ఫ్లోరైడ్ బాధిత గ్రామాలను ఆదుకోండి
– ప్రస్తుత బడ్జెట్లోనే నిధులు కేటాయించండి
– ఆర్థికమంత్రి అరుణ్ జెట్లీని కోరిన ఎంపీ బుట్టా రేణుక
కర్నూలు (ఓల్డ్‌సిటీ): కర్నూలు పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని ఫోరైడ్ బాధిత గ్రామాలకు తాగునీటి వసతి కల్పించాలని ఎంపీ బుట్టా రేణుక బుధవారం మధ్యాహ్నం ఢిల్లీలో కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌జెట్లీని కోరారు. కోడుమూరుకు రూ. 56.70 కోట్లు, మంత్రాలయానికి రూ. 30 కోట్లు, ఆస్పరి, దేవనకొండ, ఆలూరులకు రూ. 90 కోట్లు, ఎమ్మిగనూరు (గోనెగండ్ల)కు రూ. 140 కోట్లు, పత్తికొండ, మద్దికెర, తుగ్గలిలకు రూ. 105 కోట్లు, ఆదోని, కౌతాళంలకు రూ. 105 కోట్ల మేరకు నిధులు అవసరమవుతాయని ప్రతిపాదించారు. ఆయా గ్రామాలకు ప్రస్తుత బడ్జెట్లో ప్రకటించిన విధంగా వివిధ ప్రపంచ బ్యాంకు పథకాల ద్వారా ఎక్కువ మొత్తంలో నిధులు అందజేయాలని కోరారు. కేంద్ర గ్రామీణాభివృద్ధి మంత్రి నరేంద్రసింగ్ తోమర్‌కు కూడా ఈ మేరకు వినతిపత్రం సమర్పించారు.