Vijayapal Reddy
-
ఎవరు తాతా ఇతను!
సత్యరాజ్, వశిష్ట ఎన్. సింహా, సాంచి రాయ్, ‘సత్యం’ రాజేష్ లీడ్ రోల్స్‌లో నటించిన సినిమా ‘త్రిబాణధారి బార్బరిక్’. మారుతీ టీమ్ ప్రోడక్ట్ సమర్పణలో మోహన్ శ్రీవత్స దర్శకత్వంలో విజయపాల్ రెడ్డి ఆదిదల నిర్మించారు. ఈ సినిమా మోషన్ పోస్టర్ వీడియోను రిలీజ్ చేసింది చిత్రయూనిట్. ‘తాతా.. ఎవరు తాతా ఇతను’, ‘ప్రపంచం గుర్తించని గొప్ప యోధుడమ్మా..’, ‘భీష్ముడా తాతా.. కాదమ్మ...’, ‘మాధవ.. వెయ్యి ఏనుగుల బలశాలి భీముడికి మనవణ్ణి, ఘటోత్కచుడికి కొడుకుని’ వంటి డైలాగ్స్ ఈ వీడియోలో ఉన్నాయి. ఈ చిత్రానికి కెమెరా: కుశేందర్ రమేశ్ రెడ్డి, సంగీతం: ఇన్ఫ్యూషన్ బాండ్. -
సింగరేణి సంస్థ అభివృద్ధిలో భాగస్వాములు కావాలి
జీఎం విజయపాల్‌రెడ్డి యైటింక్లయిన్‌కాలనీ (కరీంనగర్) : సింగరేణి అభివృద్ధిలో డిప్యూటీ మేనేజర్లు భాగస్వాములు కావాలని ఆర్జీ-2 జీఎం విజయపాల్‌రెడ్డి కోరా రు. సోమవారం స్థానిక నర్గూంకర్ ఇన్స్టిట్యూ ట్ ఆఫ్ మేనేజ్మెంట్(నిమ్)లో ప్రారంభమైన డిప్యూటీ మేనేజర్ల శిక్షణ తరగతులకు ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యూరు. ఈ సందర్భం గా జీఎం మాట్లాడుతూ డిప్యూటీ మేనేజర్లు త మ ప్రతిభా పాటవాలతో సంస్థకు వెన్నుదన్ను గా నిలవాలన్నారు. సరికొత్త ఆలోచనలతో ముందుకు సాగి సంస్థ అభివృద్ధికి కృషి చేయూలని సూచించారు. సింగరేణి వ్యాప్తంగా అండర్ మేనేజర్ల నుంచి డిప్యూటీ మేనేజర్లుగా పదోన్నతి పొందిన 82 మందికి రెండు వారాల పా టు శిక్షణ ఇస్తున్నామని ఆయన పేర్కొన్నారు. కార్యక్రమంలో ఎస్‌ఓటూ జీఎం రవీందర్, నిమ్ ఇన్చార్జి జస్బీర్సింగ్, యూఎంటీఐ ఇన్చార్జి మూర్తి, తదితరులు పాల్గొన్నారు.