఖ దర్శకులు హెచ్.ఎమ్. రెడ్డి, కేవీ రెడ్డి దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్‌గా చేరారు రంగారావు. రెండేళ్ల తర్వాత జయరామ రెడ్డితో కలిసి బాపు ఫిలింస్ ఆరంభించి, 1960లో ‘టౌన్ బస్’ అనే సినిమాని తెలుగులోకి అనువదించి, విడుదల చేశారు. 1963లో ఎన్టీఆర్, షావుకారు జానకి, గుమ్మడి కలయికలో స్వీయదర్శకత్వంలో ‘సవతి కొడుకు’ అనే సినిమా రూపొందించారు. అలాగే నూతన తారలతో ‘మాయావి’, ‘అర్చన’ అనే చిత్రాలను స్వీయదర్శకత్వంలో తెరకెక్కించారు. వ్యక్తిగత విషయానికొస్తే 1954లో తన మేనకోడలు ఉప్పలపాటి రఘుమా దేవిని పెళ్లాడారు. ఈ దంపతులకు కుమారుడు పూర్ణచంద్ర రావు ఉన్నారు. యూఎస్‌లో డాక్టర్‌గా సెటిలైన తనయుడి దగ్గరకు 1990లో వెళ్లిపోయారు రంగారావు. అక్కడ దాదాపు 300 పెయింటింగ్స్ వేసి, న్యూయార్క్, న్యూజెర్సీలో ప్రదర్శనకు ఉంచారు. యూఎస్ పౌరసత్వం పొందిన రంగారావు 2002లో ఇండియా వచ్చేశారు. 2014లో రఘుమా దేవి కన్నుమూశారు. రంగారావు అంతిమ క్రియలు నేడు గురజలో జరుగుతాయి. -
రాఘవేంద్రరావు, నాగ్ కాంబినేషన్లో మరో చిత్రం
హైదరాబాద్ : దర్శకేంద్రుడు కె. రాఘవేంద్రరావు, హీరో నాగార్జున కాంబినేషన్లో మరో భక్తిరస చిత్రం త్వరలో తెరకెక్కనుంది. ఇటీవల దర్శకుడు రాఘవేంద్రరావు ఆ చిత్ర కథను హీరో నాగార్జునను కలసి వివరించారు. ఇదే విషయంపై రాఘవేంద్రరావు మాట్లాడుతూ... రెండు వారాల క్రితం రాఘవేంద్రరావుగారు కలసి తనకు కథను వివరించారని చెప్పారు. కథ, కథనం మనస్సుకు హత్తుకునే విధంగా ఉందని... తాను నటించేందుకు సిద్దమని రాఘవేంద్రరావుగారికి వెల్లడించినట్లు చెప్పారు. . కథనం చాలా బాగుందని... ఈ చిత్రంలో నటించేందుకు తాను అంగీకరించినట్లు చెప్పారు. అయితే ఇప్పటికే పలు చిత్రాలలో మహాబిజీగా ఉన్న నాగ్... ఆ చిత్రాలు పూర్తికాగానే ఈ చిత్రంలో నటించనున్నారు. ఇప్పటికే కె.రాఘవేంద్రరావు దర్శకత్వంలో హీరో నాగార్జున ప్రధాన పాత్రలో వచ్చిన భక్తిరస చిత్రాలు అన్నమయ్య, శ్రీరామదాసు, షిరిడి సాయి చిత్రాలకు ప్రేక్షక దేవుళ్లు బ్రహ్మరథం పట్టిన సంగతి తెలిసిందే. అలాగే రాఘవేంద్రరావు, నాగార్జున కాంబినేషన్లో త్వరలో తెరకెక్కనున్న ఈ చిత్రం కూడా ప్రేక్షకులు మనసు దోచుకుంటుందని ఫిలింవర్గాలు సమాచారం.