Viaduct construction
-
ఆ మెట్రోకు గిన్నిస్ వరల్డ్ రికార్డ్.. గడ్కరీ ప్రశంసలు
ముంబై: మహారాష్ట్రలోని నాగ్‌పూర్ మెట్రో రైలు అరుదైన ఘనత సాధించింది. ప్రపంచంలోనే అత్యంత పొడవైన రెండంతస్తుల ఫ్లైఓవర్ గల మెట్రోగా గిన్నిస్ రికార్డు సాధించింది. వార్ధా రోడ్లో నిర్మించిన ఈ డబుల్ డక్కర్ వయడక్ట్ సుమారు 3.14 కిలోమీటర్ల మేర ఉంటుంది. నాగ్‌పూర్‌లోని మెట్రో భవన్లో మంగళవారం జరిగిన కార్యక్రమం వేదికగా గిన్నిస్ వరల్డ్ రికార్డ్ సర్టిఫికెట్ అందుకున్నారు మహారాష్ట్ర మెట్రో ఎండీ బ్రిజేశ్ దీక్షిత్. గిన్నిస్ రికార్డ్స్ జడ్జి రిషి నాత్ ధ్రువీకరణ పత్రాన్ని అందించారు. ఈ సందర్భంగా మాట్లాడిన దీక్షిత.. వార్దా రోడ్లో ఈ నిర్మాణాన్ని చేపట్టటం ప్రధాన సవాల్‌గా మారిందన్నారు. ఇది థ్రీటైర్ నిర్మాణం. గడ్కరీ ప్రశంసలు.. నాగ్‌పూర్ మెట్రో రైలు గిన్నిస్ రికార్డ్స్‌లో చోటు సంపాదించిన క్రమంలో మహారాష్ట్ర మెట్రో విభాగానికి శుభాకాంక్షలు తెలిపారు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ. ట్విట్టర్ వేదికగా ప్రశంసలు కురిపించారు. ఇప్పటికే అత్యంత పొడవైన డబుల్ డక్కర్ వయడక్ట్గా ఆసియా బుక్ ఆఫ్ రికార్డ్స్, ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు దక్కించుకుంది. పైన మెట్రో వెళ్తుండగా.. మధ్యలో హైవే, కింద సాధారణ రవాణా మార్గం ఉంటుంది. Another feather in the cap ! Heartiest Congratulations to Team NHAI and Maha Metro on achieving the Guinness Book of World Record in Nagpur by constructing longest Double Decker Viaduct (3.14 KM) with Highway Flyover & Metro Rail Supported on single column. #GatiShakti @GWR pic.twitter.com/G2D26c7EKn — Nitin Gadkari (@nitin_gadkari) December 4, 2022 ప్రపంచవ్యాప్తంగా ఉన్న మెట్రో నిర్మాణాల్లో ఇంత పొడవు మేర రెండంతస్తుల ఫ్లైఓవర్ ఎక్కడా నిర్మించలేదు. దీని పొడవు 3.14 కిలోమీటర్లు ఉంటుంది. గతంలో డబుల్ డక్కర్ వయడక్ట్ పద్ధతిలో అత్యధిక మెట్రో స్టేషన్లు నిర్మించిన విభాగంలోనూ ఆసియా, ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు దక్కించుకుంది మహారాష్ట్ర మెట్రో. ఇదీ చదవండి: ‘ఎయిమ్స్’ తరహాలో ‘ఐసీఎంఆర్’పై సైబర్ దాడి.. 6వేల సార్లు విఫలయత్నం -
బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టులో మరో రికార్డు.. ప్రపంచ దేశాల సరసన భారత్!
