Village voters
-
ఏడు నిమిషాల్లో రేషన్ కార్డు!
బల్లికురవ: ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసిన గ్రామ సచివాలయ, వలంటీర్ వ్యవస్థ గ్రామాల్లోని లబ్ధిదారులకు భరోసానిస్తోంది. రేషన్‌కార్డు కోసం మండలంలోని ముక్తేశ్వరం పంచాయతీలోని సూరేపల్లి గ్రామంలోని ఓ దివ్యాంగ కుటుంబం గత ప్రభుత్వ హయాంలోని ఐదేళ్లలో అనేకసార్లు తహసీల్దార్ కార్యాలయంలో దరఖాస్తు చేసినా జన్మభూమి కమిటీలో కార్డు మంజూరుకు మోకాలడ్డారు. దీంతో విసిగి వేసారిన ఆ కుటుంబం సోమవారం గ్రామ వలంటీర్‌కు రేషన్‌కార్డు లేదని చెప్పిన 7 నిమిషాల్లోనే తక్షణమే మంజూరు చేయడంతో పాటు కార్డు అందజేశారు. వివరాల్లోకి వెళితే.. సూరేపల్లి గ్రామానికి చెందిన తోరటి వినోద్ కుమార్‌కు పుట్టుకతోనే పోలియో సోకింది. ఏ పనీ చేయలేడు. 2014లో గుంటూరు జిల్లా గురజాలకు చెందిన మరో దివ్యాంగురాలు రాహేలును వివాహం చేసుకున్నాడు. 2014 లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో వైఎస్సార్ సీపీకి ఓట్లు వేశారన్న అక్కసుతో జన్మభూమి కమిటీ తమకు కార్డు రాకుండా అడ్డుకున్నారని వినోద్ కుమార్, రాహేలు వాపోయారు. గ్రామ వలంటీర్ మార్కు తమ ఇంటికి రాగా కార్డు లేదని చెప్పగా వెంటే సచివాలయానికి తీసుకువెళ్లి 10.50 గంటలకు దరఖాస్తు చేయించగా 7 నిమిషాల్లోనే వీఆర్వో వీరనారాయణ, తహసీల్దార్ అశోక్ వర్ధన్ మంజూరు చేయటంతో వెంటనే ప్రింట్ తీసి లబ్ధిదారు రాహేలుకు అందజేశారు. సీఎం, అధికారులకు రుణపడి ఉంటా : తోరటి రాహేలు 5 సంవత్సరాల క్రితం రేషన్‌కార్డు కోసం దరఖాస్తు చేసి.. చివరకు మాకు రాదని విసిగిపోయాం. వలంటీర్ మార్కు మా ఇంటికి వచ్చి మీకు కార్డు వెంటనే ఇప్పిస్తామని చెప్పి 7 నిమిషాల్లోనే అందజేయటం ఆనందంగా ఉంది. ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డికి, అధికారులకు, వలంటీర్‌కు జీవితాంతం రుణపడి ఉంటాం. రేషన్‌కార్డు లేక ఇప్పటి వరకు ప్రభుత్వ పథకాలు అందలేదు. -
రాత పరీక్ష పాసైతే చాలు!
