Viceroy Hotel
-
వైస్రాయ్ హోటల్ అప్పుడు ఏమైంది చంద్రబాబు?
సాక్షి, అమరావతి: పశ్చిమ బెంగాల్లో ప్రధాని నరేంద్ర మోదీ చేసిన వ్యాఖ్యలపై ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు స్పందించిన తీరుపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. 40 మంది టీంఎంసీ ఎమ్మెల్యేలు పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి వ్యతిరేకంగా ఉన్నారని మోదీ చెబితే.. ప్రధాని ప్రజాస్వామ్యాన్ని వెక్కిరిస్తున్నారని మాట్లాడుతన్న చంద్రబాబు గతంలో ఏం చేశారని ప్రశ్నించారు. ఈ మేరకు ఆయన ట్విటర్ వేదికగా చంద్రబాబుపై వ్యంగ్యాస్త్రాలు సంధించారు. 23 మంది వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలను టీడీపీలోకి లాక్కున్నప్పుడు, వైస్రాయ్ హోటల్లో ఎన్టీఆర్‌కు సపోర్టు చేసిన ఎమ్మెల్యేలను దాచిపెట్టినప్పుడు ప్రజాస్వామ్యం ఏమైందని చంద్రబాబును నిలదీశారు. కర్ణాటక ఎలక్షన్లో హంగ్ వచ్చినప్పుడు జేడీఎస్ నేత కుమారస్వామికి సపోర్టు చేసిన 110 మంది ఎమ్మెల్యేలను హైదరాబాద్‌కు తీసుకువచ్చి హోటల్లో దాచినప్పుడు ప్రజాస్వామ్యం గుర్తుకురాలేదా అని ప్రశ్నించారు. మోదీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఒక మాట అన్నారు.. కానీ ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తూ తమరు ఎన్ని వేషాలు వేశారో మర్చిపోయారా అంటూ చంద్రబాబుపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. -
వెన్నుపోటు @ 20ఏళ్లు
►ఎన్టీఆర్‌కు అవమానం.. ప్రజలకు మానని గాయం ►అల్లుడని చేరదీస్తే... చెప్పులు వేయించిన చంద్రబాబు దగ్గరగా ఉంటూ, గద్దె దింపేందుకు ఎత్తులు ►పదవి కోసం వైస్రాయ్ హోటల్ కేంద్రంగా రాజకీయ పన్నాగం శకునినే మించిన పన్నాగాలు పన్ని.. ►క్యాంపు రాజకీయాలు నడిపి.. ఎమ్మెల్యేలను ప్రలోభపెట్టి.. సీఎం పదవిని, తెలుగుదేశం పార్టీని లాక్కుని.. ►చివరికి ఈ ఆవేదనతో ఎన్టీఆర్ మరణానికి కారణమైన బాబు ఎన్టీఆర్ పేరును చెరిపేసేందుకు ఎన్నో యత్నాలు ►ఇంతా చేసి ఎన్నికలు వచ్చినప్పుడల్లా పబ్బం గడుపుకొనేందుకు ఎన్టీఆర్ నామస్మరణ 1995 ఆగస్టు... అప్పటి ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు (ఎన్టీఆర్)ను గద్దెదింపడానికి తెరవెనుక కుట్ర జరిగిన నెల. ఆయనకు వెన్నుపోటు పొడిచిన సందర్భం. నిత్యం పక్కనే ఉంటూ ఏమాత్రం అనుమానం రాకుండా ఎన్టీఆర్‌ను గద్దెదింపిన సందర్భం. సరిగ్గా ఇప్పటికి 20 ఏళ్లు. రెండు దశాబ్దాల కిందట ఎన్టీఆర్‌కు వెన్నుపోటు పొడిచిన చంద్రబాబు... సెప్టెంబర్ ఒకటో తేదీన ముఖ్యమంత్రి సీట్లో కూర్చున్నారు. నమ్ముకున్న వారే ద్రోహం చేయడంతో ఎన్టీఆర్ తెగ కుమిలిపోయారు. అక్రమంగా, కుట్రపూరితంగా తనను పదవి నుంచి దించివేయడంపై, తనకు జరిగిన అన్యాయంపై, ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసిన విధానంపై అప్పట్లో ఎన్టీఆర్ రాష్ట్రవ్యాప్తంగా పర్యటిస్తూ ప్రజలకు వివరించారు. నమ్మక ద్రోహి అంటూ చంద్రబాబుపై నిప్పులు చెరిగారు. 1994 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీని అఖండ మెజారిటీతో గెలిపించిన ఏడాది కాలానికే వెన్నుపోటు పొడిచి గద్దె దింపడంతో ఎన్టీఆర్ కుంగిపోయారు. మనోవేదనకు గురై ఆ తర్వాత మూడున్నర నెలలకే ప్రాణాలు విడిచారు. రాష్ట్ర చరిత్రలో ఆగస్టు సంక్షోభంగా కనిపించే ఈ అంశం కొత్త తరానికి కొత్తగా కనిపించవచ్చు. కానీ ఆనాటి సంఘటనలకు బాధ్యులు, జరిగిన కుట్రకు ప్రత్యక్ష, పరోక్ష సాక్షులెందరో ఉన్నారు. కాంగ్రెస్ వ్యతిరేక నినాదంతో, తెలుగు వారి ఆత్మగౌరవమే సిద్ధాంతంగా 1982లో ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ స్థాపించి, రాష్ట్ర రాజకీయాల్లో సరికొత్త అధ్యాయాన్ని ప్రారంభించారు. కానీ 1995 ఆగస్టులో చంద్రబాబు తన సొంత మామ ఎన్టీఆర్‌కు వెన్నుపోటు పొడిచి, ముఖ్యమంత్రి పీఠాన్ని కైవసం చేసుకున్న ఘటన రాజకీయాల్లో ప్రజాస్వామ్యాన్ని ఏ విధంగా అపహాస్యం చేయవచ్చో తెలియజేస్తుంది. 