breaking news
Vice President Election
-
కొత్త ఉపరాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్
-
కొత్త ఉప రాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్
సాక్షి, న్యూఢిల్లీ: దేశ 15వ ఉపరాష్ట్రపతిగా బీజేపీ నేతృత్వంలోని నేషనల్ డెమొక్రటిక్ అలయెన్స్ (ఎన్డీఏ) తరఫున పోటీ చేసిన చంద్రపురం పొన్నుస్వామి రాధాకృష్ణన్ ఎన్నికయ్యారు. కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా కూటమి పక్షాల ఉమ్మడి అభ్యర్థి జస్టిస్ బి.సుదర్శన్‌రెడ్డిపై ఆయన ఘన విజయం సాధించారు. రాధాకృష్ణన్ 452 ఓట్లు సాధించగా జస్టిస్ సుదర్శన్‌రెడ్డి 300 ఓట్లు పొందారు. దీంతో 152 ఓట్ల తేడాతో రాధాకృష్ణన్ గెలుపొందినట్లు ఎన్నికల రిటర్నింగ్ అధికారి, రాజ్యసభ సెక్రటరీ జనరల్ పీసీ మోదీ మంగళవారం రాత్రి ప్రకటించారు. దీంతో రాధాకృష్ణన్ త్వరలోనే ఉపరాష్ట్రపతిగా ప్రమాణస్వీకారం చేపట్టనున్నారు. తమిళనాడు నుంచి ఈ పదవిని అధిష్టించిన సర్వేపల్లి రాధాకృష్ణన్, ఆర్.వెంకట్రామన్‌ల తర్వాత మూడో నాయకుడిగా సీపీ రాధాకృష్ణన్ చరిత్రకెక్కారు. ఘన విజయం... ఉపరాష్ట్రపతి ఎన్నికల పోలింగ్ నూతన పార్లమెంట్ భవనంలోని ‘వసుధ ఎఫ్–101’లో మంగళవారం ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు జరిగింది. ఈ పోలింగ్‌లో మొత్తంగా 767 మంది ఎంపీలు ఓటు హక్కును వినియోగించుకున్నారు. ప్రస్తుతం రాజ్యసభలో 6, లోక్‌సభలో ఒక ఖాళీ స్థానాన్ని పక్కనబెడితే లోక్‌సభలో 542 మంది, రాజ్యసభలో 239 మంది కలిపి 781 మంది ఎంపీలు ఓటింగ్‌లో పాల్గొనాల్సి ఉంది. అయితే ముందే ప్రకటించినట్లుగా బీఆర్ఎస్కు చెందిన నలుగురు ఎంపీలు, ఏడుగురు బీజేడీ ఎంపీలతోపాటు శిరోమణి అకాలీదళ్ ఎంపీ ఒకరు, స్వతంత్ర ఎంపీ సరబ్జీత్సింగ్ ఖల్సా ఓటింగ్‌కు దూరంగా ఉన్నారు. దీంతో మొత్తంగా 767 (98.2 శాతం) ఓట్లు పోలయ్యాయి. విజయానికి అవసరమైన ఓట్లను 377గా నిర్ణయించారు. సాయంత్రం 6 గంటల నుంచి ఓట్లను లెక్కించి రాత్రి 7:30 గంటలకు ఫలితాన్ని ప్రకటించారు. మొత్తం పోలైన 767 ఓట్లలో చెల్లని ఓట్లు 15 ఉండగా మిగిలిన 752 ఓట్లలో రాధాకృష్ణన్‌కు 452 మొదటి ప్రాధాన్యతా ఓట్లు లభించాయని.. జస్టిస్ బి.