ఇద్దరు చంద్రులు.. ఒకే గ్రహణం | Eclipse to states of two moons | Sakshi
Sakshi News home page

ఇద్దరు చంద్రులు.. ఒకే గ్రహణం

Published Tue, Jun 16 2015 12:19 AM | Last Updated on Wed, Aug 15 2018 9:27 PM

ఇద్దరు చంద్రులు.. ఒకే గ్రహణం - Sakshi

ఇద్దరు చంద్రులు.. ఒకే గ్రహణం

చట్టసభల వేదికలలో సంఖ్యాబలాన్ని పెంచుకుని అధికారాన్ని నిలబెట్టుకునే తాపత్రయంలో, రంధిలో ప్రతిపక్ష శాసనకర్తలను ప్రలోభాలతో ‘ఆకర్షించి’ తమ బలాన్ని పెంచుకోవడానికి అధికార పక్షాలు ‘సిగ్గు’ పడడం లేదు. ఒకవైపు అధికార పక్షానిది వైస్రాయ్ హోటల్ కృత్రిమ ప్రయోగ చరిత్ర కాగా, మరొకరిది ఫామ్ హౌస్ కుతంత్రం. రెండువైపులవారి ధోరణి కళ్లు మూసుకుని పాలుతాగుతూ తననెవరూ గమనించడం లేదనుకునే పిల్లి ధోరణే.
 
 ‘పెద్దలు తమ మనుగడకే ముప్పు వచ్చినప్పుడు వారి వారి విభేదాలు మరచి రాజీపడతారు. పెద్ద యుద్ధాలుగా మారవలసిన తగవులు రాజీలవు తాయి. కానీ అట్టడుగు వర్గం వారిని తొక్కేయడానికి ప్రయత్నం జరుగుతూ ఉంటుంది’.    
 (‘రాజు-మహిషి’లో రాచకొండ విశ్వనాథశాస్త్రి)
 ఏ సమస్యనూ పరిష్కరించకుండా విభజనానంతర తెలంగాణ-ఆంధ్ర ప్రదే శ్ రాష్ట్రాలను  నాన్పుడు బేరానికి దిగజార్చారు పాలకులు. ఈ రెండు తెలుగు రాష్ట్రాలలో ఎలాంటి పాలనా వ్యవస్థలు ఏర్పడినాయో, అవి ఎలా పని చేస్తున్నాయో తెలుగువారికి ఇప్పటికే పూర్తిగా అవగాహనకు వచ్చి ఉం డాలి. దీని గురించి ఏ నిపుణుడూ వివరించి చెప్పనక్కరలేదు కూడా. నీటి తగాదాలు, ఏటి తగాదాల పరిష్కారం, సాగునీటి పథకాలు, జలవనరుల విని యోగం, ఉద్యోగుల పంపిణీ, విద్యా సంస్థల సక్రమ నిర్వహణ, పరీక్షల నిర్వ హణ, ఐటీ సంస్థలకు భరోసా- ఏదీలేదు. ఇప్పటి వరకు తమకు అన్నిం టా ప్రాప్తమైనది ‘ఉభయ భ్రష్టత్వం, ఉపరి సన్యాసం’ మాత్రమేనని తెలుగు వారికి అర్థమయింది. పైగా ప్రతి అంశాన్నీ నేతలు అక్కరకురాని ప్రకటన లతో వివాదాస్పదం చేయడం మరొక అంశం. పరిష్కారం కాని ప్రజా సమ స్యల నుంచి దృష్టి మళ్లించడానికి మరో కొత్త వ్యూహం కూడా పాలకులు పన్నారు. ఈ సమస్యలతో సంబంధం లేని వివాదాలను పేనుకుంటూ కాల క్షేపం చేయడమే ఆ వ్యూహం. పరస్పరం విమర్శించుకుంటూ నేతలు ప్రజ లను మభ్య పెడుతున్నారు. తమకు ప్రత్యక్షంగా, పరోక్షంగా ఎలాంటి సంబం ధంలేని అంశాల గురించే ప్రజలు చర్చించుకోక తప్పని పరిస్థితిని కల్పిం చారు. ఇలాంటి మస్కా ద్వారా మళ్లీ ఎన్నికలు వచ్చే దాకా ఈ శిక్ష అనుభవిం చవలసిందే,తమ పాలన ఎలా ఉన్నా- అన్నట్టు వాతావరణాన్ని తయారు చేశారు.
 
