విజయవాడ-అహ్మదాబాద్ మధ్య 30న ప్రత్యేక రైళ్లు
హైదరాబాద్: వేసవి రద్దీ దృష్ట్యా విజయవాడ-అహ్మదాబాద్ మధ్య 2 ప్రత్యేక రైళ్లను నడుపుతున్నట్టు రైల్వే అధికారులు తెలిపారు. ఈ నెల 30న రాత్రి 7 గంటలకు నంబర్ 02714 రైలు విజయవాడలో బయలుదేరి, మరుసటిరోజు సాయంత్రం 5.45కు అహ్మదాబాద్ చేరుతుంది. తిరుగు ప్రయాణంలో నంబర్ 02713 రైలు మే 31న రాత్రి 7.30కి అహ్మదాబాద్లో బయలుదేరి మరుసటి రోజు సాయంత్రం 6.55కు విజయవాడ చేరుతుందని దక్షిణ మధ్య రైల్వే సీపీఆర్ఓ సాంబశివరావు మంగళవారం తెలిపారు.
కాచిగూడ-గుంటూరు ప్యాసింజర్ పాక్షిక రద్దు
కాచిగూడ-గుంటూరు ప్యాసింజర్ రైలు(నం.57623) 6 గంటలకుపైగా ఆలస్యంగా నడుస్తుండడంతో మంగళ, బుధవారాల్లో కొన్ని ప్రాంతాల మధ్య పాక్షికంగా రద్దు చేశారు. దీనిని కర్నూలుసిటీ వరకే నడుపుతున్నట్టు సంబంధిత అధికారులు తెలిపారు. అక్కడి నుంచి కాచిగూడకు బదులు తిరిగి గుంటూరుకు పయనమవుతుందన్నారు. ఫలితంగా 22న కాచిగూడ-క ర్నూలు రైలు ఉండదన్నారు.