సుదర్శన్‌రెడ్డికి 300 మొదటి ప్రాధాన్యత ఓట్లు వచ్చాయని ఎన్నికల రిటర్నింగ్ అధికారి పీసీ మోదీ ప్రకటించారు. అనుకున్నట్లే క్రాస్ ఓటింగ్ ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో అందరూ ఊహించినట్లే క్రాస్ ఓటింగ్ జరిగినట్లు తెలిసింది. ఇండియా కూటమిలోని పక్షాలు, తమకు మద్దతుగా వచ్చిన ఆప్ సహా ఇతర చిన్నాచితక పార్టీలతో కలిసి కాంగ్రెస్ కనీసం 324 ఓట్లు వస్తాయని అంచనా వేసింది. పోలింగ్ జరుగుతున్న సమయంలోనే ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి జైరాం రమేశ్ ‘ప్రతిపక్షాలు ఐక్యంగా నిలబడ్డాయి. కూటమికి చెందిన 315 మంది ఎంపీల్లో అందరూ ఓటింగ్ కోసం హాజరయ్యారు’అని ‘ఎక్స్’లో పోస్ట్ చేశారు. అయితే కాంగ్రెస్ పేర్కొన్నట్లుగానే 15 ఓట్లు క్రాస్ ఓటింగ్ అయ్యాయి. దీంతోపాటు చెల్లని ఓట్లు సైతం ఇండియా కూటమి పక్షాలవేనని ప్రచారం జరుగుతోంది. అదే జరిగితే 20–25 ఓట్లు ఎన్డీఏ అభ్యర్థికి క్రాస్ ఓటింగ్ జరిగి ఉండొచ్చని భావిస్తున్నారు. మరోవైపు రాధాకృష్ణన్‌కు ఎన్డీయే కూటమిలోని 427 మంది ఎంపీల మద్దతు ఉందని బీజేపీ కాగితంపై లెక్కలేసుకోగా పోలింగ్‌లో మాత్రం అంతకన్నా ఎక్కువగానే ఓట్లు లభించాయి. రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్ నేతృత్వంలో నిర్వహించిన సమర్థవంతమైన ఫ్లోర్ మేనేజ్మెంట్ కారణంగా ఎన్డీయే సునాయాశ విజయం సాధించిందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఎన్డీఏ కూటమి పక్షాలకు రెండ్రోజులపాటు నిర్వహించిన శిక్షణా తరగతులు, మిత్రపక్షాలతో సమన్వయం, పోలింగ్‌కు ముందు ప్రాంతాలవారీగా ఎంపీలతో సమన్వయం రాధాకృష్ణన్ గెలుపునకు దోహదం చేసిందని చెబుతున్నారు. మిన్నంటిన సంబరాలు.. సీపీ రాధాకృష్ణన్ విజయం సాధించిన వెంటనే బీజేపీలో సంబరాలు మొదలయ్యాయి. కేంద్ర మంత్రి ప్రల్హాద్ జోషి నివాసం ముందు తమిళనాడు సంప్రదాయాలతో కూడిన సాంస్కృతిక కార్యక్రమాలు మొదలయ్యాయి. సీపీ రాధాకృష్ణన్‌కు బీజేపీ ఎంపీలతోపాటు ఆయనకు మద్దతిచ్చిన పక్షాల ఎంపీలు శుభాకంక్షలు తెలిపారు. రాష్ట్రపతి, ప్రధాని, అమిత్ షా, ఖర్గే శుభాకాంక్షలు ఉపరాష్ట్రపతిగా ఎన్నికైన సీపీ రాధాకృష్ణన్‌కు రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము, ప్రధాని మోదీ, కేంద్ర అమిత్ షా సహా పలువురు శుభాకాంక్షలు తెలుపుతూ ‘ఎక్స్’లో పోస్ట్‌లు చేశారు. ‘ఉపరాష్ట్రపతిగా ఎన్నికైన రాధాకృష్ణన్‌కు అభినందనలు. ప్రజాజీవితంలో దశబ్దాల గొప్ప అనుభవం, దేశ పురోగతికి గణనీయంగా దోహడపతుంది. విజయవంతమైన, ప్రభావవంతమైన పదవీకాలం కోసం మీకు ఇవే నా శుభాకాంక్షలు’అని రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము తన సందేశాన్ని ‘ఎక్స్’లో