వెంకట్ ‘విక్టోరియన్’ విడుదల
గోకవరం (జగ్గంపేట) :
గోకవరానికి చెందిన ఇంగ్లీష్ నవలా రచయిత దాసరి విశ్వనాథ్ వెంకట్ రచించిన ‘ద విక్టోరియ¯ŒS’ నవలను బాలీవుడ్ హీరో హృతిక్ రోష¯ŒS విడుదల చేశారు. దీనికి సంబంధించిన వివరాలను రచయిత వెంకట్ శుక్రవారం స్థానిక విలేకరులకు తెలిపారు. తన రెండవ నవల ‘ద విక్టోరియ¯ŒS’ను ఈ నెల 10న హృతిక్ రోష¯ŒS జన్మదినం సందర్భంగా ముంబైలో ఆయన స్వగృహంలో విడుదల చేశారన్నారు. తన నవల విషయాన్ని ఇంటర్నెట్ ద్వారా తెలుసుకున్న హృతిక్ తనను, తన కుటుంబ సభ్యులను ముంబైలో ఆయన నివాసానికి ఆహ్వానించారని, దీంతో తన తండ్రి రాధాకృష్ణ, సోదరి సాయిజలతో కలిసి ముంబై వెళ్లానని చెప్పారు. నవల కథాంశంతో పాటు కవర్ పేజీ బాగుందని హృతిక్ ప్రశంసించారని ఆనందం వ్యక్తం చేశారు. నవలను హృతిక్‌కు అంకితమిచ్చానన్నారు. వెంకట్ తొలి నవల ‘ఫారో ఆఫ్ ద కింగ్’ను 2011లో మెగాస్టార్ చిరంజీవి విడుదల చేశారు.