సాక్షి, అమరావతి: రాష్ట్రవ్యాప్తంగా 2.70 లక్షల గ్రామ, వార్డు వలంటీర్ల ఉద్యోగాలు, 1.26 లక్షలకుపైగా అనుబంధ కొలువులు, 7,966 లైన్మెన్ ఉద్యోగాలు వెరసి రికార్డు స్థాయిలో 4 లక్షలకుపైగా ఉద్యోగాల భర్తీ ప్రక్రియకు రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన చర్యలకు యువత నుంచి అనూహ్య స్పందన లభిస్తోంది. గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగాలకు గత జూలై 26వ తేదీన నోటిఫికేషన్ జారీ చేసిన విషయం తెలిసిందే. ఈ ఉద్యోగాలకు దరఖాస్తు ప్రక్రియ ఆదివారం అర్ధరాత్రితో ముగియగా గడువు ముగిసే సమయానికి 22,73,793 మంది దరఖాస్తు చేసుకున్నారు. అయితే లక్ష మందికి పైగా దరఖాస్తు ఫీజు చెల్లించని కారణంగా 21,69,719 మందే రాతపరీక్షకు అర్హత పొందారు. దరఖాస్తు చేసుకుంటే ఉద్యోగం! ఒకవైపు ‘సచివాలయ’ ఉద్యోగాలకు రికార్డు స్థాయిలో దరఖాస్తులు అందగా పశుసంవర్ధక శాఖ అసిస్టెంట్ పోస్టు అభ్యర్థులు మాత్రం రాత పరీక్షలో కనీస మార్కులు సాధిస్తే చాలు కొలువు సొంతం చేసుకునే పరిస్థితి నెలకొంది. ఈ పోస్టుకు చాలా తక్కువ మంది దరఖాస్తు చేసుకోవటమే దీనికి కారణం. గ్రామ సచివాలయాల్లో 9,886 పశుసంవర్ధక శాఖ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేయగా కేవలం 6,265 మంది మాత్రమే దరఖాస్తు చేసుకున్నట్లు అధికారుల పరిశీలనలో తేలింది. మిగిలిన 18 రకాల ఉద్యోగాలకు తీవ్ర పోటీ నెలకొంది. ఒక్కో ఉద్యోగానికి గరిష్టంగా సరాసరిన 35 మంది పోటీ పడుతున్నారు. సాధారణ డిగ్రీ ఉద్యోగాలకు భారీ పోటీ గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగాల్లో కేటగిరీ –1లో పేర్కొన్న పంచాయితీ కార్యదర్శి గ్రేడ్–5, మహిళా పోలీసు, వెల్ఫేర్ అండ్ ఎడ్యుకేషన్ సెక్రటరీ, వార్డు ఆడ్మినిస్ట్రేటివ్ సెక్రటరీ లాంటి నాలుగు రకాల ఉద్యోగాలకు సాధారణ డిగ్రీని కనీస విద్యార్హతగా పేర్కొన్నారు. ఈ కేటగిరీలో మొత్తం 36,449 ఉద్యోగాలను ప్రభుత్వం భర్తీ చేస్తుండగా రాష్ట్రవ్యాప్తంగా 12,54,034 మంది రాత పరీక్షకు అర్హత సాధించారు. -
ఓటమి భయంతోనే టీడీపీ కుట్ర
సాక్షి, ఇందుగపల్లి(వత్సవాయి) : గతంలో ఎన్నడూ లేని విధంగా ఓట్ల ప్రక్రియ గందరగోళంగా మారింది. వాస్తవంగా ఒక వ్యక్తికి రెండు ప్రాంతాల్లో ఓట్లు కలిగి ఉంటే ఒక ప్రాంతంలో తొలగించాలని ఫారం–7 కింద దరఖాస్తులు చేసుకోవాలి కానీ మండలంలోని పలు గ్రామాల్లో దీనికి విరుద్దంగా జరుగుతుంది. గ్రామాల్లో నివాసం ఉండే వారికి కూడా ఓటు తొలగించాలని అధికారులకు దరఖాస్తులు అందిస్తున్నారు. వైఎస్సార్ సీపీ సానుభూతిపరులైన వారి ఓట్లు తొలగించాలని దరఖాస్తులు అందాయి. గడచిన