1995 ఆగస్టులో ముఖ్యమంత్రిగా శ్రీకాకుళం జిల్లా పర్యటనలో ఉన్న ఎన్టీఆర్.. తిరిగి హైదరాబాద్ చేరుకోగానే తన ముఖ్యమంత్రి పదవి పోతుందని కనీస మాత్రం కూడా ఊహించలేదు. తమ్ముళ్లారా మేల్కొనండి అంటూ పార్టీ ఎమ్మెల్యేలను పలకరించడానికి చైతన్య రథంపై వైస్రాయ్ హోటల్ సమీపంలోకి రాగానే చంద్రబాబు మనుషులు ఎన్టీఆర్ వాహనంపై చెప్పులు విసురుతూ దాడి చేస్తారని ఆయన కలలో కూడా ఊహించి ఉండరు. అత్యంత హేయమైన, జుగుప్సాకరమైన రీతిలో ఆనాడు ఎన్టీఆర్ అవమానాలపాలయ్యారు. ఎన్టీఆర్ పక్కనే కీలక వ్యక్తిగా ఉంటూనే తెరవెనుక మద్దతుదారులను కూడగడుతూ.. ఎన్టీఆర్‌ను గద్దె దింపడానికి ప్రయత్నాలు చేస్తున్నారన్న విష యం ఆ కుట్రను అమలు పరిచిన రోజునగానీ ప్రజలకు తెలియరాలేదు. దానికి బాబు తెరవెనుక చాలా పెద్ద కథే నడిపారు. ఎన్టీఆర్‌కు వెన్నుపోటు పొడవడానికి బాబు ఏకంగా ఎన్టీఆర్ కుమారులనే పావులుగా వాడుకున్న తీరు ప్రపంచాన్నే విస్మయపరిచింది. ఎన్టీఆర్ పెద్ద అల్లుడు దగ్గుబాటి వెంకటేశ్వరరావును కూడా వాడుకున్నారు. ఎన్టీఆర్ సతీమణి లక్ష్మీపార్వతిని సాకుగా చూపి, ఆమె రాజ్యాంగేతర శక్తిగా వ్యవహరిస్తున్నారంటూ ఒక ముద్ర వేసి చంద్రబాబు తన ఎత్తుగడను అమలుచేశారు. ఎన్టీఆర్ టీడీపీని స్థాపించినప్పుడు చంద్రబాబు కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతున్నారు. ఆనాటి అంజయ్య ప్రభుత్వంలో సినిమాటోగ్రఫీ శాఖ మంత్రిగా ఉన్నారు. మంత్రిగా ఉన్నప్పుడే ఎన్టీఆర్ తన కుమార్తె భువనేశ్వరిని చంద్రబాబుకు ఇచ్చి వివాహం చేశారు. ఆ తర్వాత 1982లో తెలుగుదేశం ఏర్పాటు, 1983లో ఎన్నికలు జరిగిపోయాయి. సొంత మామ ఎన్టీఆర్ పార్టీ పెట్టినప్పుడు.. సొంత మామమీదే పోటీ చేస్తానంటూ కాంగ్రెస్ పక్షాన చంద్రబాబు సవాలు చేశారు. తర్వాత ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఘనవిజయం సాధించడంతో చంద్రబాబుకు ఎటూ పాలుపోలేదు. దాంతో మామ ఎన్టీఆర్ పంచన చేరాలని నిర్ణయించారు. ఈ మేరకు కుటుంబం నుంచి ఎన్టీఆర్‌పై ఒత్తిడి తెచ్చారు. మొదట్లో పార్టీలో చేర్చుకోవద్దని భావించిన ఎన్టీఆర్... ఆ తర్వాత ఒత్తిళ్లు పెరగడంతో సరేనన్నారు. చంద్రబాబు చేరికను పర్వతనేని ఉపేంద్ర తదితరులు వ్యతిరేకించినా ఎన్టీఆర్ అంగీకరించలేదు. తెలుగుదేశంలో చేరిన చంద్రబాబు... మెల్లమెల్లగా మామకు దగ్గర కావడానికి ప్రయత్నించారు. దుర్మార్గుడు.. మేకవన్నె పులి.. తేనెపూసిన కత్తి.. గాడ్సేనే మించినవాడు.. అభినవ ఔరంగజేబు.. గూడుపుఠాణీకి గురువు.. కుట్రకు కొలువు.. మోసానికి మూలస్తంభం.. వెన్నుపోటుదారుడు..తన అల్లుడని చేరదీసిన పాపానికి వెన్నుపోటు పొడిచి, ముఖ్యమంత్రి పదవిని, తెలుగుదేశం పార్టీని తన చేతుల్లోకి తీసుకున్న చంద్రబాబు గురించి ఆరోజుల్లో ఎన్టీఆర్ అన్న మాటలివి. సమయాన్ని వాడుకుని.. 