పోస్ట్ చేశారు. ‘రాధాకృష్ణన్‌కు ఎంపీగా, వివిధ రాష్ట్రాల గవర్నర్‌గా గొప్ప అనుభవం ఉంది. ఆయన పార్లమెంటరీ జోక్యాలు ఎల్లప్పుడూ చురుకైనవి. గవర్నర్‌గా పదవీకాలంలో, సాధారణ పౌరులు ఎదుర్కొన్న సవాళ్లను పరిష్కరించడంపై దృష్టి పెట్టారు. ఈ అనుభవాలు ఆయనకు శాసన, రాజ్యాంగ విషయాలపై అపార జ్ఞానం ఉందని నిర్ధారించాయి. ఆయన స్ఫూర్తిదాయకమైన ఉపరాష్ట్రపతి అవుతారని నాకు నమ్మకం ఉంది‘ప్రధాని మోదీ పేర్కొన్నారు. రాధాకృష్ణన్ నాయకత్వ లక్షణాలను, పరిపాలనపై ఆయనకున్న లోతైన జ్ఞానాన్ని అమిత్ షా ప్రశంసించారు. రాధాకృష్ణన్ అనుభవం, అట్టడుగు స్థాయి నేపథ్యం దేశ పార్లమెంటరీ ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేయడానికి, అణగారిన వర్గాలకు సేవ చేయడానికి సహాయపడతాయని షా విశ్వాసం వ్యక్తం చేశారు. ఎగువ సభ సంరక్షకుడిగా ఆయన కొత్త పాత్రలో విజయం సాధించాలని ఆకాంక్షించారు. ఉపరాష్ట్రపతి పదవికి రాజీనామా చేసినప్పటి నుంచి పెదవివిప్పని జగ్దీప్ ధన్‌ఖడ్.. సీపీ రాధాకృష్ణన్ విజయం నేపథ్యంలో తొలిసారి స్పందించారు. ప్రజాజీవితంలో రాధాకృష్ణన్‌కు ఉన్న అపార అనుభవంతో ఉపరాష్ట్రపతి కార్యాలయం మరింత ఖ్యాతిని పొందుతుందని పేర్కొన్నారు. ఈ మేరకు రాధాకృష్ణన్‌కు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆయనకు లేఖ రాశారు. ఒత్తిళ్లకు లొంగరని ఆశిస్తున్నాం: ఖర్గే ‘ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో విజయం సాధించిన సీపీ రాధాకృష్ణన్‌కు శుభాకాంక్షలు. ఇండియా కూటమి అభ్యర్థి బి.సుదర్శన్‌రెడ్డి పోరాటానికి మా హృదయపూర్వక కృతజ్ఞతలు. రాధాకృష్ణన్ పార్లమెంటరీ సంప్రదాయాల అత్యున్నత నైతికతను నిలబెట్టుకుంటారని, ప్రతిపక్షాలకు గౌరవాన్ని ఇస్తారని, ఒత్తిళ్లకు లొంగరని ఆశిస్తున్నా. వర్షాకాల సమావేశాల్లో జగదీప్ ధన్‌ఖడ్ అకస్మాత్తుగా రాజీనామా చేశారు, ఇది ఎందుకు అనేది ఎప్పటికీ వివరించలేం. రాజ్యాంగ స్థానాలపట్ల గౌరవం ఇవ్వాల్సిన బాధ్యత మనపై ఉంది’అని ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే పేర్కొన్నారు. -
Vice President Election: ఓటు హక్కు వినియోగించుకున్న ప్రధానమంత్రి మోదీ
-
ఆ వ్యాఖ్యలు అహంకారానికి నిదర్శనం: కేటీఆర్