సార్వత్రిక ఎన్నికల్లో చంద్రబాబునాయుడు కల్లిబొల్లి మాటలను నమ్మి ఓట్లు వేసిన ప్రజలు ఆ తరువాత హామీలను అమలుచేయకపోవడంతోతీవ్ర అసంతృప్తితో ఉన్నారు. వైఎస్సార్ సీపీ ఓట్లపైనే కుట్ర.... వైఎస్సార్ సీపీ పట్ల ప్రజలు నమ్మకంతో ఆ పార్టీకి అనుకూలంగా ఉండడంతో మరలా ఎలాగైనా అ«ధికారాన్ని దక్కించుకోవాలనే దుర్భద్దితో ఓట్ల తొలగింపుకు శ్రీకారం చుట్టారు. పైగా వైఎస్సార్ సీపీకి చెందిన నాయకులు, కార్యకర్తలు, బూత్ కన్వీనర్ల పేరుతో ఆన్లైన్లో దరఖాస్తులు చేస్తున్నారు. గ్రామాల్లో బీఎల్వోలు తొలగింపులు జాబితాలు తీసుకుని సదరు ఓటు తొలగింపుకు ఎంపికైన వ్యక్తికి ఇంటికి వెళ్లి రశీదులు అందిస్తున్నారు. దీంతో కొందరు ఓటర్లు కంగుతింటున్నారు. మేము గ్రామంలోనే నివాసం ఉంటున్నామని మా ఓటు ఎందుకు తొలగిస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అసలు మా ఓటు తొలగించాలని ఎవరు దరఖాస్తులు పెట్టారు అని అడిగినా సమాధానం చెప్పలేని పరిస్థితిలో బీఎల్వోలు ఉన్నారు. రెవెన్యూ కార్యాలయంలో అడిగినా మాకు తెలియదు మీబీఎల్వోలను అడగండి అని సమాధానం తప్ప మరొకటి లేదు. ఇందుగపల్లి పంచాయతీ పరిధిలో... ఇందుగపల్లి గ్రామంలో 20 ఓట్లు తొలగించాలని వైఎస్సార్ సీపీకి చెందిన గ్రామ నాయకులు వాసిరెడ్డి నాగేశ్వరరావు, కిలారు హనుమయ్య పేరుతో ఫారం – 7 కింద దరఖాస్తులను ఆన్లైన్లో దరఖాస్తులు చేశారు. వాటిలో ఎక్కువగా వైఎస్సార్ సీపీకి చెందిన ఓట్లే ఉన్నాయి. ఆన్లైన్లో వచ్చిన దరఖాస్తులను తీసుకుని హనుమయ్య ఇంటికి బీఎల్వోలు వెళ్లగా ఆయన నిర్ఘాంతపోయారు. మా కార్యకర్తల ఓట్లు తొలగించమని నేను దరఖాస్తులు అందించడం ఏమిటి అని అడగ్గా మాకు తెలియదు ఆన్లైన్లో మీ పేరుమీద దరఖాస్తులు అందాయి అని చెప్పడంతో ఇదంతా టీడీపీ నాయకుల కుట్ర అని మా కార్యకర్తలు అందరూ గ్రామంలోనే ఉన్నారు అని చెప్పారు. వైఎస్సార్ సీపీపై నిందవేసేందుకే వైఎస్సార్ సీపీపై నిందవేసేందుకే ఆన్లైన్లో కొందరు పనిగట్టుకుని ఫారం – 7 లను అందిస్తున్నారు. ఎన్నికలు దగ్గరపడడంతో టీడీపీ నాయకుల కుట్రలకు అంతులేకుండా పోతుంది. సరైన సమయంలో వారికి ప్రజలు తగిన గుణపాఠం చెబుతారు. నేను వైఎస్సార్ సీపీలో ఉత్సాహంగా పనిచేస్తున్నందుకు నాపేరు పెట్టారు. -చావా కృష్ణారావు గ్రామస్తుడు ప్రజలు నమ్మిన వారికే ఓటేస్తారు రాజకీయాల్లో గెలుపోటములు సహజం. ఇద్దరు పోటీపడితే ఒక్కరే గెలుస్తారు ప్రజలు ఎవరిని నిమ్మితే వారికే ఓట్లు వేసి గెలిపిçస్తారు. అలా కాకుండా గ్రామాల్లో నివాసం ఉండే వారి ఓట్లు తొలగించి గెలవాలనుకోవడం విడ్డూరం. ఈ విధంగా చేయడం వల్ల గ్రామాల్లో వివాదాలు తలెత్తుతాయి. నేను గ్రామంలోనే ఉంటున్నా నాపేరును తొలగించేందుకు దరఖాస్తు అందించారు. -గంధసిరి త్రివేణి విద్యార్థిని -
