సింగరేణి సంస్థ అభివృద్ధిలో భాగస్వాములు కావాలి | company needs partners in the development of production | Sakshi
Sakshi News home page

సింగరేణి సంస్థ అభివృద్ధిలో భాగస్వాములు కావాలి

Published Mon, May 23 2016 11:22 PM | Last Updated on Mon, Sep 4 2017 12:46 AM

సింగరేణి సంస్థ అభివృద్ధిలో   భాగస్వాములు కావాలి

సింగరేణి సంస్థ అభివృద్ధిలో భాగస్వాములు కావాలి

జీఎం విజయపాల్‌రెడ్డి



యైటింక్లయిన్‌కాలనీ (కరీంనగర్) : సింగరేణి అభివృద్ధిలో డిప్యూటీ మేనేజర్లు భాగస్వాములు కావాలని ఆర్జీ-2 జీఎం విజయపాల్‌రెడ్డి కోరా రు. సోమవారం స్థానిక నర్గూంకర్ ఇన్‌స్టిట్యూ ట్ ఆఫ్ మేనేజ్‌మెంట్(నిమ్)లో ప్రారంభమైన డిప్యూటీ మేనేజర్ల శిక్షణ తరగతులకు ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యూరు. ఈ సందర్భం గా జీఎం మాట్లాడుతూ డిప్యూటీ మేనేజర్లు త మ ప్రతిభా పాటవాలతో సంస్థకు వెన్నుదన్ను గా నిలవాలన్నారు.


సరికొత్త ఆలోచనలతో ముందుకు సాగి సంస్థ అభివృద్ధికి కృషి చేయూలని సూచించారు. సింగరేణి వ్యాప్తంగా అండర్ మేనేజర్ల నుంచి డిప్యూటీ మేనేజర్లుగా పదోన్నతి పొందిన 82 మందికి రెండు వారాల పా టు శిక్షణ ఇస్తున్నామని ఆయన పేర్కొన్నారు. కార్యక్రమంలో ఎస్‌ఓటూ జీఎం రవీందర్, నిమ్ ఇన్‌చార్జి జస్‌బీర్‌సింగ్, యూఎంటీఐ ఇన్‌చార్జి మూర్తి, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement