Vice-President Venkaiah Naidu
-
‘రుణమాఫీ శాశ్వత పరిష్కారం కాదు’
న్యూఢిల్లీ: వ్యవసాయ రంగంలో ఎదురవుతున్న సంక్షోభాలకు రుణమాఫీ శాశ్వత పరిష్కారం కాదని ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు అన్నారు. 2019లో కేంద్రంలో అధికారంలోకి వస్తే వ్యవసాయ రుణాలు మాఫీ చేస్తామని కాంగ్రెస్ ప్రకటించిన నేపథ్యంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. వ్యవసాయ రంగంలో విశేష సేవలు అందించినందుకుగాను ప్రముఖ వ్యవసాయ శాస్త్రవేత్త ఎమ్మెస్ స్వామినాథన్‌కు ప్రైవేట్ సంస్థ ఐసీఎఫ్ఏ అగ్రికల్చర్ ప్రైజ్ ప్రకటించింది. శుక్రవారం ఇక్కడ జరిగిన కార్యక్రమంలో వెంకయ్య చేతుల మీదుగా అగ్రికల్చర్ ప్రైజ్ కింద లక్ష డాలర్ల బహుమతిని స్వామినాథన్‌కు అందజేశారు. అగ్రికల్చర్ ప్రైజ్‌ను మొదటిసారి అందుకున్న వ్యక్తి స్వామినాథన్ కావడం విశేషం. రైతుల సమస్యలపై పార్లమెంటు, రాజకీయ పార్టీలు, నీతి ఆయోగ్, మీడియా దృష్టి కేంద్రీకరించాలని వెంకయ్య సూచించారు. రుణ మాఫీ, ఉచిత విద్యుత్ వంటి పథకాలను తీసుకురావడం సరికాదన్నారు. ఒకసారి రైతుల రుణాలు మాఫీ చేయడం శాశ్వత పరిష్కారం కాదని పేర్కొన్నారు. రుణాలు ఇచ్చి తిరిగి కట్టవద్దని చెప్పే బ్యాంకులు ఉన్నాయా? అని ప్రశ్నించారు. శాశ్వత పరిష్కారాల కోసం శాస్త్రవేత్తలు, పాలసీ రూపకర్తలు దృష్టి కేంద్రీకరించాలని అన్నారు. -
ఎల్పీయూ స్నాతకోత్సవంలో ఉపరాష్ట్రపతి
జలంధర్: పంజాబ్‌లోని జలంధర్‌లో జరిగిన లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీ(ఎల్పీయూ) 9వ స్నాతకోత్సవంలో ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. ఆ తర్వాత స్నాతకోత్సవంలో భాగంగా గోల్డ్ మెడల్ సాధించిన 98 మంది టాపర్లకు, పీహెచ్డీ డిగ్రీలు పూర్తి చేసిన 54 మంది విద్యార్థులకు డిగ్రీలు, మెడల్స్‌ను ఉపరాష్ట్రపతి వెంకయ్య ప్రదానం చేశారు. స్నాతకోత్సవంలో యూనివర్సిటీ 2017, 2018 బ్యాచ్‌లకు చెందిన 38,000 మంది విద్యార్థులకు డిగ్రీలు/డిప్లమోలను ప్రదానంచేసింది. వీరితోపాటు 13,018 మంది రెగ్యులర్ విద్యార్థులు, 223 మంది పార్ట్‌టైమ్, 24,685 మంది డిస్టెన్స్ విద్యార్థులు డిగ్రీ/డిప్లమోలు తీసుకున్నారు. ఈ కార్యక్రమంలో భారతీయ విద్యార్థులతోపాటు 70కిపైగా దేశాల నుంచి వచ్చి ఎల్పీయూలో విద్యనభ్యసించిన విదేశీ విద్యార్థులూ డిగ్రీ/డిప్లమోలు సాధించారు. ఈ కార్యక్రమంలో ఎల్పీయూ చాన్స్‌లర్ అశోక్ మిట్టల్, వైస్ చాన్స్‌లర్ నరేశ్ మిట్టల్, ఉన్నతాధికారులు, వేలాది మంది విద్యార్థులు, తల్లిదండులు పాల్గొన్నారు. -
కొంచెం పులుపు... కొంచెం తీపి...
