BY Vijayendra
-
దమ్ముంటే నిరూపించండి
సాక్షి బెంగళూరు: తమ ప్రభుత్వాన్ని కూల్చడానికి బీజేపీ ప్రయత్నించిందని, ఒక్కో కాంగ్రెస్ ఎమ్మెల్యేకు రూ.50 కోట్ల చొప్పున ఇవ్వజూపిందని, 50 మంది ఎమ్మెల్యేలను కొనడానికి కుట్రలు చేసిందని కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ఆరోపించడం సంచలనాత్మకంగా మారింది. సిద్ధరామయ్య ఆరోపణలపై కర్ణాటక బీజేపీ అధ్యక్షుడు బి.వై.విజయేంద్ర తీవ్రంగా స్పందించారు. దమ్ముంటే నిరూపించాలని గురువారం సిద్ధరామయ్యకు సవాలు విసిరారు. ముఖ్యమంత్రి సొంత పార్టీ ఎమ్మెల్యేల విశ్వాసం కోల్పోయారని, అందుకే తమపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. ఒక్కో ఎమ్మెల్యేకు రూ.50 కోట్ల చొప్పున ఇవ్వడానికి తాము ప్రయత్నించినట్లు నిరూపించకపోతే ప్రజలు ఎప్పటికీ ఆయనను నమ్మరని తేల్చిచెప్పారు. ఉన్నత పదవిలో ఉన్న నాయకుడి ప్రవర్తన కూడా ఉన్నతంగా ఉండాలని హితవు పలికారు. దర్యాప్తు సంస్థలు ముఖ్యమంత్రి చేతిలోనే ఉన్నాయని, ఆరోపణలను ఎందుకు నిరూపించడం లేదని ప్రశ్నించారు. అయితే, విజయేంద్ర సవాలుపై స్పందించడానికి సిద్ధరామయ్య నిరాకరించారు. మరోవైపు బీజేపీపై ముఖ్యమంత్రి సిద్ధరామయ్య చేసిన ఆరోపణలను ఉప ముఖ్యమంత్రి, కర్ణాటక పీసీసీ అధ్యక్షుడు డి.కె.శివకుమార్ సమర్థించారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలను కొనుగోలు చేయడానికి బీజేపీ ప్రయత్నించిన సంగతి నిజమేనని గురువారం చెప్పారు. పలువురు మంత్రులు సైతం సిద్ధరామయ్యకు మద్దతు ప్రకటించారు. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అస్థిరపరిచేందుకు ఎమ్మెల్యేల కొనుగోలుకు బీజేపీ యత్నించిందందని వారు పేర్కొన్నారు. -
కర్ణాటకలో మళ్లీ అధికారం బీజేపీదే..!
-
ఢిల్లీ టూర్‌తో వేడెక్కిన కర్ణాటక రాజకీయం
శివాజీనగర: రాష్ట్ర బీజేపీలో నాయకత్వ మార్పుపై చర్చ జరుగుతున్న నేపథ్యంలో సీఎం యడియూరప్ప తనయుడు, యువమోర్చా నేత విజయేంద్ర ఢిల్లీకి వెళ్లడం రాజకీయ వర్గాల్లో ఆశ్చర్యార్థకమైంది. పరిపాలనలో విజయేంద్ర వేలు పెడుతున్నారని, సీఎంను మార్చాలని యడ్డి వ్యతిరేక వర్గం డిమాండ్ చేస్తున్న తరుణంలో ఈ పరిణామం చోటుచేసుకుంది. బీజేపీ రాష్ట్ర ఇన్చార్జి అరుణ్‌సింగ్‌ను కలుస్తారని తెలిసింది. రాష్ట్ర రాజకీయాల గురించి చర్చించే అవకాశముది ఇది మూడు ముక్కల ప్రభుత్వమని మంత్రి యోగీశ్వర్ ఇటీవల విమర్శలు చేయడంపై విజయేంద్ర ఫిర్యాదు చేయనున్నట్లు తెలుస్తోంది. ఆయన వల్ల పారీ్టకి, ప్రభుత్వానికి అవమానమైందని, వీలైతే మంత్రి