Bullet Train Project Made In India: ముంబై- అహ్మదాబాద్ బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టులో ఇండియన్ రైల్వే మరో రికార్డు సృష్టించేందుకు సిద్ధమైంది. ఈ ప్రాజెక్టు నిర్మాణంలో కీలకమైన ఎక్విప్మెంట్ను దేశీయంగా తయారు చేయాలని నిర్ణయించింది. అరుదైన సాంకేతిక పరిజ్ఞాన్ని దేశీయంగానే అభివృద్ధి చేసి ప్రపంచ దేశాల సరసన నిలించేందుకు రెడీ అవుతోంది. వయడక్టు నిర్మాణంలో ముంబై-అహ్మదాబాద్‌ల మధ్య బుల్లెట్ టట్రైన్ పప్రాజెక్టును ఇండియన్ రైల్వే చేపట్టింది. ముంబై నుంచి ఢిల్లీ మధ్య మొత్తం 508 కిలోమీటర్ల నిడివితో పూర్తిగా వయడక్టు పద్దతిలో బుల్లెట్ రైలు ట్రాక్ నిర్మాణం జరుగుతోంది. నేషనల్ హై స్పీడ్ రైల్ కారిడార్ లిమిటెడ్ సంస్థ ఈ ప్రాజెక్టు నిర్మాణ పనులు పర్యవేక్షిస్తోంది. ఈ ప్రాజెక్టులో కీలకమైన వయడక్టు నిర్మాణంలో భారీ క్రేన్లు, స్ట్రడల్ క్యారియర్లు, గర్డర్ ట్రాన్స్పోర్టర్లు వంటి భారీ ఎక్విప్మెంట్ని ఉపయోగించాల్సి ఉంటుంది. మేడ్ ఇన్ ఇండియా బుల్లెట్ రైలు ట్రాక్ నిర్మాణంలో కీలకమైన భారీ ఎక్వీప్మెంట్ని పూర్తి దేశీయంగా తయారు చేస్తున్నారు. తమిళనాడులోని కంచిపురంలో ఉన్న ఎల్ అంట్ టీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫ్యాక్టరీలో తయారు చేస్తున్నారు. బుల్లెట్ ప్రాజెక్టును వీలైనంత త్వరగా పూర్తి చేసే విధంగా 1100 టన్నుల సామర్థ్యం కలిగిన భారీ యంత్రాల తయారీ పనులు ఇక్కడ వేగంగా జరుగుతున్నాయి. ఇటీవల ఇక్కడ తయారైన యంత్రాలను రైల్వేమంత్రి అశ్వినీ వైష్ణవ్ ప్రారంభించారు. వాటి తర్వాత ఇండియానే బుల్లెట్ ట్రైన్ ట్రాక్‌కి సంబంధించి వయడక్టు నిర్మాణ టెక్నాలజీ ఇప్పటి వరకు టెక్నాలజీలో అగ్రగామిగా ఉన్న సౌత్ కొరియా, ఇటలీ, నార్వే, చైనా దేశాల్లోనే అందుబాటులో ఉంది. ప్రపంచంలో ఎక్కడ బుల్లెట్ రైలు నిర్మాణం జరిగినా ఈ భారీ యంత్రాలు ఈ దేశాల నుంచి సరఫరా కావాల్సిందే. అయితే ఇండియా ఆ దేశాలపై ఆధారపడకుండా సొంతంగా భారీ యంత్రాలను రూపొందిస్తోంది. భవిష్యత్తులో ఇతర దేశాల్లో నిర్మాణం జరుపుకునే బుల్లెట్ రైలు ప్రాజెక్టుల్లో కీలక భూమిక నిర్వహించేందుకు రంగం సిద్ధం చేస్తోంది. Flagged off Made in India engineering marvel, a reflection of the 21st Century Mindset. #HighSpeedRailonFastTrack pic.twitter.com/7EzkdPaWFI — Ashwini Vaishnaw (@AshwiniVaishnaw) September 9, 2021 చదవండి: Infosys: ఈ కామర్స్ స్పెషల్.. ఈక్వినాక్స్ సొల్యూషన్స్ -
ఏడంతస్తుల ఎత్తులో
నగరవాసులు మెట్రో రైలు ప్రయాణాన్ని త్వరలో మరింత ఆస్వాదించనున్నారు. ఇందుకు కారణం మూడో దశలో భాగంగా ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్ (డీఎంఆర్సీ).... నగరంలోని దౌలాకువాన్ ప్రాంతంలో త్వరలో మెట్రో రైళ్లను 23.6 మీటర్ల ఎత్తున నడపనుండడమే. దౌలాకువాన్ వద్ద 23 మీటర్ల పొడవైన మెట్రో పిల్లర్లు న్యూఢిల్లీ: మెట్రో మూడో దశలో భాగంగా మజ్లిస్ పార్కు-శివ్‌విహార్ కారిడార్‌లో భాగంగా దక్షిణ క్యాంపస్- ఢిల్లీ కంటోన్మెంట్ స్టేషన్ల మధ్య వయాడక్ట్ నిర్మాణం జరుగుతోంది. దీని పొడవు 59 కిలోమీటర్లు. దీని కిందనే దౌలాకువాన్ ప్రాంతంలో ఎయిర్పోర్ట్ ఎక్స్‌ప్రెస్ మార్గముంది. ఈ మార్గంలో నిత్యం రాకపోకలు సాగించే మెట్రో రైళ్లకు ఎంతమాత్రం అంతరాయం కలగకుండా ఇంజనీర్లు, సిబ్బం ది ఈ పనులను ఆగమేఘాల మీద కొనసాగిస్తున్నా రు. ఈ విషయమై ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్ (డీఎంఆర్సీ) కార్పొరేట్ కమ్యూనికే షన్స్ కార్యనిర్వాహక సంచాలకుడు అనుజ్ దయాళ్ మాట్లాడు తూ ‘దౌలాకువాన్ ప్రాంతంలో నిర్మిస్తున్న మెట్రో రైలు స్థంభాల ఎత్తు దాదాపు ఏడు అంతస్తుల ఎత్తు లో ఉంటాయి. ఇది నగరంలోనే అత్యం త ఎత్తయిన మార్గం కానుంది. గతంలో కర్కర్డుమా ప్రాంతం లో నిర్మించిన మెట్రో మార్గం ఎత్తు 19 మీటర్లు’అని అన్నారు. ఎయిర్‌పోర్టు మార్గంలో రైళ్ల రాకపోకలకు అంతరాయం కలగకుండా ఉండేం దుకుగాను రాత్రి గం 12.30 నుంచి ఉదయం నాలు గు గంటలవరకూ మాత్రమే ఎయిర్‌పోర్టు లైన్‌పైన పనులను చేపడుతున్నామన్నారు.ఈ సమయంలో ఎయిర్పోర్ట్ ఎక్స్‌ప్రెస్ మార్గంలో ఎటువం టి కార్యక్రమాలకు అనుమతి ఉండబోదన్నారు. ప్రయాణికుల సౌకర్యం కోసం డైవర్షన్ రోడ్డును కూ డా నిర్మించామన్నారు. ఎయిర్పోర్ట్ లైన్ కార్యకలాపాలు, నిర్వహణ విభాగం నుంచి అన్పి అనుమతు లూ పొంది న తర్వాతే పనులను ప్రారంభించామన్నారు. తగు భద్రతా చర్యలు దక్షిణ క్యాంపస్- ఢిల్లీ కంటోన్మెంట్ స్టేషన్ల మధ్య వయాడక్ట్ పనులను చేపట్టిన నేపథ్యంలో దీని కింది భాగంలో పనిచేసే సిబ్బందితోపాటు రైళ్లకు భద్రత కల్పించేందుకుగాను డీఎంఆర్సీ తగు భద్రతా చర్య లు తీసుకుంది. ఇందులోభాగంగా ఎయిర్పోర్ట్ మార్గంలోని వివిధ ప్రాంతాల్లో సీసీ టెలివిజన్ కెమెరాలను ఏర్పాటుచేసింది. దీంతోపాటు ఆరుగురు సివిల్ ఇంజనీర్లు, ఇద్దరు భద్రతా నిపుణులు, కార్యకలాపాలు, నిర్వహణ విభాగానికి చెందిన ఇంజనీర్లు, ఇతర నిపుణులతో కూడిన ఆరు బృందాలను ఏర్పాటుచేసింది. ఈ బృందాలు కన్నార్పకుండా తమ తమ బాధ్యతలను నిర్వర్తిస్తున్నాయి. ఎయిర్పోర్ట్ ఎక్స్‌ప్రెస్ మార్గంలోని ప్రస్తుత వయాడక్ట్, ఓవర్ ఎలక్ట్రిఫికేషన్ (ఓహెచ్ఈ)లపై సెగ్మెంట్లను ఏర్పాటుచేసే సమయంలో అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నాయి. ప్రస్తుతం కింది మార్గంలో మెట్రో రైళ్ల రాకపోకలు కొనసాగుతున్న నేపథ్యంలో వాటికి ఎటువంటి నష్టం వాటిల్లకుండా జాగ్రత్తపడుతున్నాయి.