గత పదేళ్లుగా బీజేపీకి బలంగా మద్దతు ఇచ్చిన రెండు పార్టీలు ఉపరాష్ట్రపతి ఎన్నికలో ఓటింగ్‌కు దూరంగా ఉండాలని నిర్ణయించాయి. ఇది రాబోయే రాజకీయ దిశకు సంకేతమా? అంటూ కాంగ్రెస్ సీనియర్ నేత జైరాం రమేష్ ట్వీట్ చేశారు. దీనికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారకరామారావు ఘాటుగా స్పందించారు. జైరాం జీ, మీ అహంకార భావం.. అధికారం మీద అధిక హక్కు ఉన్నట్టు భావించడం వల్లే కాంగ్రెస్ పార్టీ సమకాలీన రాజకీయాల్లో విఫలమైంది. ‘మీతో లేకపోతే వారితో’ అనే వాదన దేశం రెండు ధృవాలుగా ఉందన్నట్టుగా చూపించే అర్థహీనమైన వాదన. మేము కాంగ్రెస్‌కో, బీజేపీ బీ-టీమ్ కూడా కాదు. మేము తెలంగాణ ప్రజల ఏ-టీమ్.దయచేసి మీ వైఫల్యాలపై దృష్టి పెట్టండి, మమ్మల్ని వదిలేయండి అని ఎక్స్ ఖాతాలో ట్వీట్ చేశారాయన.ఉపరాష్ట్రపతి ఎన్నికలో బీఆర్ఎస్, ఒడిశా బీజేడీలు ఓటింగ్‌కు దూరంగా ఉన్నాయి. ఈ వ్యవహారాన్నే ప్రస్తావిస్తూ జైరాం రమేష్.. ఓటింగ్‌కు దూరంగా ఉండే పార్టీలు బీజేపీకి మద్దతు ఇస్తున్నట్లే అని అన్నారు. అందుకే కేటీఆర్ ఇలా స్పందించారు. Two parties who have stood with the BJP staunchly over the past decade in Parliament have decided to abstain in the Vice Presidential election tomorrow. The shape of things to come?— Jairam Ramesh (@Jairam_Ramesh) September 8, 2025Jairam Ji, This sense of entitlement and arrogance is what made Congress fail in contemporary politics ‘Either you are with us or else you’re with them’ claim is a silly argument posturing as if the nation is bipolarWe are neither B-team of Congress or BJPWe are the A-team… https://t.co/xrIvSE7AeZ— KTR (@KTRBRS) September 9, 2025 -
ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో సీపీ రాధాకృష్ణన్ ఘన విజయం
ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీఏ అభ్యర్థి సీపీ రాధాకృష్ణన్ ఘన విజయంఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీఏ అభ్యర్థి సీపీ రాధాకృష్ణన్ ఘన విజయం452 ఓట్లు సాధించిన సిపి రాధాకృష్ణ98.2 పోలింగ్ శాతం నమోదుచెల్లని ఓట్లు 15ఉపరాష్ట్రపతి ఎన్నిక.. ముగిసిన పోలింగ్ ఉపరాష్ట్రపతి ఎన్నిక.. ముగిసిన పోలింగ్ ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీఏ తరఫున మహారాష్ట్ర గవర్నర్ సీ.పీ. రాధాకృష్ణన్ప్రతిపక్ష ఇండియా కూటమి తరఫున మాజీ సుప్రీం కోర్టు న్యాయమూర్తి బి. సుదర్శన్ రెడ్డి పోటీఇందుకోసం పార్లమెంట్ భవనంలో ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ సాయంత్రం 6 గంటల తర్వాత ప్రారంభం కానున్న ఓట్ల లెక్కింపు ఫలితాలు ఈ రాత్రి ప్రకటించబడే అవకాశం ఉంది.