సాక్షి, న్యూఢిల్లీ: తన ఏడాది పదవీకాలం ఒకింత పులుపుగా.. ఒకింత తీపిగా ఉందని ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్య నాయుడు వ్యాఖ్యానించారు. పాతికేళ్లుగా ఏటా మీడియా ప్రతినిధులకు విందు ఏర్పాటు చేస్తున్న వెంకయ్య.. ఉపరాష్ట్రపతి అయ్యాక కూడా ఆ ఆనవాయితీని కొనసాగించారు. సోమవారం తన అధికారిక నివాసంలో విందు ఏర్పాటు చేశారు. బూరెలు, డబల్ కా మీఠా నుంచి చేపల కూర వరకు దక్షిణాది వంటకాలతో రుచికరంగా విందు ఏర్పాటు చేశారు. తాను ఉప రాష్ట్రపతి అయ్యాక నిర్మించిన సమావేశ మందిరాల విశేషాలను, అక్కడ జరిగే సంగీత సాహిత్య కార్యక్రమాలను వివరించారు. ఈ పదవిని ఎలా ఆస్వాదిస్తున్నారు.. ఇతర పదవులకు దీనికి ఉన్న తేడా ఏంటన్న ప్రశ్నలకు వెంకయ్య బదులిస్తూ ‘‘కట్టా.. మీటా.. అని ఒక్క మాటలో చెప్పగలను. పని లేకుండా నేను ఉండను.. పనిలోనే ఆనందాన్ని పొందుతాను. ప్రజలతో మమేకమవడం నా బలహీనత. వారిని కలవడం, మాట్లాడటం, నడవడం, కలిసి తినడం ఇష్టం. అందరి ఇళ్లకు వెళ్లేవాడిని. నా కూతురు.. ‘మా నాన్న అప్పుడప్పుడు మా ఇంటికి కూడా వస్తుంటారు’ అని వ్యంగ్యంగా అనేది. దేశంలో అన్ని రాష్ట్రాలు, దాదాపు అన్ని జిల్లాలు తిరిగాను. ఏనాడూ అలసిపోలేదు. ఇప్పుడు ప్రోటోకాల్ కారణంగా ప్రజలతో నిత్యం మమేకమవడం కష్టసాధ్యమైన పని’’అని తెలిపారు. సర్దుకుపోతున్నా.. ‘‘స్పందించకుండా ఉండలేను.. కానీ ఈ పదవిలో ఉంటూ రియాక్ట్ అవడం కుదరదు.. రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్నప్పుడు ఏదైనా మాట్లాడాలన్నా కాన్స్టిట్యూషన్ ఫ్రేమ్‌వర్క్‌కు లోబడి మాట్లాడాలి. ప్రోటోకాల్ కారణంగా వ్యక్తిగతంగా ఎక్కడికి వెళ్లాల న్నా కుదరదు. సాధారణ విమానాల్లోనూ వెళ్లడం కుదరదు. ఇలాంటి చిన్న చిన్న ఇబ్బందులు ఉంటా యి. సర్దుకుపోతున్నా. ప్రజలను, రైతులను, విద్యార్థులను కలవడంపై చాలా ఆసక్తి ఉంది. ఈ పదవిలో ఉన్నా కలుస్తూనే ఉంటాను. విశ్వవిద్యాలయాలను తరచుగా సందర్శిస్తాను. సైన్స్ రీసెర్చ్ ల్యాబొరేటరీలను సందర్శిస్తాను’’అని పేర్కొన్నారు. ‘‘2019 ఎన్నికల వరకు రాజకీయాల్లో ఉండి.. తర్వాత సామాజిక సేవాలో నిమగ్నమవ్వాలనుకున్నా. కానీ ఉపరాష్ట్రపతినయ్యాను. కొంత సమ యం కుటుంబానికి కేటాయించడానికి అవకాశం దొరకడంతో వారూ సంతోషపడుతున్నారు’’అని పేర్కొన్నారు. పార్టీ ఫిరాయింపులపై.. ‘‘పార్లమెంటు సమావేశాలు సజావుగా సాగితే అధికారపక్షం, విపక్షాలు, ప్రజలు