విలీన ప్రతిపాదిత గ్రామాల ప్రత్యేక అధికారిగా విజయకృష్ణన్
రాజమహేంద్రవరం రూరల్ :
రాజమహేంద్రవరం నగరపాలకసంస్థలో విలీన ప్రతిపాదిత గ్రామ పంచాయతీల ప్రత్యేకాధికారిగా రాజమహేంద్రవరం సబ్‌కలెక్టర్ విజయకృష్ణ¯ŒSను నియమిస్తూ కలెక్టర్ అరుణ్‌కుమార్ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. రాజమహేంద్రవరం రూరల్ మండలంలోని ధవళేశ్వరం, రాజవోలు, బొమ్మూరు, హుకుంపేట, పిడింగొయ్యి, శాటిలైట్‌సిటీ, కోలమూరు, కాతేరు, వెంకటనగరం, తొర్రేడు, రాజానగరం మండలంలోని రాజానగరం, పాలచర్ల, నరేంద్రపురం, చక్రద్వారబంధం, లాలాచెరువు, వెలుగుబంద, నామవరం, కోరుకొండ మండలంలోని గాడాల, మధురపూడి, బూరుగుపూడి, నిడిగట్ల గ్రామాలకు ఇప్పటివరకు నగరపాలకసంస్థ కమిషనర్ విజయరామరాజును ప్రత్యేకాధికారిగా నియమిస్తూ కలెక్టర్ ఉత్తర్వులు జారీ చేశారు. అయితే గ్రామాల విలీన ప్రక్రియ రద్దు చేయాలంటూ రాజమహేంద్రవరం రూరల్ మండల రాజవోలు గ్రామానికి చెందిన వైఎస్సార్సీపీ రాష్ట్రకార్యదర్శి నక్కారాజబాబు 2014లోనే హైకోర్టులో ప్రజావ్యాజ్యం (పిల్నెంబరు 79)దాఖలు చేశారు. ఈ పిల్‌పై 2015 పిభ్రవరి 18 తేదీన హైకోర్టు (డబ్ల్యూపినెంబరు 3489) నక్కా రాజబాబుకు అనుకూలంగా తీర్పునిస్తూ విలీన ప్రక్రియను తాత్కాలికంగా నిలిపివేశారు. ఇటీవల విజయరామరాజును గ్రామాల ప్రత్యేకాధికారిగా నియమించడంతో నక్కా రాజబాబు 2016లో హైకోర్టును ఆశ్రయించారు. అయితే విలీన ప్రక్రియ అంశం కోర్టులో పెండింగ్‌లో ఉండగా ప్రత్యేకాధికారి నియామకం చెల్లదంటూ గత ఏడాది డిసెంబరు ఒకటో తేదీన రాజబాబుకు అనుకూలంగా ఇంటరిమ్ సస్పెన్ష¯ŒS ఆర్డర్‌ను మంజూరు చేసింది. ఇదే సమయంలో యథాతథ ఉత్తర్వులు ఇస్తూనే విలీన ప్రక్రియ అంశం కోర్టులోఉండగా ప్రత్యేకాధికారిగా ఎందుకునియమించారంటూ కోర్టు జిల్లా కలెక్టరుకు డైరెక్ష¯ŒS ఇస్తూ మూడు వారాలలోగా కోర్టుకు నివేదించాలంటూ ఆర్డర్ ఇచ్చింది. కలెక్టర్ కూడా హైకోర్టులో ఉన్న విషయాన్ని నివేదించారు. దీం తో ప్రత్యేకాధికారిని మారుస్తూ సోమవారం 3344/ 2011/ఏ2 ప్రొసీడింగ్స్‌తో ప్రత్యేకాధికారిగా ఉన్న విజయరామరాజును తాత్కాలికంగా మార్పు చేస్తూ సబ్‌కలెక్టర్ విజయకృష్ణ¯ŒSకు ప్రత్యేకాధికారి బాధ్యతలు అప్పగించారు.