Vidya Devi Bhandari
-
నేపాల్ పార్లమెంట్ రద్దు..
ఖాట్మాండు:నేపాల్ పార్లమెంట్‌ను ఆ దేశ అధ్యక్షురాలు బిద్యాదేవి భండారి రద్దు చేశారు. ఈ సందర్భంగా కొత్తగా ఎన్నికల తేదీలను ప్రకటించారు. నవంబర్ 12, 19 తేదీల్లో ఎన్నికలు నిర్వహించాలని ఆదేశాలు జారీ చేశారు. దీనికి ముందు శుక్రవారం సాయంత్రంలోగా ప్రభుత్వ ఏర్పాటుకు ముందుకు రావాల్సిందిగా ప్రధానిగా ఉన్న కేపీ శర్మ ఓలికి, ప్రతిపక్షాలకు ఆ దేశ అధ్యక్షురాలు బిద్యాదేవి గడువు ఇచ్చారు. ఇరు పక్షాలు ప్రభుత్వం ఏర్పాటు చేయడంలో విఫలం కావడంతో పార్లమెంట్‌ను రద్దు చేస్తున్నట్లు విద్యాదేవి భండారి శనివారం ప్రకటించారు. దీంతో మొదటి దశ ఎన్నికలు నవంబర్ 12న, రెండో దశ ఎన్నికలు 19 జరగనున్నాయి. తనకు 153 మంది సభ్యలు మద్దతు ఉందంటూ ప్రధాని మంత్రి కేపీ శర్మ ఓలి ప్రకటించారు.తనకు 121 మంది సభ్యులతో పాటు, జేఎస్‌పీఎన్‌కు చెందిన మరో 32 మంది సభ్యుల మద్దతు ఉందని పేర్కొన్నారు. బలాన్ని సభలో రుజువు చేసుకోలేకపోవడంతో ఈ సంక్షోభం ప్రారంభమైంది.అయితే కేపీ శర్మ ఓలి బలాన్ని రుజువు చేసుకోవడంలో విఫలం కావడంతో ప్రతిపక్షాలను ప్రభుత్వం ఏర్పా టు చేయాల్సిందిగా అధ్యక్షురాలు పిలుపునిచ్చారు.అయితే ప్రతిపక్షాలు సంకీర్ణ కూటమి ఏర్పాటు చేయడంలో విఫలం చెందాయి . నేపాల్ పార్లమెంట్లో 275 సీట్లు ఉండగా ప్రభుత్వ ఏర్పాటుకు 136 మంది మద్దతు అవసరం. -
నేపాల్ అధ్యక్షురాలిగా మళ్లీ విద్యా దేవి భండారీ
కఠ్మాండు: నేపాల్ అధ్యక్షురాలిగా విద్యా దేవి భండారీ(56) రెండోసారి ఎన్నికయ్యారు. ప్రస్తుత అధ్యక్షురాలు, లెఫ్ట్ కూటమి అభ్యర్థి అయిన భండారీ.. నేపాలీ కాంగ్రెస్ అభ్యర్థి కుమారి లక్ష్మీ రాయ్‌పై మూడింట రెండో వంతుకు పైగా మెజారిటీతో గెలుపొందారు. మంగళవారం జరిగిన ఎన్నికల్లో భండారీకి 39,275 ఓట్లు, లక్ష్మీ రాయ్‌కు 11,730 ఓట్లు దక్కాయి. భండారీ 2015లో నేపాల్ తొలి మహిళా అధ్యక్షురాలిగా బాధ్యతలు చేపట్టారు. 1994, 1999లో రెండు సార్లు నేపాల్ పార్లమెంట్‌కు ఎన్నికయ్యారు. -
ఉత్తరాన వేగుచుక్క.. విద్యాదేవీ
భారతదేశానికి ఉత్తరాన.. ఆకాశాన్ని తాకుతున్నట్లనిపించే హిమాలయాలు. వాటి పాదాల చెత దాదాపు 1.5 లక్షల చదరపు కిలోమీటర్ల వైశాల్యంలో విస్తరించిన నేపాల్. ఆ దేశ భూభాగం మొత్తంలో వ్యవసాయానికి పనికొచ్చే భూమి కేవలం 20 శాతం! జనాభా చూస్తే దాదాపు 3 కోట్లు! అందరికీ అన్ని సౌకర్యాల మాట అటుంచితే, కనీసం తిండిగింజలైనా దొరకని పరిస్థితి. మరోవైపు ప్రజల్ని పీక్కుతినే రాజరికం. ఏళ్లుగా అనుభవించిన పీడన నుంచి విప్లవం జనించింది. ఆ ఎరుపులో నుంచి వికసించిన వేగుచుక్కే.. విద్యాదేవీ భండారి! 2006లో విజయవంతమైన నేపాల్ విప్లవోద్యమంలో కీలక పాత్రధారి విద్యాదేవీ భండారి. మహిళా గెరిల్లాల దళాలను నడిపించడం దగ్గర్నుంచి మహిళా రైతు కూలీలకు హక్కులకు పాఠాలు నూరిపోయడం వరకు అన్ని బాధ్యతలు ఆమెవే. భర్త మదన్ భండారీ.. కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ నేపాల్ (యునిఫైడ్ మార్క్సిస్ట్ లెనినిస్ట్) కార్యదర్శి. 1993లో ఆయన అనుమానాస్పద రీతిలో మరణించారు. భర్త మరణంతో కుంగిపోకుండా.. ప్రజాసేవకే జీవితాన్ని అంకితం చేసింది విద్యాదేవి. (నిజానికి విద్యార్థి దశలోనే ఉద్యమాలకు నాయకత్వం వహించిన ఆమె.. మదన్ భండారీతో పెళ్లి తర్వాత కొన్నేళ్లు రాజకీయాలకు దూరంగా ఉన్నారు.)ఇప్పటి సందర్భం.. నేపాల్ మొట్టమొదటి మహిళా అధ్యక్షురాలిగా విద్యాదేవీ భండారి ఎన్నిక కావడం. కఠ్మాండులోని నేపాల్ పార్లమెంట్ భవనంలో బుధవారం నిర్వహించిన అధ్యక్ష ఎన్నికల్లో భారీ మెజారిటీతో విజయం సాధించిన విద్యాదేవీ.. ఆ దేశ చరిత్రలో సరికొత్త అధ్యాయాన్ని సృష్టించారు. సమీప ప్రత్యర్థి నేపాల్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ఖుల్ బహదూర్ గురుంగ్ పై 100కుపైగా ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. గత సెప్టెంబర్ లో నూతన రాజ్యాంగాన్ని అమలులోకి తెచ్చుకున్న నేపాల్ కు.. నెల లోగా కొత్త అధ్యక్షుణ్ని ఎన్నుకోవడం అనివార్యమైంది. ఈ పదవికి ఎన్నికయ్యేంతవరకు విద్యాదేవీ.. నేపాల్ కమ్యూనిస్ట్ పార్టీ (యూఎంఎల్)కు ఉపాధ్యక్షురాలిగా పనిచేశారు. రాచరికం అంతమైన తర్వాత 2008లో జరిగిన మొట్టమొదటి ప్రజాస్వమ్యయిత ఎన్నికల్లో నేపాల్ అధ్యక్షుడిగా రామ్ భరణ్ యాదవ్ ఎన్నికయిన సంగతి తెలిసిందే.