గవర్నర్‌తో తెలుగు సంఘాల భేటీ
పుణే సిటీ, న్యూస్‌లైన్: గవర్నర్ సీహెచ్ విద్యాసాగర్‌రావు మొదటిసారిగా ఆదివారం పుణేకు విచ్చేసిన సందర్భంగా పుణేలోని పలు తెలుగు సంఘాలు గవర్నర్‌ను కలిసి పుష్పగుచ్ఛాలు, శాలువతో సత్కరిం చాయి. పుణేలోని రాజ్ భవన్లో ఆదివారం సాయంత్రం 5 గంటలకు గవర్నర్‌ను తెలుగు సంఘాల నాయకులు కలిశారు.
ఆంధ్రా సంఘం సభ్యులు, ఘోర్పడి బాలాజీ సేవా ట్రస్ట్ సభ్యులు గవర్నర్‌ను సత్కరిం చారు. అదేవిధంగా స్థానికంగా తెలుగు వారు ఎదుర్కొంటున్న పలు సమస్యల విషయమై గవర్నర్‌తో విన్నవించారు. నగరంలో తెలుగు పాఠశాలను ఏర్పాటు చేయాలనీ, కమ్యూనిటీ హాలుకు ప్రభుత్వం స్థలం కేటాయించేలా చూడాలని కోరారు.
ఆంధ్రా సంఘం నిర్వహించే వజ్రోత్సవాలు, సప్తగిరి శ్రీ బాలాజీ సేవా ట్రస్ట్ నిర్వహించే శ్రీవారి బ్రహ్మోత్సవాలలో పాలుపంచుకోవాలని విన్నవించుకున్నారు. ఇందుకు గవర్నర్ కూడా సానుకూలంగా స్పందిం చారు. అదేవిధంగా మోదీ తలపెట్టిన స్వచ్ఛ్ భారత్ అభియాన్ కార్యక్రమంలో నగర తెలుగు ప్రజలు పాలుపంచుకోవాలని పిలుపునిచ్చారు.