ఆస్వాదించవచ్చు. నిబంధనలను పాటించాలని అనడం, పాటించడం కష్టమే. కానీ వాటి నుంచి వచ్చే ఫలితాలు ఊహించని రీతిలో ఉంటాయి. పార్టీ ఫిరాయింపుల పిటిషన్‌పై తక్షణం నిర్ణయం తీసుకోవడం రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్నవారికి వన్నె తెస్తుంది. అందరూ దాన్ని ఆదర్శంగా తీసుకుంటారని భావిస్తున్నా’’అని వెంకయ్య పేర్కొన్నారు. -
రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ ఎన్నికపై కసరత్తు
సాక్షి, న్యూఢిల్లీ : రాజ్యసభ (ఎగువసభ) డిప్యూటీ చైర్మన్ పీజే కురియన్ పదవీ కాలం నేటితో ముగుస్తుంది. ఈ సందర్భంగా ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ఆయనకు వీడ్కోలు విందు ఏర్పాటు చేశారు. ఈ వీడ్కోలు సమావేశానికి రాజ్యసభలోని వివిధ పార్టీలకు చెందిన నేతలను వెంకయ్యనాయుడు ఆహ్వానించారు. ఆదివారం సాయంత్రం వెంకయ్య నాయుడి నివాసంలో ప్రారంభమైన ఈ సమావేశానికి వైఎస్సార్ సీపీ ఎంపీ విజయసాయి రెడ్డి, వివిధ పక్షాల నేతలు హాజరయ్యారు. మరోవైపు కొత్త డిప్యూటీ చైర్మన్ ఎంపిక కోసం అధికార బీజేపీ కసరత్తు మొదలు పెట్టింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మాత్రం రాజ్యసభ చైర్మన్ ఎన్నికను ఏకగ్రీవం చేయడానికే మొగ్గుచూపుతున్నట్లు అధికార వర్గాలు చెబుతున్నాయి. కాంగ్రేసేతర పార్టీలకు ఎగువ సభ చైర్మన్‌గా అవకాశం ఇవ్వాలని మోదీ భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో జనతాదళ్, తృణమూల్ కాంగ్రెస్ పార్టీలతో బీజేపీ నేతలు చర్చలు జరుపుతున్నారు. -
పీపీ రావుకు కన్నీటి వీడ్కోలు
సాక్షి, న్యూఢిల్లీ: ప్రముఖ న్యాయవాది పీపీ రావు అంత్యక్రియలు గురువారం ఢిల్లీలోని లోధీ శ్మశానవాటికలో ముగిశాయి. జస్టిస్ చలమేశ్వర్, జస్టిస్ ఎల్.నాగేశ్వరరావు సహా పలువురు సుప్రీంకోర్టు ప్రస్తుత, విశ్రాంత న్యాయమూర్తులు, ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ, అనేకమంది న్యాయవాదులు అంత్యక్రియలకు హాజరయ్యారు. అంతకుముందు పి.పి.రావు భౌతిక కాయానికి ఆయన నివాసంలో ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు సహా పలువురు ప్రముఖులు నివాళులర్పించారు. రాజ్యాంగ, న్యాయ నిపుణులుగా పేరు గాంచిన రావు ఈ ఏడాది జూలై మాసంలోనే న్యాయవాద వృత్తిలో 50 ఏళ్లు పూర్తిచేసుకున్నారని వెంకయ్య గుర్తుచేశారు. కేంద్ర సమాచార కమిషనర్ మాడభూషి శ్రీధరాచార్యులు కూడా నివాళులర్పించిన వారిలో ఉన్నారు.