Vikramasinhapuri University
-
వైఎస్సార్ రైతు భరోసా నేడు ప్రారంభం
సాక్షి, అమరావతి: ‘వైఎస్సార్ రైతు భరోసా – పీఎం కిసాన్’ పథకాన్ని నేడు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రారంభించనున్నారు. ఇందుకు సంబంధించి నెల్లూరులోని విక్రమసింహపురి యూనివర్సిటీ ప్రాంగణంలో ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి లబ్ధిదారులకు చెక్కులు పంపిణీ చేస్తారు. అనంతరం అక్కడి బహిరంగ సభలో ఆయన ప్రసంగిస్తారు. ఈ పథకం కింద రాష్ట్ర వ్యాప్తంగా అర్హులైన రైతులు, కౌలుదారుల కుటుంబాల పేరిట బ్యాంకు అకౌంట్లలో నేరుగా పెట్టుబడి సాయాన్ని మంగళవారం జమ చేసేందుకు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది. ఇప్పటికే 40 లక్షల మంది రైతులు, కౌలు రైతుల కుటుంబాలు ఇందుకు అర్హమైనవిగా అధికారులు తేల్చారు. సరళీకరించిన నిబంధనల ప్రకారం మరో 14 లక్షల మంది వరకు లబ్ధిదారుల జాబితాలో చేరే అవకాశం ఉంది. ఇతర జిల్లాల్లో మంత్రులు, ఎమ్మెల్యేల చేతుల మీదుగా ఈ పథకం కింద చెక్కులు పంపిణీ చేస్తారు. ► ‘వైఎస్సార్ రైతు భరోసా’ ప్రకటించిన తేదీ, ప్రాంతం: జులై 8వ తేదీ 2017 – గుంటూరు (పార్టీ ప్లీనరీలో) ► తొలుత అర్హత : ఐదు ఎకరాలలోపు సన్న, చిన్నకారు రైతులు ► తర్వాత మారిన అర్హత : అన్నదాతలందరికీ వర్తింపు ► తొలుత ప్రకటించిన సాయం : ఏటా రూ.12,500 చొప్పున నాలుగేళ్లలో రూ.50,000 ► తాజాగా ప్రకటించిన సాయం : ఏటా రూ.13,500 చొప్పున ఐదేళ్లలలో రూ.67,500 ► జగన్ ప్లీనరీలో ప్రకటన తర్వాత ఇదే తరహా పథకాన్ని (రైతు బంధు) అమలు చేసిన రాష్ట్రం : తెలంగాణ ► కేంద్రం ఇటీవల అమల్లోకి తెచ్చిన పథకం : పీఎం కిసాన్ సమ్మాన్ యోజన ప్రారంభోత్సవానికి ఏర్పాట్లు పూర్తి సాక్షి ప్రతినిధి, నెల్లూరు : శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా సర్వేపల్లి నియోజకవర్గం వెంకటాచలం మండలం కాకుటూరు గ్రామంలోని విక్రమ సింహపురి విశ్వవిద్యాలయ ప్రాంగణంలో జరిగే రైతుభరోసా ప్రారంభోత్సవ సభకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. వివిధ శాఖలకు చెందిన స్టాళ్లను ఏర్పాటు చేశారు. మంగళవారం ఉదయం 10.30 గంటలకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ రేణిగుంట విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడి నుంచి హెలికాప్టర్ ద్వారా 11 గంటలకు సభా ప్రాంగణానికి చేరుకుంటారు. స్టాళ్లను పరిశీలించిన తర్వాత రైతుభరోసా చెక్కులు పంపిణీ చేసి అన్నదాతలతో మాట్లాడతారు. సభ ముగిశాక రేణిగుంట చేరుకుని విమానంలో గన్నవరం వెళ్తారు. -
అభివృద్ధికి చదువే చక్కటి ఆయుధం