1985 ఆగస్టులో ఎన్టీఆర్‌ను గద్దె దింపడానికి తొలిసారి ప్రయత్నాలు జరిగాయి. పార్టీలో సీనియర్ నాయకుడు నాదెండ్ల భాస్కరరావు పార్టీలో తిరుగుబాటు చేసి ఎన్టీఆర్‌ను గద్దెదింపి ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టారు. ఆ సమయం చంద్రబాబుకు కలిసొచ్చింది. ఈ సమయాన్ని వాడుకుని ఎన్టీఆర్‌కు దగ్గరయ్యే ప్రయత్నం చేశారు. నాదెండ్ల భాస్కరరావు శాసనసభలో బల నిరూపణ చేసుకోవాల్సిన సందర్భం రాగా... ఆ సమయంలో టీడీపీ ఎమ్మెల్యేలను బెంగళూరు, మైసూరు పట్టణాలకు తరలించి క్యాంపులు నిర్వహించిన దశలో చంద్రబాబు తన శక్తియుక్తులను ప్రదర్శించారు. తర్వాత బల నిరూపణ చేసుకోలేక నాదెండ్ల రాజీనామా చేయడం, తిరిగి ఎన్టీఆర్ సీఎం కావడానికి అవకాశం వచ్చినా.. ఆయన శాసనసభను రద్దు చేసి తిరిగి ఎన్నికలకు వెళ్లడం చకచకా జరిగిపోయాయి. అంతే ఆరోజు నుంచి చంద్రబాబు పార్టీలో చక్రం తిప్పడం ప్రారంభించారు. ఆ ఎన్నికలు పూర్తికాగానే ఎన్టీఆర్ కేబినెట్లో రెవెన్యూ, ఆర్థిక శాఖల వంటి కీలక పదవులతో పాటు పార్టీ ప్రధాన కార్యదర్శి బాధ్యతలు నిర్వర్తిస్తూ వచ్చారు. ఇలా ఎన్టీఆర్‌కు దగ్గరగా ఉంటూనే తనదైన వర్గాన్ని పెంచుకోవడానికి ప్రయత్నాలు మొదలుపెట్టారు. ఎన్టీఆర్ తన పెద్దల్లుడు దగ్గుబాటి వెంకటేశ్వరరావుకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడం చంద్రబాబుకు ఏనాడూ రుచించలేదు. అందుకే సందర్భం రాగానే దగ్గుబాటిని చంద్రబాబు పూర్తిగా తొక్కేశారు. 1994 ఎన్నికలకు ముందు ఎన్టీఆర్ అప్పటివరకు తనకు సేవలు అందిస్తూ వచ్చిన లక్ష్మీపార్వతిని పెళ్లి చేసుకున్నారు. గుంటూరులో జరిగిన ఒక బహిరంగ సభా వేదిక ద్వారా లక్ష్మీపార్వతిని తన భార్యగా స్వీకరిస్తున్నట్టు ప్రక టించారు. ఆ ఎన్నికల సమయంలో చంద్రబాబు సూచించిన కొందరికి టికెట్లు దక్కకపోవడం, పార్టీలో లక్ష్మీపార్వతి సూచించిన వారికి టికెట్లు వస్తున్నాయన్న విషయాన్ని చంద్రబాబు బాగా ఉపయోగించుకున్నారు. దీన్ని అవకాశంగా తీసుకున్న చంద్రబాబు తనకు సంపూర్ణ మద్దతుదారులుగా ఉన్న వారిని లక్ష్మీపార్వతి వద్దకు పంపి... ఆమె ద్వారా టికెట్లు సంపాదించేలా చేసుకున్నారు. ఆ ఎన్నికల్లో టీడీపీ అఖండ విజయం సాధించి, ఎన్టీఆర్ ముఖ్యమంత్రి అయ్యారు. ఆయన ఏ కార్యక్రమానికి హాజరైనా వెంట లక్ష్మీపార్వతి ఉండేవారు. దీంతో ప్రభుత్వంలో, పార్టీలో లక్ష్మీపార్వతి పాత్ర ఎక్కువ అవుతోందని, ప్రధాన కార్యదర్శిగా ఉన్నప్పుడు అంతా తానై నడిపించినా ఇపుడు ప్రాధాన్యత తగ్గుతోందంటూ ఆమెను నియంత్రించాలనే ప్రచారాన్ని చంద్రబాబు ప్రారంభించారు. చంద్రబాబు వెన్నంటి నిలిచిన కొన్ని వార్తా పత్రికలు, టీ వీ చానళ్లు కూడా ఈ ప్రచార బాధ్యతను భుజాన వేసుకున్నాయి. రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో లక్ష్మీపార్వతి పాత్రపై చంద్రబాబు అనుకూల నేతలు విలేకరుల సమావేశాలు పెట్టి నిరసన వ్యక్తం చేశారు. దీంతోపాటు 1994 ఎన్నిక ల్లో టీడీపీ విజయం సాధించిన తరువాత చంద్రబాబు వర్గంగా ముద్రపడ్డ పలువురికి మంత్రివర్గంలో చోటు దక్కలేదు. అలాంటి వారికి సహజంగా ఎన్టీఆర్‌పై ఉన్న ఆగ్రహం కూడా చంద్రబాబుకు ఆయుధంగా పనికొచ్చింది. ఎన్టీఆర్ లేని సమయం చూసి సీఎం హోదాలో ఎన్టీఆర్ శ్రీకాకుళం జిల్లా పర్యటనకు వెళ్లినపుడు చంద్రబాబు తన పథకాన్ని అమలు మొదలుపెట్టారు. ఎన్టీఆర్ అక్కడ ఉండగానే హైదరాబాద్‌లో క్యాంపు రాజకీయానికి శ్రీకారం చుట్టారు. 1984లో ఎన్టీఆర్‌ను నాదెండ్ల పదవీచ్యుతుణ్ణి చేసినపుడు మైసూరులో క్యాంపు నడిపిన అనుభవం ఉన్న బాబు.. తాను సీఎం అయ్యేందుకు అప్పటి మంత్రి బొజ్జల సమీప బంధువు పి.