సార్వత్రికంపై వైఎస్సార్ కాంగ్రెస్ ధీమా
-
సార్వత్రికంపై వైఎస్సార్ కాంగ్రెస్ ధీమా
మున్సిపల్, ప్రాదేశిక ఫలితాలను విశ్లేషించిన పార్టీ నేతలు గ్రామీణ ప్రాంతాలపై పార్టీ పట్టు సాధించిందని వెల్లడి ఈ ఫలితాలను చూస్తే అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికల్లో పార్టీ విజయం ఖాయమని ధీమా సాక్షి, హైదరాబాద్: గ్రామీణ ఓటర్లలో కనిపించిన మార్పు ఈ సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ విజయం సాధిస్తుందనడానికి చిహ్నమని ఆ పార్టీ నేతలు విశ్లేషించారు. మున్సిపల్ ఎన్నికల ఫలితాలతో పోల్చితే గ్రామీణ ఓటర్ల ప్రభావం ఉండే జెడ్పీటీసీ, ఎంపీటీసీల్లో మంచి ఫలితాలను సాధించడంతో మెజారిటీ అసెంబ్లీ, లోక్‌సభ స్థానాల్లో విజయం సాధిస్తామన్న నమ్మకాన్ని మరింత పెంచిందని ఆ పార్టీ నేతలంటున్నారు. సీమాంధ్రలోని 92 మున్సిపాలిటీల ఎన్నికల ఫలితాలు సోమవారం వెలువడ్డాయి. మంగళవారం ప్రాదేశిక ఎన్నికల ఓట్ల లెక్కింపు మొదలైంది. ఈ నేపథ్యంలో మంగళవారం పార్టీ నేతలు సమావేశమై మున్సిపల్, పంచాయతీరాజ్ ప్రాదేశిక ఎన్నికల ఫలితాలను విశ్లేషించారు. ఈ ఫలితాల సరళిని విశ్లేషించిన తర్వాత సాధారణ ఎన్నికల్లో పార్టీ మంచి మెజారిటీతో విజయం సాధిస్తుందన్న అంచనాకు వచ్చారు. మున్సిపాలిటీల్లో ఆశించిన మేరకు ఫలితాలు రానప్పటికీ, ప్రాదేశిక ఫలితాలు అనుకూలంగా రావడాన్నిబట్టి చూస్తే గ్రామీణ ప్రాంతాల్లో పార్టీ పట్టు సాధించినట్టు ప్రాదేశిక ఫలితాలు స్పష్టం చేస్తున్నాయని విశ్లేషించారు. కీలకమైన గ్రామీణ ఓటర్లు ఉండే జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల ఫలితాల సరళి వైఎస్సార్సీపీ కచ్చితంగా అధికారంలోకి వస్తుందని తేల్చుతున్నాయని ఆ పార్టీ నేతలంటున్నారు. సీమాంధ్రలో మొత్తం 3.68 కోట్ల మంది ఓటర్లు ఉన్నారు. కొద్ది రోజుల క్రితం ఎన్నికలు జరిగిన మున్సిపాలిటీలు (కార్పొరేషన్లు మినహా) 87 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో ఉన్నాయి. ఈ నియోజకవర్గాల్లో 1.84 కోట్ల మంది ఓటర్లు ఉన్నారు. వీరిలో అన్ని మున్సిపాలిటీల్లో ఉన్నది 45 లక్షల మంది ఓటర్లే. మిగతా 1.40 కోట్ల మంది మున్సిపాలిటీలు లేని గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నారు. మున్సిపాలిటీలతో సంబంధం లేని మిగతా 76 అసెంబ్లీ సెగ్మెంట్లలో మరో 1.54 కోట్ల మంది ఓటర్లు ఉన్నారు. మిగతా ఓటర్లు మిగిలిన 12 నియోజకవర్గాల్లో ఉన్నారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో 2.94 కోట్ల మంది (80 శాతం) ఓటు వేశారు. మున్సిపాలిటీలు, ప్రాదేశిక ఫలితాలను విశ్లేషిస్తే అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికల్లో వైస్సార్ కాంగ్రెస్‌కు అనుకూల ఫలితాలు వస్తున్నాయని తేటతెల్లమవుతోందని నేతలు అభిప్రాయపడ్డారు. పైగా, సీమాంధ్రలో ఈ నెల 7న జరిగిన అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికలకు గతనెల 12న నోటిఫికేషన్ జారీ అయింది. ఈ నోటిఫికేషన్ విడుదలకు ముందే మున్సిపల్, పంచాయతీరాజ్ సంస్థల ఎన్నికల పోలింగ్ పూర్తయింది. సార్వత్రిక ఎన్నికల నోటిఫికేషన్ జారీ అయిన తర్వాత రెండు రోజులకే పార్టీ అభ్యర్థుల జాబితాను ప్రకటించి ఆ వెంటనే పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్రెడ్డి జనభేరి పేరుతో విస్తృత ప్రచారం నిర్వహించారు. పంచాయతీరాజ్ సంస్థల ఎన్నికలకు సాధారణ ఎన్నికల పోలింగ్నకు దాదాపు నెల గడువు ఉంది. ఈ 30 రోజుల్లో సీమాంధ్రలోని అనేక జిల్లాల ప్రజల్లో ఎంతో మార్పు కనిపించిందని, ప్రతి జిల్లాలోనూ పార్టీకి ప్రజలు బ్రహ్మరథం పట్టారని నేతలు పేర్కొన్నారు. ఈ సమయంలో 5 నుంచి 6 శాతం ఓటర్లలో స్పష్టమైన మార్పు కనిపించిందని, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సాధారణ ఎన్నికల్లో ఊహించని విజయం సాధిస్తుందని ఆ పార్టీ నేతలు ధీమా వ్యక్తం చేశారు. మరోపక్క, ఎంపీటీసీ ఎన్నికల్లో పూర్తిగా స్థానిక అంశాలు, అభ్యర్థి ప్రభావమే ఉంటుంది తప్ప రాష్ట్ర, జాతీయ అంశాల ప్రభావం ఉండదన్నారు. స్థానిక సంస్థల ఎన్నికలకు, సాధారణ ఎన్నికలకు ముడిపెట్టలేమని, ప్రజల్లో ఈ విషయంలో చాలా స్పష్టత ఉందని వ్యాఖ్యానించారు. మున్సిపల్ ఎన్నికలు, మండల, జిల్లా పరిషత్ ఎన్నికల ఫలితాలకు తేడా కొన్ని జిల్లాల్లో కొట్టొచ్చినట్లు కనిపించిందని నేతలు విశ్లేషించారు. ప్రకాశం జిల్లాలోని ఆరు మున్సిపాలిటీల్లో నాలుగింటిలో టీడీపీ, రెండింటిలో వైఎస్సార్ కాంగ్రెస్ గెలుపొందిన విషయాన్ని ప్రస్తావించారు. మంగళవారం నాటి ఫలితాల్లో వైఎస్సార్ సీపీ ప్రకాశం జిల్లా పరిషత్ చైర్మన్ పీఠం చేజిక్కించుకోవడానికి అవసరమైన జెడ్పీటీసీ స్థానాలను గెల్చుకుంది. వైఎస్సార్ జిల్లాలో కూడా ఇదే పరిస్థితి ఉంది. ఆ జిల్లాలోని ఏడు మున్సిపాలిటీలకు గాను వైఎస్సార్ కాంగ్రెస్ మూడింటిలోనే గెలుపొందింది. నాలుగు చోట్ల టీడీపీ ఎక్కువ వార్డులను గెల్చుకుంది. అయితే, ప్రాదేశిక ఎన్నికల్లో వైఎస్సార్సీపీ జిల్లా పరిషత్ అధ్యక్ష పీఠాన్ని చేజిక్కించుకుంది. మున్సిపల్, ప్రాదేశిక ఎన్నికల మధ్య ఎంత తేడా ఉంటుందో ఈ ఫలితాలు తెలియజేస్తున్నాయని నేతలు విశ్లేషించారు.