ఓటింగ్‌కు దూరంగా ఉన్న పార్టీలుబీఆర్ఎస్, బీజేడీ,శిరోమణి అకాలీ దళ్లు ఓటింగ్‌కు దూరం వీరి నిర్ణయం వల్ల తగ్గిన ఓటింగ్ కానీ ఎన్డీఏకు స్పష్టమైన ఆధిక్యం ఉందని అంచనాఓటేసిన లోక్‌సభ స్పీకర్ఉపరాష్ట్రపతి ఎన్నిక.. కొనసాగుతున్న పోలింగ్ఓటేసిన లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాఇది బీజేపీకి ఎదురుదెబ్బే: సంజయ్ రౌత్ఉపరాష్ట్రపతి ఎన్నిక పోలింగ్‌కు బీఆర్ఎస్, బీజేడీ, అకాలీదళ్ దూరంఈ మూడు బీజేపీతో గతంలో అంటకాగిన పార్టీలేనన్న శివసేన ఎంపీ సంజయ్ రౌత్ఇప్పుడు దూరంగా ఉండడం ఆ పార్టీకి ఎదురుదెబ్బేనని వ్యాఖ్య96 శాతం పోలింగ్ నమోదుకొనసాగుతున్న ఉపరాష్ట్రపతి ఎన్నిక పోలింగ్3గం. దాకా 96 శాతం పోలింగ్ నమోదు5 గం. దాకా జరగనున్న పోలింగ్6గం. కౌంటింగ్ మొదలు7.45గం. కి ఫలితం వెల్లడిఇండియా కూటమి వైపే ఒవైసీఇండియా కూటమి అభ్యర్థిగా జస్టిస్ బీ సుదర్శన్రెడ్డిసుదర్శన్రెడ్డికి మద్దతు ప్రకటించిన ఎంఐఎంహైదరాబాద్వాసి, గౌరవనీయుడైన న్యాయకోవిదుడికి మద్దతంటూ ఒవైసీ ట్వీట్ఓటు హక్కు వినియోగించుకున్న ఒవైసీవిజయంపై ఎన్డీయే ధీమాఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీయే అభ్యర్థి సీపీ రాధాకృష్ణన్రాత్రికల్లా వెలువడనున్న ఫలితంసంఖ్యా బలం దృష్ట్యా.. విజయంపై ఎన్డీయే ధీమాముందస్తుగా.. విందు ఏర్పాట్లలో ముమ్మరంకేంద్ర మంత్రి ప్రహ్లాద్ ఇంట ఎన్టీయే కూటమి కీలక నేతలకు విందు ఏర్పాట్లుఓటు హక్కు వినియోగించుకున్న వైఎస్సార్సీపీ ఎంపీలుఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఓటేసిన వైఎస్సార్సీపీ ఎంపీలుఎన్డీఏ అభ్యర్థి రాధాకృష్ణన్‌కి మద్దతు ప్రకటించిన వైఎస్సార్‌సీపీపోలింగ్‌కు దూరంగా మరో పార్టీఉపరాష్ట్రపతి ఎన్నికలకు దూరంగా శిరోమణి అకాలీదల్పార్లమెంట్లో ఎస్ఏడీ సంఖ్యా బలం.. మూడుఈ ఎన్నికలకు దూరంగా ఉంటామని ఇప్పటికే ప్రకటించిన బీజేడీ, బీఆర్ఎస్ఓటు హక్కు వినియోగించుకోనున్న 769 మంది ఎంపీలుకొనసాగుతున్న ఉపరాష్ట్రపతి పోలింగ్ఒక్కొక్కరుగా ఓటు వేస్తున్న ఎంపీలుసాయంత్రం 6గంటల తర్వాత వెలువడనున్న ఫలితాలుతొలి ఓటు వేసిన ప్రధాని మోదీఉపరాష్ట్రపతి ఎన్నికల పోలింగ్ ప్రారంభంతొలి ఓటు వేసిన ప్రధాని మోదీఅనంతరం.. సోనియా గాంధీ, ప్రియాంక గాంధీ, జేపీ నడ్డా, మల్లికార్జున ఖర్గే తదితరులుఓటింగ్ వేళ ప్రత్యేక ఆకర్షణగా కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ఓటేశాక.. మీడియాతో మాట్లాడకుండా వెళ్లిపోయిన రాహుల్ గాంధీసాయంత్రం ఐదు గంటల దాకా జరగనున్న పోలింగ్ఎంపీలకు గులాబీ రంగు బ్యాలెట్ పత్రాలు పంపిణీ నో విప్.. తమకు నచ్చిన అభ్యర్థికి ప్రాధాన్యం ప్రకారం ఓట్లేయనున్న ఎంపీలు నచ్చిన అభ్యర్థి పేరుకు ఎదురుగా గడిలో 1 అంకెతదుపరి ప్రాధాన్యం ఇచ్చే అభ్యర్థి పేరు ఎదుటనున్న గడిలో 2 అంకె ఎన్నికల సంఘం సమకూర్చే పెన్నుతోనే మార్కింగ్ఉపరాష్ట్రపతి ఎన్నికకు సర్వం సిద్ధంమరికాసేపట్లో పార్లమెంటు భవనంలోని ‘ఎఫ్-101 వసుధ’లో ప్రారంభం కానున్న పోలింగ్ 6 గంటలకు ఓట్ల లెక్కింపు రాత్రికి విజేతను ప్రకటించే అవకాశంఎన్డీయే అభ్యర్థి సీపీ రాధాకృష్ణన్, ఇండియా కూటమి అభ్యర్థి జస్టిస్ సుదర్శన్‌రెడ్డిల మధ్య పోరుమద్దతు ఇలా.. పార్లమెంటు ఉభయసభల సభ్యుల సంఖ్య 788 ఏడు స్థానాలు ఖాళీ కావడం వల్ల ప్రస్తుతం 781 మందే పోలింగుకు దూరంగా బీఆర్ఎస్ (4 రాజ్యసభ), బీజేడీ(7) లెక్క ప్రకారం.. 386 ఓట్లు దక్కించుకున్నవారు విజేతబలాబలాలు.. ఎన్డీయేకి 425 మంది సభ్యుల బలం.. ఇతరుల మద్దతు కలిపితే ఆ సంఖ్య 438కి మించే అవకాశం ఇండియా కూటమికి 314 మంది ఎంపీల మద్దతు ! ఏదైనా అద్భుతం జరిగితే తప్పా.. ఎన్డీయే అభ్యర్థి గెలుపు లాంఛనమే! బ్యాలెట్ ఓటింగ్రహస్య బ్యాలెట్ విధానంలో ఉపరాష్ట్రపతి ఎన్నిక ప్రాధాన్య ఓట్లు వేసే పద్ధతి కావడం వల్ల బ్యాలెట్లనే వాడకం. ఈవీఎంలలో ఈ సదుపాయం లేదు.తమ ప్రాధాన్యం ప్రకారం ఆయా అభ్యర్థులకు ఓట్లేయనున్న ఎంపీలు అభ్యర్థులిద్దరికీ సమానంగా ఓట్లువస్తే అప్పుడు మాత్రమే రెండో ప్రాధాన్య ఓట్లను పరిగణనలో తీసుకుంటారు.నచ్చిన అభ్యర్థికే ఓటింగ్తమ సభ్యులకు విప్ జారీచేయకూడదని పార్టీలకు ఎన్నికలసంఘం స్పష్టీకరణ. ఎంపీలు తమకు నచ్చిన అభ్యర్థికి ఓటేసే అవకాశం ప్రతిష్టాత్మకంగా తీసుకుని పోటాపోటీగా ప్రచారం చేసిన ఎన్డీయే, ఇండియా కూటమి అభ్యర్థులు గత రెండ్రోజులుగా ఎంపీలందర్నీ ఢిల్లీకి రప్పించి ఓటింగుకు సమాయత్తం చేసిన ఇరు కూటములుఇప్పటికే ముగిసిన నమూనా(మాక్) పోలింగ్ గతంలో.. ఫస్ట్ టైం.. 2022 ఎన్నికల్లో ఉపరాష్ట్రపతి పదవికి ఎన్నిక ఓట్లేసిన 725 మంది ఎంపీలు ఎన్డీయే అభ్యర్థి జగదీప్ ధన్‌ఖడ్‌కు 528 (74.37%), ప్రతిపక్ష కాంగ్రెస్ అభ్యర్థి మార్గరెట్ ఆళ్వాకు 182 (25.63%) దక్కిన ఓట్లు 15 ఓట్లు చెల్లలేదు. 55 మంది ఓటింగుకు గైర్హాజరు 2025 ఉపరాష్ట్రపతి ఎన్నికల వేళ.. తగ్గిన ఎన్డీయే సంఖ్యాబలం