 ‘ప్రజాస్వామ్యం పేరుతో ఐదేళ్లకొకసారి ధనికవర్గ వ్యవస్థలు నిర్వహించే ఎన్నికల జాతర లక్ష్యం- ఆ ఐదేళ్లపాటు ప్రజా బాహుళ్యం మీద ఎలా ఎక్కి తొక్కాలా అని మాత్రమే!’ అంటాడు కార్ల్‌మార్క్స్. ప్రపంచ సామాజిక వేత్తలలో అగ్రగణ్యునిగా, గత దశాబ్దకాలంలో ఏటా బీబీసీ రేటింగ్‌లో మేధా వుల నీరాజనాలు అందుకుంటున్న తత్వవేత్త మార్క్స్ 167 ఏళ్ల క్రితం చెప్పిన ప్పటికీ ఆ మాట నేటికీ తుప్పు పట్టలేదు. ప్రజాస్వామ్యం ప్రభువుల కోసం ఉద్దేశించినది కాదు. అది ప్రజల కోసమే. అశేష త్యాగాలు చేసి ప్రజా బాహు ళ్యం నిర్మించుకున్న రిపబ్లిక్ రాజ్యాంగాలూ, వాటి నిబంధన లూ ఉన్నది ప్రజా స్వామిక విలువలనూ, ప్రజల హక్కులనూ రక్షించేందుకే. అంతేగానీ, పాల కుల దారి మళ్లింపు హక్కులను కాపాడడానికి మాత్రం కాదు.
 
 ఈ ధోరణి సర్వాంతర్యామి
 ఇప్పుడు ‘మార్గం’ మారిపోయింది. రెండు తెలుగు రాష్ట్రాలలో పాలన అడ్డదా రులు, పెడమార్గాలు తొక్కుతోంది. కేంద్రంలో ఏర్పడిన ఎన్డీయే కూడా గత యూపీఏ భ్రష్ట మార్గాన్నే ఎంచుకుంది. అవినీతి, ఆశ్రీత పక్షపాతం, అరా చకానికి దారి తీసే నియంతృత్వం ఢిల్లీ నుంచి రాష్ట్రాల వరకు శరవేగాన పాకి పోవడం దాని ఫలితమే. తమ ప్రభుత్వాలను ఏదో విధంగా నిలబెట్టుకోవడా నికి అన్ని రకాల అడ్డదారులను వెతుక్కోవడం ప్రభువులకు రివాజుగా మారి పోయింది. 545 మంది లోక్‌సభ సభ్యులలో 300 మంది వరకు అవినీతి పరులుగా, నేరగాళ్లుగా, బేరగాళ్లుగా ఆరోపణలలో కూరుకుపోయిన వారేనని వింటున్నాం. మన రెండు తెలుగు రాష్ట్రాలలో జరుగుతున్న భాగోతం కూడా దానికి కొనసాగింపేనని గమనించాలి. చట్టసభల వేదికలలో సంఖ్యాబలాన్ని పెంచుకుని అధికారాన్ని నిలబెట్టుకునే తాపత్రయంలో, రంధిలో ప్రతిపక్ష శాసనకర్తలను ప్రలోభాలతో ‘ఆకర్షించి’ తమ బలాన్ని పెంచుకోవడానికి అధికార పక్షాలు ‘సిగ్గు’ పడడం లేదు.
 
