ఉన్నత విద్యామండలి చైర్మన్‌గా విజయరాజు
రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ
ఏఎన్‌యూ: రాష్ట్ర ఉన్నత విద్యామండలి చైర్మన్‌గా ఆచార్య నాగార్జున యూనివర్సిటీ (ఏఎన్‌యూ) ఆర్ట్స్ కళాశాల ప్రిన్సిపాల్, కామర్స్ అండ్ మేనేజ్మెంట్ డీన్ డాక్టర్ ఎస్ విజయరాజు నియమితులయ్యారు. ఈ మేరకు రాష్ట్ర ఉన్నత విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ సుమితా దావ్రా సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. కొన్ని నెలల క్రితమే ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ ఎల్.వేణుగోపాలరెడ్డి పదవీకాలం పూరైంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం చివరకు విజయరాజును చైర్మన్‌గా నియమించింది.
విజయరాజు యూనివర్సిటీ ఆర్ట్స్ కళాశాలల కామర్స్ అండ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ విభాగంలో సీనియర్ ప్రొఫెసర్‌గా విధులు నిర్వహిస్తున్నారు. 1979లో ఏఎన్‌యూలో అధ్యాపకునిగా విధుల్లో చేరారు. ఆయన పర్యవేక్షణలో ఇప్పటి వరకు 24కు పైగా పీహెచ్‌డీలు, నాలుగు ఎంఫిల్ డిగ్రీలు పరిశోధకులకు ప్రదానం చేశారు.