అభివృద్ధికి చదువే చక్కటి ఆయుధం | development of a good weapon to read | Sakshi
Sakshi News home page

అభివృద్ధికి చదువే చక్కటి ఆయుధం

Published Tue, Jun 10 2014 2:58 AM | Last Updated on Sat, Sep 2 2017 8:33 AM

అభివృద్ధికి చదువే చక్కటి ఆయుధం

అభివృద్ధికి చదువే చక్కటి ఆయుధం

- గౌరవ డాక్టరేట్‌ను పొందిన వి.భుజంగరావు
- ఘనంగా వీఎస్‌యూ తొలి స్నాతకోత్సవం
- 370 మందికి పట్టాలు
- 19 మందికి గోల్డ్‌మెడల్స్ ప్రదానం
 నెల్లూరు(టౌన్) : అభివృద్ధికి చదువే చక్కటి ఆయుధమని ప్రముఖ శాస్త్రవేత్త, డీఆర్‌డీఓ (న్యూఢిల్లీ) డెరైక్టర్ జనరల్ వేపకొమ్మ భుజంగరావు అన్నారు. విక్రమసింహపురి విశ్వవిద్యాలయం ఏర్పడిన తర్వాత ఏడేళ్లకు తొలిసారిగా సోమవారం ఉత్సాహభరితమైన వాతావరణంలో నగరంలోని కస్తూర్బా కళాక్షేత్రంలో ప్రథమ స్నాతకోత్సవం జరిగింది.  వేపకొమ్మ భుజంగరావుకు యూనివర్సిటీ అధికారులు గౌరవ డాక్టరేట్‌ను అందజేశారు. భుజంగరావు మాట్లాడుతూ   ప్రతిభావంతులైన యువకు రక్షణ రంగంలో అపారమైన ఉద్యోగ అవకాశాలున్నాయన్నారు. డిఫెన్స్ అంటే యుద్ధం కాదన్నారు. శాస్త్ర, సాంకేతిక రంగాల్లో రాణించడం ద్వారా అభివృద్ధి సాధించడంతో పాటు శాంతిని స్థాపించవచ్చన్నారు. నేటి తరం యువత సవాళ్లను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు.

శాస్త్ర, సాంకేతిక రంగాలను కొంత మంది ధనికుల చేతుల్లో నుంచి సామాన్యులకు అందించేందుకు కృషి చేయాలన్నారు. అందుకు చదువు చక్కటి ఆయుధమన్నారు. నెల్లూరు జిల్లాకు పలు పరిశ్రమలు వస్తున్నాయన్నారు. వీఎస్‌యూలో రీసెర్చ్‌కు కావలసిన వనరులన్నీ సమృద్ధిగా ఉన్నాయన్నారు. తాను గూడూరులో జన్మించినట్టు భుజంగరావు తెలిపారు. సొంత గడ్డపై డాక్టరేట్ అందుకోవడం జీవితంలో మరపురాని రోజుగా ఆయన అభివర్ణించారు.  
 
అభివృద్ధి పథంలో యూనివర్సిటీ వీసీ రాజారామిరెడ్డి
 విక్రమసింహపురి యూనివర్సిటీ అభివృద్ధి పథంలో పయనిస్తోందని వీసీ రాజారామిరెడ్డి తెలిపారు. సొంత భవనాలు కూడా లేని పరి స్థితి నుంచి ఇప్పుడు 83 ఎకరాల స్థల సేకరణ చేశామన్నారు. అందులో చక్కటి భవనాలు ని ర్మిస్తున్నామన్నారు. ఈ సంవత్సరం నుంచి హా స్టల్స్‌ను నూతన క్యాంపస్‌లోకి మారుస్తామన్నా రు. అంతేకాక కొత్త కోర్సులను ప్రవేశ పెడుతున్నామన్నారు. ఇంజనీరింగ్ కళాశాలతో పాటు ఇంటిగ్రేటెడ్‌కోర్సులను ప్రారంభిస్తున్నామన్నా రు. 370 మంది పీజీ పూర్తి చేసుకున్న విద్యార్థులకు పట్టాలందించారు.

మరో 19 మందికి గోల్డ్‌మెడల్స్‌ను ప్రకటించారు. అయితే ఇద్దరు స కాలంలో రాలేక పోవడంతో మిగిలిన 17 మం దికి గోల్డ్‌మెడల్స్‌ను అందచేశారు. బ్యాండు మే ళాల మధ్య వినూత్న రీతిలో పట్టాలు అందుకోవడం విద్యార్థులకు ఆనందాన్ని కలిగించింది. డిపార్ట్‌మెంట్ విభాగాధిపతులు డాక్ట ర్ శివశంకర్, సునందమ్మ ఆధ్వర్యంలో ముఖ్య అతిథి భుజంగరావు , వీసీ రాజారామిరెడ్డి,  రి జిస్ట్రార్ నాగేంద్రప్రసాద్ చేతుల మీదుగా విద్యార్థులు పట్టాలు అందుకున్నారు.ఈ కార్యక్రమంలో డీన్ డాక్టర్ వెంకటరావు, పరీక్షల నియంత్రణాధికారి ఎస్.మురళీమోహన్‌రావు, ప్రిన్సిపల్ మురుగయ్య, పూర్వపు ప్రిన్సిపల్ శ్రీనివాసులురెడ్డి, అసిస్టెంట్ ప్రొఫెసర్ నరసింహారావు, పలువురు నగర ప్రముఖులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement