కఠ్మాండు: నేపాల్ అధ్యక్షురాలిగా విద్యా దేవి భండారీ(56) రెండోసారి ఎన్నికయ్యారు. ప్రస్తుత అధ్యక్షురాలు, లెఫ్ట్ కూటమి అభ్యర్థి అయిన భండారీ.. నేపాలీ కాంగ్రెస్ అభ్యర్థి కుమారి లక్ష్మీ రాయ్‌పై మూడింట రెండో వంతుకు పైగా మెజారిటీతో గెలుపొందారు. మంగళవారం జరిగిన ఎన్నికల్లో భండారీకి 39,275 ఓట్లు, లక్ష్మీ రాయ్‌కు 11,730 ఓట్లు దక్కాయి. భండారీ 2015లో నేపాల్ తొలి మహిళా అధ్యక్షురాలిగా బాధ్యతలు చేపట్టారు. 1994, 1999లో రెండు సార్లు నేపాల్ పార్లమెంట్‌కు ఎన్నికయ్యారు.
Comments
Please login to add a commentAdd a comment