 ఒకవైపు అధికార పక్షానిది వైస్రాయ్ హోటల్ కృత్రిమ ప్రయోగ చరిత్ర కాగా, మరొకరిది ఫామ్ హౌస్ కుతంత్రం. రెండువైపుల వారి ధోరణి కళ్లు మూసుకుని పాలుతాగుతూ తననెవరూ గమ నించడం లేదనుకునే పిల్లి ధోరణే. పార్లమెంట్‌లో ప్రభుత్వం మీద ప్రతిపక్షం అవిశ్వాస తీర్మానం ప్రతిపాదిస్తే, ఆ తీర్మానాన్ని ఓడించి అధికారంలో కొనసా గడానికి ముగ్గురు విపక్ష సభ్యులను కొనుగోలు చేయడానికి నాటి ప్రధాని ఏమాత్రం వెరవలేదు. ఇప్పుడు అదే దుష్ట సంప్రదాయం, అదే ప్రజాస్వామ్య పరిరక్షణ పేరుతో, తు.చ. తప్పకుండా రెండు తెలుగు రాష్ట్రాలలోను పునరా వృతమయింది. ఈ ఉదంతంలో శాసనసభ/శాసనమండలి సభ్యులను కొంద రిని కొనుగోలు చేయడానికి  సంబంధించి తెలంగాణ ప్రాంత పాత్రికేయ సంఘం నాయకుడొకరూ, టీఆర్‌ఎస్ వారూ పడిన శ్రమ విలువ ఎంతటిదో టీడీపీ, మావోయిస్టులు చేసిన వర్ణనలలో బయటపడిపోయింది.
 
 
          తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి చేపట్టిన ‘ఆపరేషన్ ఆకర్ష్’ మంత్రం ఫలిస్తోంది. ఈ చేర్పుల కార్యక్రమాన్ని అధికార పార్టీ (టీఆర్‌ఎస్) వేగి రం చేయడంతో విపక్షాలకు (కాంగ్రెస్, టీడీపీ, వైఎస్‌ఆర్ పార్టీ, ఇండి పెండెంట్‌లు) పాలుపోని పరిస్థితి దాపురించింది. కాంగ్రెస్, టీడీపీ సభ్యులలో నైరాశ్యం నెలకొంది. ఐదు నెలల వ్యవధిలోనే 9 మంది ఎమ్మె ల్సీలు, ఇద్దరు ఎమ్మెల్యేలు అధికార పార్టీ టీఆర్‌ఎస్‌లో చేరిపోయారు. రాష్ట్ర శాసనసభ సమావేశాలు సాగుతున్న దశలో టీడీపీ, కాంగ్రెస్, వైఎస్‌ఆర్‌సీపీలకు చెందిన ముఖ్యులు విడతల వారీగా గులాబీ గూటికి చేరుతున్నారు. ఆయా పార్టీలు వారి వారి ప్రతినిధులను కాపాడుకోలేక నానా అగచాట్లు పడుతున్నాయి. విపక్షాల ఎమ్మెల్యేలను.. ఇతర ప్రజా ప్రతినిధులు, నాయకులను తెరాస తన వైపు తిప్పుకుంటూ భవిష్యత్తుకు గట్టి పునాదులు వేసుకుంటున్నది (‘తెలంగాణ వర్కింగ్ జర్నలిస్టుల యూనియన్ నాయకులలో ఒకరు రాసిన పుస్తకం ఆధారంగా). అంటే ఈ చర్య (టీఆర్‌ఎస్ చేపట్టిన ఆకర్ష్ ఫలితంగా జరిగిన చేర్పులు) ఏ ప్రతి చర్యకు దారి తీసింది? ‘ప్రతి ఒక్క చర్యకూ ప్రతి చర్య కూడా ఉంటుంది’ అని భౌతిక శాస్త్రంలో ఒక సూత్రం గురించి న్యూటన్ చెప్పింది, రాజకీ యాలలో కూడా వర్తిస్తుంది. టీఆర్‌ఎస్ పార్టీ నాయకుడి పరంగా దాని నామినేటెడ్ సభ్యుడిని ‘దేశం’ నాయకత్వం తన వైపు తిప్పుకోవడానికి ప్రలోభ పెట్టిందన్న ఆరోపణకు పునాది అయింది. ఫోన్ ట్యాపింగ్‌లతో ఇరుపక్షాలు నడవడానికి ఆస్కారం ఏర్పడింది.
 