- గౌరవ డాక్టరేట్‌ను పొందిన వి.భుజంగరావు - ఘనంగా వీఎస్‌యూ తొలి స్నాతకోత్సవం - 370 మందికి పట్టాలు - 19 మందికి గోల్డ్‌మెడల్స్ ప్రదానం నెల్లూరు(టౌన్) : అభివృద్ధికి చదువే చక్కటి ఆయుధమని ప్రముఖ శాస్త్రవేత్త, డీఆర్డీఓ (న్యూఢిల్లీ) డెరైక్టర్ జనరల్ వేపకొమ్మ భుజంగరావు అన్నారు. విక్రమసింహపురి విశ్వవిద్యాలయం ఏర్పడిన తర్వాత ఏడేళ్లకు తొలిసారిగా సోమవారం ఉత్సాహభరితమైన వాతావరణంలో నగరంలోని కస్తూర్బా కళాక్షేత్రంలో ప్రథమ స్నాతకోత్సవం జరిగింది. వేపకొమ్మ భుజంగరావుకు యూనివర్సిటీ అధికారులు గౌరవ డాక్టరేట్‌ను అందజేశారు. భుజంగరావు మాట్లాడుతూ ప్రతిభావంతులైన యువకు రక్షణ రంగంలో అపారమైన ఉద్యోగ అవకాశాలున్నాయన్నారు. డిఫెన్స్ అంటే యుద్ధం కాదన్నారు. శాస్త్ర, సాంకేతిక రంగాల్లో రాణించడం ద్వారా అభివృద్ధి సాధించడంతో పాటు శాంతిని స్థాపించవచ్చన్నారు. నేటి తరం యువత సవాళ్లను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు. శాస్త్ర, సాంకేతిక రంగాలను కొంత మంది ధనికుల చేతుల్లో నుంచి సామాన్యులకు అందించేందుకు కృషి చేయాలన్నారు. అందుకు చదువు చక్కటి ఆయుధమన్నారు. నెల్లూరు జిల్లాకు పలు పరిశ్రమలు వస్తున్నాయన్నారు. వీఎస్‌యూలో రీసెర్చ్‌కు కావలసిన వనరులన్నీ సమృద్ధిగా ఉన్నాయన్నారు. తాను గూడూరులో జన్మించినట్టు భుజంగరావు తెలిపారు. సొంత గడ్డపై డాక్టరేట్ అందుకోవడం జీవితంలో మరపురాని రోజుగా ఆయన అభివర్ణించారు. అభివృద్ధి పథంలో యూనివర్సిటీ వీసీ రాజారామిరెడ్డి విక్రమసింహపురి యూనివర్సిటీ అభివృద్ధి పథంలో పయనిస్తోందని వీసీ రాజారామిరెడ్డి తెలిపారు. సొంత భవనాలు కూడా లేని పరి స్థితి నుంచి ఇప్పుడు 83 ఎకరాల స్థల సేకరణ చేశామన్నారు. అందులో చక్కటి భవనాలు ని ర్మిస్తున్నామన్నారు. ఈ సంవత్సరం నుంచి హా స్టల్స్ను నూతన క్యాంపస్‌లోకి మారుస్తామన్నా రు. అంతేకాక కొత్త కోర్సులను ప్రవేశ పెడుతున్నామన్నారు. ఇంజనీరింగ్ కళాశాలతో పాటు ఇంటిగ్రేటెడ్కోర్సులను ప్రారంభిస్తున్నామన్నా రు. 370 మంది పీజీ పూర్తి చేసుకున్న విద్యార్థులకు పట్టాలందించారు. మరో 19 మందికి గోల్డ్‌మెడల్స్‌ను ప్రకటించారు. అయితే ఇద్దరు స కాలంలో రాలేక పోవడంతో మిగిలిన 17 మం దికి గోల్డ్‌మెడల్స్‌ను అందచేశారు. బ్యాండు మే ళాల మధ్య వినూత్న రీతిలో పట్టాలు అందుకోవడం విద్యార్థులకు ఆనందాన్ని కలిగించింది. డిపార్ట్మెంట్ విభాగాధిపతులు డాక్ట ర్ శివశంకర్, సునందమ్మ ఆధ్వర్యంలో ముఖ్య అతిథి భుజంగరావు , వీసీ రాజారామిరెడ్డి, రి జిస్ట్రార్ నాగేంద్రప్రసాద్ చేతుల మీదుగా విద్యార్థులు పట్టాలు అందుకున్నారు.ఈ కార్యక్రమంలో డీన్ డాక్టర్ వెంకటరావు, పరీక్షల నియంత్రణాధికారి ఎస్.మురళీమోహన్రావు, ప్రిన్సిపల్ మురుగయ్య, పూర్వపు ప్రిన్సిపల్ శ్రీనివాసులురెడ్డి, అసిస్టెంట్ ప్రొఫెసర్ నరసింహారావు, పలువురు నగర ప్రముఖులు పాల్గొన్నారు.