ప్రభాకరరెడ్డికి చెందిన హోటల్ వైస్రాయ్ను ఉపయోగించుకున్నారు. బాబు తొలుత క్యాంపు మొదలుపెట్టినప్పుడు ఐదు నుంచి పది మంది కంటే ఎమ్మెల్యేలు ఆయన పంచన చేరలేదు. తొలుత వారితో సచివాలయంలో తాను ఆర్థిక, రెవెన్యూ శాఖల మంత్రిగా బాధ్యతలు నిర్వహించే కార్యాలయంలోనే మంతనాలు జరిపి క్యాంపునకు తరలించారు. ఈ విషయం టీవీల్లో, పత్రికల్లో రాగానే జిల్లాల్లో ఉన్న మిగిలిన మంత్రులు, ఎమ్మెల్యేలు హైదరాబాద్ చేరుకుని తొలుత ఎన్టీఆర్‌తో భేటీ అయ్యారు. అక్కడి నుంచి సచివాలయానికి వచ్చారు. అయితే చంద్రబాబుకు నమ్మిన బంట్లుగా ఉన్న పత్రికల ప్రతినిధులు, ఆయన నియమించుకున్న కొందరు ఈవెంట్ మేనేజర్లు.. సచివాలయానికి వచ్చిన వారికి క్యాంపు గురించి వివరించి, చంద్రబాబు క్యాంపులో 25 మంది ఎమ్మెల్యేలున్నారని ఒక్కరొక్కరుగా అందరూ చేరిపోతున్నారని చెబుతూ మైండ్ గేమ్ ఆడారు. 10 మంది ఉంటే 50 మంది ఉన్నారని నమ్మించి ఎక్కువ మందిని క్యాంపునకు చేర్చడంలో తమ వంతు సహకారం అందించారు. తాము ఎక్కడ వెనుకబడి పోతామో అనే భయంతో ఎక్కువ మంది ఎమ్మెల్యేలు బాబు గూటికి చేరడం మొదలైంది. ప్రచారం చేయించుకుని.. ఈ తతంగం జరుగుతున్నప్పుడు కొంతమంది ఎన్టీఆర్ వెన్నంటి ఉంటామన్నారు. అప్పట్లో ఎన్టీఆర్ బంజారాహిల్స్ రోడ్ నంబర్ 13లో ఉన్న ఇంట్లో ఉండేవారు. ఆయన ఇంటి నుంచి ఎమ్మెల్యే లు బయటకురాగానే వారిపై నిఘా పెట్టి వారు ఇంటికి చేరగానే మాట్లాడాల్సి ఉందంటూ వైస్రాయ్ హోటల్‌కు తరలించడం వంటివి చకచకా జరిగిపోయాయి. చంద్రబాబు కుట్రకు ఎమ్మెల్యేలు బలవుతున్నారని భావించిన ఎన్టీఆర్.. తన చైతన్య రథంపై వైస్రాయ్ హోటల్‌కు బయలుదేరారు. అప్పటికి కూడా బాబు వెంట 50 నుంచి 60 మందికి మించి ఎమ్మెల్యేలు లేరు. కానీ బాబుకు అనుకూలంగా పనిచేసిన(ఎల్లో మీడియా) పత్రికల్లో ఆయన వెంట 120 మంది చేరిపోయారని, సంఖ్య 140కి చేరిందని ప్రచారం చేస్తూ.. ఎన్టీఆర్ వెంట ఉన్న ఎమ్మెల్యేలపై ఒత్తిడి పెంచారు. ఎన్నికల్లో గెలిచి ఏడాది కాకముందే పదవి పోతుందంటూ ప్రచారం కల్పించడంతో కొందరు వైస్రాయ్ క్యాంపులో చేరారు. వైస్రాయ్‌కు వెళ్లిన తర్వాత అక్కడ అంత మంది ఎమ్మెల్యేలు లేరని తెలుసుకుని వెనుదిరగాలని భావించినా బయటకు రానివ్వలేదు. ఇక లక్ష్మీపార్వతి, పరిటాల రవిలతో పాటు మరికొందరిని వెంటబెట్టుకుని బయలుదేరిన ఎన్టీఆర్ వాహన శ్రేణి ట్యాంక్‌బండ్ చివరన ఉన్న వైస్రాయ్ సమీపానికి చేరగానే బాబు మనుషులు ఎదురుదాడికి దిగారు. ఎన్టీఆర్ వాహనంపై రాళ్లు, చెప్పులు విసురుతూ దాడికి తెగబడ్డారు. అయినా ఎన్టీఆర్ అక్కడి నుంచే పార్టీ ఎమ్మెల్యేలను ఉద్దేశించి మాట్లాడారు. ఎమ్మెల్యేలను వేడుకున్నారు. కానీ ఎమ్మెల్యేలంతా అప్పటికే వైస్రాయ్‌లో బందీ అయ్యారు. ‘తమ్ముళ్లారా మీరు చెప్పినట్టే చేసుకుందామ’ంటూ ఆవేదన పూర్వకంగా వేడుకున్నా బాబు మనుషులు దాడి కొనసాగిస్తుండటంతో ఎన్టీఆర్ వెనుదిరిగారు. ఆయన వెనుదిరిగిన మరుసటి రోజే బాబు ఎమ్మెల్యేలను ర్యాలీగా రాజ్‌భవన్‌కు తీసుకెళ్లి, తమకే బలం ఉందని ఎమ్మెల్యేలతో గవర్నర్ ముందు పరేడ్ చేయించారు. అసలు ఎన్టీఆర్ వైస్రాయ్ హోటల్‌కు వచ్చివెళ్లిన విషయం కూడా ఆ పరేడ్‌లో పాల్గొన్న చాలా మంది ఎమ్మెల్యేలకు అప్పటివరకు తెలియని పరిస్థితి. పార్టీ కోసం డ్రామా.. సీఎం గద్దెనెక్కడానికి ముందే టీడీపీని చేతుల్లోకి తీసుకోవడానికి చంద్రబాబు పెద్ద డ్రామా నడిపించారు. పార్టీలో సర్వప్రతినిధుల సభ(మహానాడు) ఆమోదించి తీర్మానం చేస్తే తప్ప పార్టీ అధ్యక్షుడిని తొలగించడానికి వీలులేదు. కానీ బాబు తన వర్గీయులతో హైదరాబాద్‌లోని కాచిగూడలో బసంత్ టాకీస్‌లో మినీ మహానాడును ఏర్పాటు చేసి అధ్యక్ష పదవి నుంచి ఎన్టీఆర్‌ను తొలగిస్తూ తీర్మానం చేయించి.. తనను అధ్యక్షుడిగా ఎంపిక చేయించుకున్నారు. ఈ తతంగానికి ఎన్టీఆర్ కుమారుడు నందమూరి హరికృష్ణ, పెద్ద అల్లుడు దగ్గుబాటి వెంకటేశ్వరరావు ప్రత్యక్ష సాక్షులు, పాత్రధారులు కూడా. ఈ సమయంలో వారంతా చంద్రబాబుకు తమ వంతు సహకారం అందించారు. అదే ఏడాది సెప్టెంబర్ 1న చంద్రబాబు ఏపీ సీఎంగా పదవి చేపట్టారు. -