పదవి నుంచి తొలగించాలని కోరే అవకాశముంది. బళ్లారి జిల్లాలో జిందాల్‌కు ఇచ్చిన 3 వేల ఎకరాలకు పైగా భూమిని వెనక్కు తీసుకోవడంపైనా వివరణ ఇవ్వనున్నారు. హైకమాండ్ వద్ద తన వాదనను వినిపించేందుకు యడియూరప్ప తనయున్ని పంపినట్లు తెలిసింది. సీఎం మార్పు ఉండదు మైసూరు: ఢిల్లీకి ఎవరు, ఎందుకు వెళ్లారు అన్న విషయం నాకు తెలియదు, సీఎంగా యడియూరప్ప పూర్తి కాలం పదవిలో ఉంటారని బీజేపి జాతీయ కార్యదర్శి సి.టి.రవి అన్నారు. మంగళవారం మైసూరులో ఆయన పార్టీ ఆఫీసులో మాట్లాడారు. బీ.వై. విజయేంద్ర ఢిల్లీకి వెళ్లడాన్ని ప్రస్తావిస్తూ పార్టీ నాయకులు అన్నాక అనేక కార్యక్రమాలు ఉంటాయన్నారు. కరోనా సమయంలో రాజకీయాలువద్దని అన్నారు. సీఎం మార్పు ఉండబోదని చెప్పారు. -
రూల్స్ బ్రేక్ చేసిన సీఎం కుమారుడు, భార్యతో కలిసి..
బెంగళూరు: దేశవ్యాప్తంగా కరోనా కట్టడి చర్యలు కొనసాగుతున్నాయి. చాలా రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో కర్ఫ్యూ, లాక్డౌన్ అమలు చేస్తున్నారు. అయితే వాటిని కొందరు పట్టించుకోవడం లేదు. తాజాగా ముఖ్యమంత్రి యడియూరప్ప కుమారుడే స్వయంగా లాక్డౌన్ నిబంధనలను ఉల్లంఘించారు. సీఎం కుమారుడు, బీజేపీ కర్ణాటక ఉపాధ్యక్షుడు బీవై విజయేంద్ర తన భార్యతో కలిసి మైసూర్ జిల్లా నంజనగూడులోని కంఠేశ్వర స్వామి ఆలయాన్ని మంగళవారం ఉదయం సందర్శించారు. భార్యతో కలిసి గర్భ గుడిలో ప్రత్యేక పూజలు చేశారు. అర్థగంటకు పైగా ఆ ప్రాంతంలో ఉన్నారు. ఆయన సందర్శన నేపథ్యంలో భారీ ఎత్తున పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. సీఎం తనయుడు కావడంతో ఆలయ అధికారులు కూడా కోవిడ్ నిబంధనల్ని పక్కన పెట్టేశారు. ఆయనకు వీఐపీ మర్యాదలన్నీ చేశారు. కాగా, బీవై విజయేంద్ర ఆలయ సందర్శన కర్ణాటకలో తీవ్ర దుమారం రేపుతోంది. సీఎం కుమారుడికి నిబంధనలు వర్తించవా? అని ప్రతిపక్ష పార్టీల నేతలు ప్రశ్నిస్తున్నారు. వాస్తవంగా కర్ణాటకలో లాక్డౌన్ కొనసాగుతోంది. దీంతో ఆలయాలన్నీ మూసివేశారు. కరోనా వ్యాప్తి నేపథ్యంలో విధించిన రూల్స్‌ను బ్రేక్ చేసిన విజయేంద్రపై చర్యలు తీసుకోవాలని వివిధ పార్టీల నాయకులు డిమాండ్ చేస్తున్నారు. ఇలాంటి సమయంలో ప్రత్యేకంగా విజయేంద్ర ఆలయంలో పూజలు చేపట్టడం పలు విమర్శలకు దారితీసింది. సామాన్యులకు ఒక రూల్.. నాయకులకు ఒక నిబంధన ఉంటదా? అని స్థానికులూ ప్రశ్నిస్తున్నారు. సోషల్ మీడియాలో విజయేంద్రపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. చదవండి: గొర్రెల ధర్నా: బర్త్ డే నాడు గవర్నర్‌కు చేదు అనుభవం