Video Surveillance
-
రైల్‌నిలయంలో వీడియో సర్వైలెన్స్ కంట్రోల్ రూమ్
సాక్షి, హైదరాబాద్: ప్రధానమైన రైల్వే స్టేషన్లలో ప్రయాణికుల రాకపోకలు, పరిపాలనా కార్యకలాపాలను ఉన్నతాధికారులు ప్రత్యక్షంగా చూస్తూ పర్యవేక్షించడానికి దక్షిణ మధ్య రైల్వే ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అందుబాటులోకి తీసుకువచ్చింది. సీసీ కెమెరాల ద్వారా ఆయా స్టేషన్లలో ఏం జరుగుతుందో తెలుసుకునేందుకు సికింద్రాబాద్‌లోని రైల్ నిలయంలో ప్రత్యేక ఇంటిగ్రేటెడ్ వీడియో సర్వైలెన్స్ సిస్టం కంట్రోల్ రూమ్‌ను ప్రారంభించారు. ఈ విధానంలో ఉన్నతాధికారులు రైల్ నిలయం నుంచి చూస్తూ ఆయా స్టేషన్లలో అధికారు లకు సూచనలు, ఆదేశాలు ఇవ్వడానికి వీలుంటుంది. దక్షిణ మధ్య రైల్వే పరిధిలోని 17 ముఖ్యమైన రైల్వే స్టేషన్లను ఈ కంట్రోల్ రూమ్‌కు అనుసంధానించారు. తెలంగాణలోని ఆదిలాబాద్, బేగంపేట, లింగంపల్లి, మంచిర్యాల, వరంగల్ స్టేషన్లు, ఏపీ లోని గుంటూరు, కడప, కర్నూలు, నెల్లూరు, ఒంగో లు, రాజమండ్రి, తుని, మహారాష్ట్రలోని ఔరంగాబాద్, ధర్మాబాద్, జాల్నా, నాగర్సోల్, పర్లివైద్యనాథ్ స్టేషన్లను ఈ కంట్రోల్ రూమ్ పరిధిలోకి తీసుకువచ్చారు. దీంతోపాటు ఆయా స్టేషన్లలో ప్రస్తుతం ఉన్న ఇంటిగ్రేటెడ్ సీసీకెమెరాల స్థానంలో ఇంటర్నెట్ ప్రొటోకాల్ ఆధారిత వీఎస్ఎస్ విధానం ఏర్పాటు చేశారు. రైల్‌టెల్ ఆధ్వర్యంలో ఆప్టికల్ ఫైబర్ కేబుల్‌తో దీన్ని అనుసంధానించారు. మొత్తం 520 సీసీ కెమెరాలతో అనుసంధాన అయ్యిందని జీఎం గజానన్ మాల్యా పేర్కొన్నారు. ఆయా స్టేషన్లలో మనుషుల ముఖ కవళికలను స్పష్టంగా గుర్తించేందుకుగాను 4కే రెషల్యూషన్ అల్ట్రా హెచ్డీ కెమెరాలను ఏర్పాటు చేసినట్టు తెలిపారు. చదవండి: డిజిలాకర్: ఆధార్‌ను ఆన్లైన్లోనే దాచుకొవచ్చు! యాపిల్ ఇన్‌స్టాగ్రామ్‌లో తెలుగోడి ఫొటో -
వ్యయంపై నిఘా నేత్రం
ఇదే తొలిసారి.. పెద్ద ఎత్తున పర్యవేక్షకులు ప్రత్యేక కమిటీలు.. విస్తృత స్థాయిలో వీడియో రికార్డింగ్ విశాఖ రూరల్, న్యూస్‌లైన్ : ఇదే తొలిసారిగా అభ్యర్థుల వ్యయంపై ఎన్నికల కమిషన్ అపూర్వ స్థాయిలో పర్యవేక్షణ చేస్తోంది. అడుగడుగునా నిఘా పెట్టి, అభ్యర్థులు చేపట్టే ప్రతి ఖర్చును లెక్కించి, వారు ఉల్లంఘనలకు