ఇద్దరు చంద్రులు.. ఒకే గ్రహణం
చట్టసభల వేదికలలో సంఖ్యాబలాన్ని పెంచుకుని అధికారాన్ని నిలబెట్టుకునే తాపత్రయంలో, రంధిలో ప్రతిపక్ష శాసనకర్తలను ప్రలోభాలతో ‘ఆకర్షించి’ తమ బలాన్ని పెంచుకోవడానికి అధికార పక్షాలు ‘సిగ్గు’ పడడం లేదు. ఒకవైపు అధికార పక్షానిది వైస్రాయ్ హోటల్ కృత్రిమ ప్రయోగ చరిత్ర కాగా, మరొకరిది ఫామ్ హౌస్ కుతంత్రం. రెండువైపులవారి ధోరణి కళ్లు మూసుకుని పాలుతాగుతూ తననెవరూ గమనించడం లేదనుకునే పిల్లి ధోరణే. ‘పెద్దలు తమ మనుగడకే ముప్పు వచ్చినప్పుడు వారి వారి విభేదాలు మరచి రాజీపడతారు. పెద్ద యుద్ధాలుగా మారవలసిన తగవులు రాజీలవు తాయి. కానీ అట్టడుగు వర్గం వారిని తొక్కేయడానికి ప్రయత్నం జరుగుతూ ఉంటుంది’. (‘రాజు-మహిషి’లో రాచకొండ విశ్వనాథశాస్త్రి) ఏ సమస్యనూ పరిష్కరించకుండా విభజనానంతర తెలంగాణ-ఆంధ్ర ప్రదే శ్ రాష్ట్రాలను నాన్పుడు బేరానికి దిగజార్చారు పాలకులు. ఈ రెండు తెలుగు రాష్ట్రాలలో ఎలాంటి పాలనా వ్యవస్థలు ఏర్పడినాయో, అవి ఎలా పని చేస్తున్నాయో తెలుగువారికి ఇప్పటికే పూర్తిగా అవగాహనకు వచ్చి ఉం డాలి. దీని గురించి ఏ నిపుణుడూ వివరించి చెప్పనక్కరలేదు కూడా. నీటి తగాదాలు, ఏటి తగాదాల పరిష్కారం, సాగునీటి పథకాలు, జలవనరుల విని యోగం, ఉద్యోగుల పంపిణీ, విద్యా సంస్థల సక్రమ నిర్వహణ, పరీక్షల నిర్వ హణ, ఐటీ సంస్థలకు భరోసా- ఏదీలేదు. ఇప్పటి వరకు తమకు అన్నిం టా ప్రాప్తమైనది ‘ఉభయ భ్రష్టత్వం, ఉపరి సన్యాసం’ మాత్రమేనని తెలుగు వారికి అర్థమయింది. పైగా ప్రతి అంశాన్నీ నేతలు అక్కరకురాని ప్రకటన లతో వివాదాస్పదం చేయడం మరొక అంశం. పరిష్కారం కాని ప్రజా సమ స్యల నుంచి దృష్టి మళ్లించడానికి మరో కొత్త వ్యూహం కూడా పాలకులు పన్నారు. ఈ సమస్యలతో సంబంధం లేని వివాదాలను పేనుకుంటూ కాల క్షేపం చేయడమే ఆ వ్యూహం. పరస్పరం విమర్శించుకుంటూ నేతలు ప్రజ లను మభ్య పెడుతున్నారు. తమకు ప్రత్యక్షంగా, పరోక్షంగా ఎలాంటి సంబం ధంలేని అంశాల గురించే ప్రజలు చర్చించుకోక తప్పని పరిస్థితిని కల్పిం చారు. ఇలాంటి మస్కా ద్వారా మళ్లీ ఎన్నికలు వచ్చే దాకా ఈ శిక్ష అనుభవిం చవలసిందే,తమ పాలన ఎలా ఉన్నా- అన్నట్టు వాతావరణాన్ని తయారు చేశారు. ‘ప్రజాస్వామ్యం పేరుతో ఐదేళ్లకొకసారి ధనికవర్గ వ్యవస్థలు నిర్వహించే ఎన్నికల జాతర లక్ష్యం- ఆ ఐదేళ్లపాటు ప్రజా బాహుళ్యం మీద ఎలా ఎక్కి తొక్కాలా అని మాత్రమే!’ అంటాడు కార్ల్‌మార్క్స్. ప్రపంచ సామాజిక వేత్తలలో అగ్రగణ్యునిగా, గత దశాబ్దకాలంలో ఏటా బీబీసీ రేటింగ్‌లో మేధా వుల నీరాజనాలు అందుకుంటున్న తత్వవేత్త మార్క్స్ 167 ఏళ్ల క్రితం చెప్పిన ప్పటికీ ఆ మాట నేటికీ తుప్పు పట్టలేదు. ప్రజాస్వామ్యం ప్రభువుల కోసం ఉద్దేశించినది కాదు. అది ప్రజల కోసమే. అశేష త్యాగాలు చేసి ప్రజా బాహు ళ్యం నిర్మించుకున్న రిపబ్లిక్ రాజ్యాంగాలూ, వాటి నిబంధన లూ ఉన్నది ప్రజా స్వామిక విలువలనూ, ప్రజల హక్కులనూ రక్షించేందుకే. అంతేగానీ, పాల కుల దారి మళ్లింపు హక్కులను కాపాడడానికి మాత్రం కాదు. ఈ ధోరణి సర్వాంతర్యామి ఇప్పుడు ‘మార్గం’ మారిపోయింది. రెండు తెలుగు రాష్ట్రాలలో పాలన అడ్డదా రులు, పెడమార్గాలు తొక్కుతోంది. కేంద్రంలో ఏర్పడిన ఎన్డీయే కూడా గత యూపీఏ భ్రష్ట మార్గాన్నే ఎంచుకుంది. అవినీతి, ఆశ్రీత పక్షపాతం, అరా చకానికి దారి తీసే నియంతృత్వం ఢిల్లీ నుంచి రాష్ట్రాల వరకు శరవేగాన పాకి పోవడం దాని ఫలితమే. తమ ప్రభుత్వాలను ఏదో విధంగా నిలబెట్టుకోవడా నికి అన్ని రకాల అడ్డదారులను వెతుక్కోవడం ప్రభువులకు రివాజుగా మారి పోయింది. 