          ఈ పరిణామం సందర్భంగా టీడీపీ వారు ఎదురు ప్రశ్నతో ముందుకు దూసుకువచ్చారు. ‘అసలు తెలంగాణ శాసనసభలో ఉన్న 85 ఓట్లలో 63 మాత్రమే టీఆర్‌ఎస్‌కు చెందినవి కాగా ఐదు ఎంఎల్‌సీ సీట్లకు (ఒక సీటు అదనంగా) ఎందుకు అర్రులు చాచింది? టీడీపీ ఎమ్మెల్యేలని ప్రలోభపెట్టి టీఆర్‌ఎస్ వైపు గుంజుకున్నప్పుడు టీఆర్‌ఎస్‌కు నైతిక విలు వలు గుర్తుకు రాలేదా?’ ఇదంతా ఇసుక తక్కెడ పేడ తక్కెడ వ్యవహారం.
 
 అందరిదీ ఒక్కటే దారి
 ఇక్కడ మరుగున పడుతున్న మరో వాస్తవం - తమ పార్టీ తరఫున ఎన్నికైన ఇద్దరు పార్లమెంట్ సభ్యులను ప్రలోభంతో టీడీపీలోకి లాక్కొన్నవేళ ఈ నీతి ఆ పార్టీకి గుర్తుకు రాలేదా అంటూ సరిగ్గా ఇదే ప్రశ్నను వైఎస్‌ఆర్‌సీపీ కూడా సంధించవలసివచ్చింది. ఈ గొలుసుకట్టు పరిణామాలు ఒక విషయాన్ని నగ్నంగా నిరూపిస్తున్నాయి- ప్రజాస్వామ్యం పేరిట దాదాపుగా అన్ని రాజకీ యపక్షాలు అదే ప్రజాస్వామ్యం వినాశనానికి సమిధలు పేర్చుతూ వచ్చాయి. ఒక పార్టీ నుంచి వేరే పార్టీలోకి దూకే శాసనకర్త ముందుగా పార్టీకి రాజీనామా ఇవ్వకుండానే ఈ ఫిరాయింపునకు పాల్పడడం, దీనిని న్యాయ వ్యవస్థ కూడా అడ్డుకోలేకపోవడం సరైన పంథా కాదని గుర్తించాలి. ఇందువల్ల ప్రజాస్వా మ్యం వర్ధిల్లడానికి దోహదపడే పరిస్థితులకు రక్షణ ఉండదని కూడా తెలుసుకోవాలి.
 
 మావోయిస్టులు విడుదల చేసిన ఒక ప్రకటనలో - రెండు రాష్ట్రాలలో ఓటుకు నోటు కేసుతో ప్రమేయం ఉన్న పాలకులపైన, సంపన్న కార్పొరేట్ కంపెనీల నుంచి మామూళ్లు వసూలు చేసుకుంటున్న రెండు తెలుగు రాష్ట్రాల పాలకులపైన చర్య తీసుకోవాలని కోరడం కొస మెరుపు. ఇక్కడ జరుగుతున్న రాజకీయ అవినీతి ప్రవహసనాలకు ముగింపుగా, విరుగుడుగా ఈ చర్యలు తీసుకోవాలని ఆ ప్రకటనలో అభిప్రాయపడ్డారు.

ఇంత జరిగినా తేలని విష యం ఒకటి ఉంది. ఏ చంద్రుడు ఏ చంద్రుణ్ణి అమావాస్య చీకట్లోకి నెడుతు న్నాడు? అవసరమైతే శాసనసభనే రద్దు చేసేస్తానని చెప్పిన చంద్రుణ్ణి ఏ రాహుకేతువులు మింగబోతున్నాయి? నిజానికి గురుశిష్యులైన ఇద్దరు చంద్రుల మధ్య ఇప్పట్లో సయోధ్య సాధ్యమేనా? విభజనతో దేశవ్యాప్తంగా అభాసు పాలైనా, అభివృద్ధి పథంలో అయినా తెలుగువారందరినీ ఏకతా టిపైకి తీసుకురాగల శక్తి నిరంకుశ పాలకులకు ఉందా? పైన చెప్పుకున్న రావిశాస్త్రి మాటే చివరికి నిజమవుతుందా? చూడాలి!
 
(వ్యాసకర్త మొబైల్: 9848318414)
 - ఏబీకే ప్రసాద్
 సీనియర్ సంపాదకులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement