పల్లె సమగ్ర సేవా కేంద్రాలుగా ఈ-పంచాయతీలు: కేటీఆర్
హైదరాబాద్: పల్లె సమగ్ర కేంద్రాలుగా ఈ - పంచాయతీలను ఏర్పాటు చేస్తామని తెలంగాణ రాష్ట్ర ఐటీ, పంచాయతీ రాజ్ శాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు అన్నారు. తెలంగాణ పంచాయతీరాజ్ శాఖ వార్షిక నివేదికను బుధవారం ఆయన ఇక్కడ వెల్లడించారు. అనంతరం మంత్రి కేటీఆర్ మీడియాతో మాట్లాడారు.
ప్రజల పన్నులతో ప్రభుత్వ పథకాలను బాధ్యతాయుతంగా అమలు చేస్తామని ఈ సందర్భంగా కేటీఆర్ తెలిపారు. రాష్ట్రంలో 30 లక్షల మరుగు దొడ్లను నిర్మించి 2019 కల్లా బహిరంగ మల, మూత్ర విసర్జనలు లేకుండా రాష్ట్రాన్ని తీర్చి దిద్దుతామన్నారు. ప్రతిపక్షాలు ఉనికి కోల్పోతామనే భయంతోనే వాటర్ గ్రిడ్ పై విమర్శలు చేస్తున్నాయని కేటీఆర్ మండిపడ్డారు.