545 మంది లోక్‌సభ సభ్యులలో 300 మంది వరకు అవినీతి పరులుగా, నేరగాళ్లుగా, బేరగాళ్లుగా ఆరోపణలలో కూరుకుపోయిన వారేనని వింటున్నాం. మన రెండు తెలుగు రాష్ట్రాలలో జరుగుతున్న భాగోతం కూడా దానికి కొనసాగింపేనని గమనించాలి. చట్టసభల వేదికలలో సంఖ్యాబలాన్ని పెంచుకుని అధికారాన్ని నిలబెట్టుకునే తాపత్రయంలో, రంధిలో ప్రతిపక్ష శాసనకర్తలను ప్రలోభాలతో ‘ఆకర్షించి’ తమ బలాన్ని పెంచుకోవడానికి అధికార పక్షాలు ‘సిగ్గు’ పడడం లేదు. ఒకవైపు అధికార పక్షానిది వైస్రాయ్ హోటల్ కృత్రిమ ప్రయోగ చరిత్ర కాగా, మరొకరిది ఫామ్ హౌస్ కుతంత్రం. రెండువైపుల వారి ధోరణి కళ్లు మూసుకుని పాలుతాగుతూ తననెవరూ గమ నించడం లేదనుకునే పిల్లి ధోరణే. పార్లమెంట్లో ప్రభుత్వం మీద ప్రతిపక్షం అవిశ్వాస తీర్మానం ప్రతిపాదిస్తే, ఆ తీర్మానాన్ని ఓడించి అధికారంలో కొనసా గడానికి ముగ్గురు విపక్ష సభ్యులను కొనుగోలు చేయడానికి నాటి ప్రధాని ఏమాత్రం వెరవలేదు. ఇప్పుడు అదే దుష్ట సంప్రదాయం, అదే ప్రజాస్వామ్య పరిరక్షణ పేరుతో, తు.చ. తప్పకుండా రెండు తెలుగు రాష్ట్రాలలోను పునరా వృతమయింది. ఈ ఉదంతంలో శాసనసభ/శాసనమండలి సభ్యులను కొంద రిని కొనుగోలు చేయడానికి సంబంధించి తెలంగాణ ప్రాంత పాత్రికేయ సంఘం నాయకుడొకరూ, టీఆర్ఎస్ వారూ పడిన శ్రమ విలువ ఎంతటిదో టీడీపీ, మావోయిస్టులు చేసిన వర్ణనలలో బయటపడిపోయింది. తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి చేపట్టిన ‘ఆపరేషన్ ఆకర్ష్’ మంత్రం ఫలిస్తోంది. ఈ చేర్పుల కార్యక్రమాన్ని అధికార పార్టీ (టీఆర్ఎస్) వేగి రం చేయడంతో విపక్షాలకు (కాంగ్రెస్, టీడీపీ, వైఎస్ఆర్ పార్టీ, ఇండి పెండెంట్లు) పాలుపోని పరిస్థితి దాపురించింది. కాంగ్రెస్, టీడీపీ సభ్యులలో నైరాశ్యం నెలకొంది. ఐదు నెలల వ్యవధిలోనే 9 మంది ఎమ్మె ల్సీలు, ఇద్దరు ఎమ్మెల్యేలు అధికార పార్టీ టీఆర్ఎస్లో చేరిపోయారు. రాష్ట్ర శాసనసభ సమావేశాలు సాగుతున్న దశలో టీడీపీ, కాంగ్రెస్, వైఎస్ఆర్సీపీలకు చెందిన ముఖ్యులు విడతల వారీగా గులాబీ గూటికి చేరుతున్నారు. ఆయా పార్టీలు వారి వారి ప్రతినిధులను కాపాడుకోలేక నానా అగచాట్లు పడుతున్నాయి. విపక్షాల ఎమ్మెల్యేలను.. ఇతర ప్రజా ప్రతినిధులు, నాయకులను తెరాస తన వైపు తిప్పుకుంటూ భవిష్యత్తుకు గట్టి పునాదులు వేసుకుంటున్నది (‘తెలంగాణ వర్కింగ్ జర్నలిస్టుల యూనియన్ నాయకులలో ఒకరు రాసిన పుస్తకం ఆధారంగా). అంటే ఈ చర్య (టీఆర్ఎస్ చేపట్టిన ఆకర్ష్ ఫలితంగా జరిగిన చేర్పులు) ఏ ప్రతి చర్యకు దారి తీసింది? ‘ప్రతి ఒక్క చర్యకూ ప్రతి చర్య కూడా ఉంటుంది’ అని భౌతిక శాస్త్రంలో ఒక సూత్రం గురించి న్యూటన్ చెప్పింది, రాజకీ యాలలో కూడా వర్తిస్తుంది. టీఆర్ఎస్ పార్టీ నాయకుడి పరంగా దాని నామినేటెడ్ సభ్యుడిని ‘దేశం’ నాయకత్వం తన వైపు తిప్పుకోవడానికి ప్రలోభ పెట్టిందన్న ఆరోపణకు పునాది అయింది. ఫోన్ ట్యాపింగ్లతో ఇరుపక్షాలు నడవడానికి ఆస్కారం ఏర్పడింది. ఈ పరిణామం సందర్భంగా టీడీపీ వారు ఎదురు ప్రశ్నతో ముందుకు దూసుకువచ్చారు. ‘అసలు తెలంగాణ శాసనసభలో ఉన్న 85 ఓట్లలో 63 మాత్రమే టీఆర్ఎస్కు చెందినవి కాగా ఐదు ఎంఎల్సీ సీట్లకు (ఒక సీటు అదనంగా) ఎందుకు అర్రులు చాచింది? టీడీపీ ఎమ్మెల్యేలని ప్రలోభపెట్టి టీఆర్ఎస్ వైపు గుంజుకున్నప్పుడు టీఆర్ఎస్కు నైతిక విలు వలు గుర్తుకు రాలేదా?’ ఇదంతా ఇసుక తక్కెడ పేడ తక్కెడ వ్యవహారం. అందరిదీ ఒక్కటే దారి ఇక్కడ మరుగున పడుతున్న మరో వాస్తవం - తమ పార్టీ తరఫున ఎన్నికైన ఇద్దరు పార్లమెంట్ సభ్యులను ప్రలోభంతో టీడీపీలోకి లాక్కొన్నవేళ ఈ నీతి ఆ పార్టీకి గుర్తుకు రాలేదా అంటూ సరిగ్గా ఇదే ప్రశ్నను వైఎస్ఆర్సీపీ కూడా సంధించవలసివచ్చింది. ఈ గొలుసుకట్టు పరిణామాలు ఒక విషయాన్ని నగ్నంగా నిరూపిస్తున్నాయి- ప్రజాస్వామ్యం పేరిట దాదాపుగా అన్ని రాజకీ యపక్షాలు అదే ప్రజాస్వామ్యం వినాశనానికి సమిధలు పేర్చుతూ వచ్చాయి. ఒక పార్టీ నుంచి వేరే పార్టీలోకి దూకే శాసనకర్త ముందుగా పార్టీకి రాజీనామా ఇవ్వకుండానే ఈ ఫిరాయింపునకు పాల్పడడం, దీనిని న్యాయ వ్యవస్థ కూడా అడ్డుకోలేకపోవడం సరైన పంథా కాదని గుర్తించాలి. ఇందువల్ల ప్రజాస్వా మ్యం వర్ధిల్లడానికి దోహదపడే పరిస్థితులకు రక్షణ ఉండదని కూడా తెలుసుకోవాలి. మావోయిస్టులు విడుదల చేసిన ఒక ప్రకటనలో - రెండు రాష్ట్రాలలో ఓటుకు నోటు కేసుతో ప్రమేయం ఉన్న పాలకులపైన, సంపన్న కార్పొరేట్ కంపెనీల నుంచి మామూళ్లు వసూలు చేసుకుంటున్న రెండు తెలుగు రాష్ట్రాల పాలకులపైన చర్య తీసుకోవాలని కోరడం కొస మెరుపు. ఇక్కడ జరుగుతున్న రాజకీయ అవినీతి ప్రవహసనాలకు ముగింపుగా, విరుగుడుగా ఈ చర్యలు తీసుకోవాలని ఆ ప్రకటనలో అభిప్రాయపడ్డారు. ఇంత జరిగినా తేలని విష యం ఒకటి ఉంది. ఏ చంద్రుడు ఏ చంద్రుణ్ణి అమావాస్య చీకట్లోకి నెడుతు న్నాడు? అవసరమైతే శాసనసభనే రద్దు చేసేస్తానని చెప్పిన చంద్రుణ్ణి ఏ రాహుకేతువులు మింగబోతున్నాయి? నిజానికి గురుశిష్యులైన ఇద్దరు చంద్రుల మధ్య ఇప్పట్లో సయోధ్య సాధ్యమేనా? విభజనతో దేశవ్యాప్తంగా అభాసు పాలైనా, అభివృద్ధి పథంలో అయినా తెలుగువారందరినీ ఏకతా టిపైకి తీసుకురాగల శక్తి నిరంకుశ పాలకులకు ఉందా? పైన చెప్పుకున్న రావిశాస్త్రి మాటే చివరికి నిజమవుతుందా? చూడాలి! (వ్యాసకర్త మొబైల్: 9848318414) - ఏబీకే ప్రసాద్ సీనియర్ సంపాదకులు -
వైస్రాయ్ ఘటనలో కీలక పాత్ర కేసీఆర్‌దే: ఎర్రబెల్లి
సాక్షి, హైదరాబాద్: ఎమ్మెల్యేల అభీష్టం మేరకు 1995లో వైస్రాయ్ హోటల్ వేదికగా అధికార మార్పిడి జరిగిందే తప్ప, వెన్నుపోటు కాదని తెలంగాణ టీడీఎల్పీ నాయకుడు ఎర్రబెల్లి దయాకర్ రావు చెప్పారు. అప్పుడు కేసీఆర్ కీలక పాత్ర పోషించారన్నారు. మంగళవారమిక్కడ టీడీఎల్పీ కార్యాలయంలో ఆయన ఎమ్మెల్యేలు సండ్ర వెంకట వీర య్య, వివేకానందతో కలసి మాట్లాడారు. ‘వైస్రాయ్ ఘటనపై మంత్రి హరీశ్ అవాకులు చెవాకులు పేలే ముందు.. తన మామ కేసీఆర్‌ను అడిగితే అన్ని విషయాలు చెబుతారు. ఆ ఘటన తర్వాత ఏర్పాటైన చంద్రబాబు మంత్రివర్గంలో కేసీఆర్ కీలక పాత్ర పోషించారు’ అని అన్నారు. చనిపోయిన రైతుల కుటుంబాలకు టీడీపీ ఆర్థిక సాయం చేస్తుంటే అవహేళన చేయడం సమంజసం కాదన్నారు. శాసనసభలో టీడీపీకి కార్యాలయం కూడా కేటాయించకుండా ప్రభుత్వం కక్ష సాధిస్తోందన్నారు. -
బాబు మోసం చేశాడు
