vijay prasad
-
మళ్లను పరామర్శించిన సినీనటుడు ఆలీ
సాక్షి, సీతమ్మధార(విశాఖ ఉత్తర): మాజీ ఎమ్మెల్యే మళ్ల విజయప్రసాద్ తల్లి సన్యాసమ్మ ఇటీవల అనారోగ్యంతో మృతి చెందడం తెలిసిందే. ఈ విషయం తెలుసుకున్న సినీనటుడు ఆలీ సీతమ్మధారలోని మళ్ల నివాసానికి గురువారం వెళ్లి వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు. తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఆమె పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని ఆలీ ప్రార్థించారు. చదవండి: (యూట్యూబర్ శ్రీకాంత్రెడ్డిని చితక్కొట్టిన కరాటే కల్యాణి) -
గంటా ఎప్పుడైనా ప్రజలకు సేవా చేశావా?
సాక్షి, విశాఖపట్నం : మాజీ మంత్రి, టీడీపీ సీనియర్ నేతపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.టీడీపీ హయాంలో వైఎస్సార్ సీపీ కుటుంబాలను ఇబ్బందులు పెట్టారని, చోడవరం, భీమిలి, అనకాపల్లి ప్రజలను వంచించిన ఘనత గంటాదని మాజీ ఎమ్మెల్యే మళ్ల విజయప్రసాద్ ఈ సందర్భంగా తీవ్రస్థాయిలో మండిపడ్డారు. గంటా తప్పుడు రాజకీయాలకు శిక్షపడే సమయం దగ్గర పడిందని ఆయన అన్నారు. ఆయన ఎప్పుడైనా ప్రజలకు సేవ చేశారా అంటూ సూటిగా ప్రశ్నలు సంధించారు. వైఎస్సార్ సీపీ నగర అధ్యక్షుడు శ్రీనివాస్ వంశీకృష్ణ మాట్లాడుతూ.. మంత్రి అవంతి శ్రీనివాసరావును విమర్శించే హక్కు ఎమ్మెల్యే గంటాకు లేదన్నారు. వైఎస్సార్ సీపీ విధానాలకు అనుగుణంగా అవంతి నిజాయితీగా పని చేస్తున్నారన్నారు. ఎన్నికలకో పార్టీ, నియోజకవర్గం మారే గంటాను జనం నమ్మే స్థితిలో లేరన్నారు. భీమిలీలో జనం తిప్పికొట్టడంతో ఉత్తర నియోజకవర్గానికి వచ్చారని ఎద్దేవా చేశారు. ఇక్కడ మూడు నెలలుగా కనిపించడం లేదని జనాలు ఆగ్రహంతో ఉన్నారని , విశాఖలో కార్పొరేషన్ ఎన్నికలు జరగకుండా అడ్డుకున్న వ్యక్తి గంటా అని మండిపడ్డారు. -
ఓడిన రమ్యపై విమర్శలు
ఎన్నికల్లో ఓటమి పాలైన నటి రమ్యపై కన్నడ హీరో ఘాటుగా విమర్శలు గుప్పించారు. దీంతో ఆయనపై రమ్య మండిపడుతున్నారు. తమిళంలో కుత్తు, పొల్లాదవన్, వానరం ఆయిరం తదితర చిత్రాల్లో నటించిన రమ్య కన్నడంలో ప్రముఖ హీరోయిన్గా వెలుగొందుతున్నారు. గత ఏడాది లోక్సభ ఎన్నికల్లో పోటీ చేసి గెలిచారు. దీంతో నటనకు స్వస్తి చెప్పారు. ఆ సమయంలో నీర్ టోస్లాంటి కొన్ని చిత్రాలను అంగీకరించి ఆ తరువాత నటించలేదు. ఆ కారణంగా ఆ చిత్ర హీరో జగ్గేష్, దర్శకుడు విజయప్రసాద్ రమ్యపై తీవ్రంగా విమర్శించారు. రమ్య, జగ్గేష్ తరచు ట్విట్టర్లో ఢీకొంటూనే ఉన్నారు. ఇటీవల జరిగిన లోక్ సభ ఎన్నికల్లో మళ్లీ పోటీ చేసిన రమ్య ఓటమిపాలయ్యారు. అంతేకాదు మళ్లీ నటిస్తానని ప్రకటించారు. దీంతో నటుడు జగ్గేష్ మరోసారి రమ్యపై విమర్శనాస్త్రాలు సంధించారు. ఎన్నికల్లో గెలిస్తే రమ్య మళ్లీ నటించేవారా? ఆమె సందర్భవాది అని ఎటు అవకాశం ఉంటే అటు దూకేసే మనస్తత్వం రమ్యదని విమర్శలు కురిపించారు. దీంతో జగ్గేష్పై రమ్య మండిపడుతున్నారు.