జాతీయస్థాయి ‘బాల్‌బ్యాడ్మింటన్’కు ప్రియ
వినుకొండ రూరల్: మండలంలోని పెదకంచర్ల జెడ్పీ హైస్కూల్ 10వ తరగతి విద్యార్థిని మాదాల విజయ్‌కృష్ణ ప్రియ బాల్‌బ్యాడ్మింటన్ జాతీయస్థాయి పోటీలకు ఎంపికైంది. ఈనెల 14 నుంచి 16వ తేదీ వరకు శ్రీకాకుళం జిల్లా పలాసలో జరిగిన రాష్ట్రస్థాయి సబ్‌జూనియర్ పోటీల్లో గుంటూరు జిల్లా బాలికల జట్టు తృతీయ స్థానం సాధించింది. ఈ జట్టులో అత్యుత్తమ ప్రతిభ చూపిన మాదాల విజయకృష్ణ ప్రియ జాతీయ జట్టుకు ఎంపిక కావడంతో పాటు ఉత్తమ క్రీడాకారులకు అందించే స్టార్ ఆఫ్ ఆంధ్ర అవార్డును సాధించినట్లు పాఠశాల ఈపీటీ ఆర్.రాధాకృష్ణమూర్తి తెలిపారు. క్రీడాకారిణిని పలువురు అభినందించారు.