=1999లో ఎమ్మెల్యే టికెట్టు ఇస్తానని ఇవ్వలేదు =2004లో నా భార్యకు బలవంతంగా టికెటిచ్చారు =ఆమె ఓడిపోవడంతో ఉన్న ఉద్యోగమూ పోయింది =నా నిజాయితీని బాబు పట్టించుకోలేదు =పార్టీలో గుర్తింపు లేకుండా చేశారు =వేపంజేరి మాజీ ఎమ్మెల్యే గాంధీ పలమనేరు, న్యూస్‌లైన్: తెలుగుదేశం పార్టీ అభివృద్ధి కోసం నిజాయితీగా, నిబద్ధతతో పనిచేశానని, పార్టీలో సముచిత స్థానం కల్పించకుండా తనను, తన కుటుంబాన్ని చంద్రబాబు మోసం చేశారని వేంపజేరి మాజీ ఎమ్మెల్యే ఆర్. గాంధీ ఘాటుగా విమర్శించారు. పలమనేరు నియోజకవర్గంలోని పెద్దవెలగటూరులో శనివారం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి సమక్షంలో ఆయన పార్టీలో చేరారు. అనంతరం పలమనేరులో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులతో కలసి విలేకరుల సమావేశం నిర్వహించారు. 1994లో వేపంజేరి ఎమ్మెల్యేగా పనిచేశానని, చంద్రబాబుకు ప్రధాన అనుచరునిగా ఉన్నానని చెప్పారు. అయితే చంద్రబాబు పార్టీలో సరైన గుర్తింపు ఇవ్వలేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. రెండు కళ్ల సిద్ధాంతమని, సమన్యాయమని ఆయన చెప్పిందానికల్లా అడ్డు చెప్పకుండా పోతే ఓకే అని, అలా కాదంటే తర్వాత ఎవరినీ పట్టించుకోరని విమర్శించారు. చంద్రబాబు వైఖరితో రాజకీయంగా ఎంతో నష్టపోయానన్నారు. ఒక్కసారి ఎమ్మెల్యేగా ఓడిపోతే ఆపై ఎందుకు కొరగాకుండా చూడడం ఆయన నైజమన్నారు. 1999లో తనకు ఎమ్మెల్యే టికెట్ ఇస్తానని ఆపై మోసం చేశారని ధ్వజమెత్తారు. ప్రభుత్వ ఉద్యోగిగా ఉన్న తన భార్యకు 2004లో చంద్రబాబు టికెట్ ఇచ్చారన్నారు. ఈ వ్యవహారం తనకు తెలియకుండా జరిగిందని, తమ కుటుంబంలో ఆయన చిచ్చుపెట్టే విధంగా వ్యవహరించి రాజకీయం నడిపిన ఘనుడని గాంధీ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ ఎన్నికల్లో తన భార్య ఓటమి చెందిందని, ఎన్నికల్లో పోటీచేయడంతో ఉన్న ఉద్యోగం కూడా కోల్పోయి ఎంత ఇబ్బంది పడ్డామో ఆయనకేమి తెలుసన్నారు. తెలుగుదేశం పార్టీ అభివృద్ధి కోసం దశాబ్దాలుగా పాటుపడినందుకు ఉద్యోగాలు పోగొట్టుకోవాల్సిన పరిస్థితి తలెత్తిందని వాపోయారు. తెలుగుదేశం పార్టీలో బాబుకు నమ్మకస్తునిగా మెలిగానని, అయితే ఆయన తనను అసలు పట్టించుకోలేదన్నారు. జేబులో చంద్రబాబు బొమ్మలేకుండా బయటకు వెళ్లలేదన్నారు. హైదరాబాద్‌లో తన బైక్‌కు సైతం పసుపు రంగు కొట్టించి చంద్రబాబు ఫొటోతో తిరిగేవాడినని తన ఆవేదనను వ్యక్తం చేశారు. అలాంటి నమ్మకంగా వ్యవహరించిన తనకు గుర్తింపు లేనప్పుడు ఎందుకు పార్టీలో ఉండాలని ఆయన ప్రశ్నించారు. రాష్ట్ర సమైక్యత విషయంలో ఆ పార్టీ విధానాలు అసలు నచ్చలేదన్నారు. మొత్తం మీద ఈ కారణాలతో తాను ఆ పార్టీని వీడానన్నారు. సమైక్యాంధ్ర కోసం పోరాడుతున్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరడమే ఉత్తమమని నిర్ణయించుకొనే ఈ నిర్ణయం తీసుకున్నానన్నారు. ఎంపీ, ఎమ్మెల్యే టికెట్లు ఆశించి పార్టీలో చేరలేదని స్పష్టం చేశారు. సాధారణ కార్యకర్తలా పార్టీ బలోపేతానికి కృషిచేస్తానన్నారు. 2004 ఎన్నికల్లో తన భార్య ఓటమి చెందినప్పుడు తిరిగి ఉద్యోగం కావాలని దివంగత ముఖ్యమంత్రి రాజశేఖరరెడ్డిని కలసి పరిస్థితిని వివరించానన్నారు. తాను ప్రతిపక్ష పార్టీకి చెందిన నాయకుడినైనా ఆయన సాయం చేశారన్నారు. అందుకే తనకు వైఎస్ అంటే వల్లమాలిన అభిమానమన్నారు. తాను పార్టీలో చేరినందున తనపై కూడా ప్యాకేజీ తీసుకున్నాననే ఆరోపణలు టీడీపీ నేతలు చేసే అవకాశం ఉందన్నారు. తాను ఆనాడు వైశ్రాయ్ హోటల్లో బాబు వద్ద ప్యాకేజీలు తీసుకున్నట్లు చెప్పుకున్నారని, అదెంత నిజమో ఇప్పుడు తాను వైఎస్సార్సీపీ వద్ద ఏదైనా పుచ్చుకున్నాననే విషయంలోనూ అంతే నిజముంటుందని ఘాటుగా విమర్శించారు. ఈ విలేకరుల సమావేశంలో జిల్లా నాయకులు అమరనాథ రెడ్డి, మనోహర్, నారాయణ స్వామి, ఆదిమూలం, కేశవులు, వినయ్‌రెడ్డి, సునీల్, సీవీ కుమార్, హేమంత్, సుధా, వంగపండు ఉష తదితరులున్నారు.