పాల్పడ్డారేమో నిర్ణయించనుంది. తొలిసారిగా అభ్యర్థుల ఖర్చులను పర్యవేక్షించడానికి అధికారులు పర్యవేక్షకులను రంగంలోకి దించుతున్నారు. ఇందుకోసం ప్రత్యేకంగా కమిటీలను సైతం ఏర్పాటు చేస్తున్నారు. ప్రతీ రెండు, మూడు సెగ్మెంట్లకు ఒక ఎన్నికల వ్యయ పర్యవేక్షకుడిని వేయనున్నారు. అలాగే ప్రతీ ఒక్క నియోజకవర్గానికి సహాయ ఎన్నికల వ్యయ పరిశీలకుడిని నియమించనున్నారు. వీరితో పాటు వీడియో సర్వైలెన్స్ టీమ్‌ను పెట్టనున్నారు. ఇందులో ఒక అధికారి, వీడియోగ్రాఫర్ ఉంటారు. ప్రస్తుతం ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు ఖరారు కాకపోవడంతో ఈ నెల 12న నోటిఫికేషన్ వచ్చే వరకు అభ్యర్థులు చేసే ప్రతీ ఖర్చును పార్టీల ఖర్చుగా పరిగణిస్తారు. నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైన నాటి నుంచి వారు చేసే ఖర్చులను అభ్యర్థులకు సంబంధించినవిగా గుర్తిస్తారు. అభ్యర్థులు నిర్వహించే సమావేశాలు, ర్యాలీలు, ఇతరత్రా కార్యక్రమాలను ఈ టీమ్‌లు రికార్డ్ చేస్తాయి. ముందుగా ఆయా రాజకీయ కార్యక్రమాలను రికార్డు చేస్తున్నట్లు మైక్‌లో ప్రకటించి అనంతరం ర్యాలీ లేదా సమావేశాల్లో ఏయే సామాగ్రి ఉపయోగించారు, ఎన్ని వాహనాలు, క్యాప్‌లు, జెండాలు, మైక్‌లు ఇలా ప్రతీ అంశాన్ని రికార్డు చేయనున్నాయి. రికార్డు చేసిన విషయాలను వీడియో వ్యూయింగ్ బృందం పరిశీలిస్తుంది. ప్రచార సామాగ్రికి సంబంధించి ప్రతీ దానికి ఒక ధరను ముందుగానే నిర్ధారించే రేటు చార్టును రూపొందించారు. దాని ప్రకారం అభ్యర్థులు వినియోగించే వాటికి లెక్కలు కడతారు. ఇందుకోసం ప్రత్యేకంగా ఉన్న ‘క్యూ’ షీట్ అనే ఒక ఫార్మాట్‌ను తయారు చేశారు. ఒక్కో అభ్యర్థికి సంబంధించిన ఖర్చులను, ప్రచారాల్లో వినియోగించే సామాగ్రి వివరాలను ఈ క్యూషీట్లో పొందుపరుస్తారు. ఆ క్యూ షీట్ పరిశీలనకు అకౌంటింగ్ టీమ్‌ను ఏర్పాటు చేస్తున్నారు. ఈ టీమ్ ఒక్కో అభ్యర్థికి సంబంధించి షాడో ఎక్స్పెండిచర్ రిజిస్టర్‌ను నిర్వహిస్తుంది. అభ్యర్థులు ఎన్నికల ఖర్చు వివరాలను అధికారులకు తప్పుగా సమర్పిస్తే.. ఈ క్యూ షీట్ ద్వారా ఎంత ఖర్చు చేశారో అధికారులు గుర్తించి వారిపై ఎన్నికల సంఘం నిబంధనలకు అనుగుణంగా చర్యలకు ఉపక్రమిస్తారు.