breaking news
vinayak nimarjan
-
లాల్బాగ్చా నిమజ్జనంలో ఏం జరిగింది..? మండిపడుతున్న భక్తులు..
దేశవ్యాప్తంగా గణేశ్ నవరాత్రి ఉత్సవాలు ఘనంగా ముగిశాయి. ముంబైలో అత్యంత ప్రాచుర్యం పొందిన లాల్బాగ్చా (Lalbaugcha Raja) గణపతి నిమజ్జనం ఆదివారం రాత్రి 9.35గంటల సమయంలో పూర్తయ్యింది. సుమారు నిర్దేశించిన సమయం కంటే దాదాపు 13 గంటలు ఆలస్యంగా నిమజ్జనం పూర్తయ్యింది. ఆచార సంప్రదాయాలకు విరుద్ధంగా జరగడంతో భక్తులు తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తం చేశారు. నిమజ్జనం ఊరేగింపు తంతు మొత్తం..ఆది నుంచి అన్నీ ఆటంకాలతోనే ప్రారంభమైందని నిర్వాహకులు చెబుతున్నారు.అసలేం జరిగిందంటే..నిమజ్జనంలో భాగంగా శనివారం మధ్యాహ్నం 12.30కు లాల్బాగ్చా గణపతి ఊరేగింపు మొదలయ్యింది. ఆదివారం ఉదయం 8 గంటలకు నిమజ్జనం చేసే గిర్గావ్ చౌపటీ బీచ్‌కు చేరుకుంది. అనంతరం మత్స్యకారుల పడవలతో ప్రత్యేకంగా నిర్మించిన తెప్ప (Raft) సాయంతో సముద్రంలో నిర్దేశించిన ప్రాంతానికి తీసుకెళ్లేందుకు సిద్ధమయ్యారు. అయితే ఆ తెప్పలో సాంకేతిక సమస్యలు తలెత్తి..నిర్ణయించుకున్నమయం కంటే 10-15 నిమిషాలు ఆలస్యంగా బీచ్‌కు రావడం, అంచనాల కంటే ముందస్తుగానే ఆటుపోట్లు ప్రారంభం కావడం సమస్యగా మారింది.దాంతో నిర్వాహకులు ఆటుపోట్లు తగ్గేవరకు వేచి చూడాల్సి వచ్చింది. అనేక ప్రయత్నాల అనంతరం సాయంత్రం 4.45గంటలకు రాఫ్ట్‌పైకి తరలించారు. వేలాది మంది భక్తులు గణపతి బప్పా మోరియా నినాదాలతో ఆ ప్రాంతమంతా మార్మోగిపోయింది. అయినప్పటికీ సముద్రంలో ప్రతికూల వాతావరణంతో ఆటుపోట్లు తగ్గేవరకు వేచిచూడాలని నిర్వాహకులు నిర్ణయించారు. చివరకు సాయంత్రం 7-8గంటల సమయంలో రాఫ్ట్ తేలడంతో సముద్రంలోపలికి తరలించారు. ప్రత్యేక పూజల అనంతరం రాత్రి 9.35గంటల ప్రాంతంలో జరిగింది. అందులోనూ ఆరోజు చంద్రగ్రహణం పైగా ఆ సమయం సూతక్ కాలం కావడంతో ఇది సంప్రదాయన్ని ఉల్లఘించడమే అంటూ భక్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. నిజానికి 18 అడుగుల పొడవైన విగ్రహం ఊరేగింపు అనంత చుతర్ధశినాడు ప్రారంభమవుతుంది. అంటే నిమజ్జనం చివరి రోజు కానీ మరుసటి రోజు ఉదయం 9 గంటలకు జరుగుతుంది. ఈ ఏడాది కూడా అలాగే జరిగేలా ప్లాన్ ఉండగా...విగ్రహాన్ని తరలించే పడవలో సాంకేతిక లోపం, మరోవైపు సముద్ర అలలు తదితరాల కారణంగా లాల్బాగ్చా రాజా(వినాయకుడి విగ్రహం) గిర్గావ్ చౌపట్టి వద్ద కొన్ని గంటల పాటు నిలిచిపోయింది.మండిపడుతున్న మత్స్యకారులువినాయకుడు అందరి దేవుడని, అయితే ఆలయ నిర్వాహకులు మమల్ని దర్శించుకునే అవకాశం లేకుండా పక్కనపెట్టారంటూ మండిపడుతున్నారు మత్స్యకారులు. 1934లో, మత్స్యకారులు వద్ద డబ్బులు లేనప్పడు, చేపలు అమ్మడానికి మార్కెట్లో సమస్యలు వచ్చినప్పుడు గణపతి బప్పాకు మత్స్యకారులు గట్టిగా మొక్కుకున్నారట. తమ సమస్య తీరితే ప్రతి ఏడాది లాల్బాగ్చా రాజాని గణేశ్ చతుర్థి రోజున ఘనంగా పూజించి, నిమజ్జనం కార్యక్రమంలో తమ వంతు సహకారం అందిస్తామని గణపతికి మొక్కుకున్నారు. అయితే ఈ ఏడాది నిర్వాహకులు వీఐపీ దర్శనాలతో వారికి ఇచ్చిన ఒక్క రోజు దర్శనం అవకాశంలో కొన్ని గంట వ్యవధి తగ్గిపోయింది. దీంతో వారంత తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రాజకీయ నాయకులు, వీఐపీలకు ప్రాధాన్యాత ఇస్తూ..సామాన్య భక్తులకు దర్శించుకునే అవకాశాన్ని పక్కనపెట్టేశారంటూ లాల్బాగ్చా ఆలయ నిర్వాహకులపై విమర్శలు వెల్లువెత్తాయి. అంతేగాదు తమ గోడుని నేరుగా లాల్బాగ్చా రాజాను స్థాపించిన పూర్వీకుల వారసులకు తెలియజేసేలా మా తరుఫున ఒక ప్రతినిధిని సంస్థలోకి తీసుకోవాల్సిందిగా డిమాండ్ చేస్తున్నారు. విఘ్నాలను హరించే ఆ వినాయకుని దర్శనం చేసుకోలేకపోయామన్న భక్తుల అసంతృప్తి, మరోవైపు సాంకేతి లోపాలు, సముద్ర అలలు అన్ని కలగలసి ఈ ఏడాది లాల్బాగ్చా గణపతి నిమజ్జన కార్యక్రమాన్ని మరింత ఆలస్యంగా పూర్తి అయ్యేలా చేశాయి. ఊరేగింపు మొదలైనప్పటి నుంచి 32గంటల తర్వాత మహాగణపతి నిమజ్జనం పూర్తికావడం గమనార్హం(చదవండి: వర్షం సైతం ఆ నృత్యాన్ని అడ్డుకోలేకపోయింది..!) -
కోలాహలంగా నిమజ్జనోత్సవం
నెల్లూరు(వేదాయపాళెం), న్యూస్‌లైన్: వినాయక చవితి ఉత్సవాల్లో ఐదో రోజైన శుక్రవారం గణనాథుని విగ్రహ నిమజ్జనోత్సవాలు నగరంలో కోలాహలంగా జరిగాయి. ఆయా ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన విఘ్నేశ్వరుని మండపాల వద్ద ఉదయం నుంచి మహిళలు ప్రత్యేక పూజలను నిర్వహించారు. పలుచోట్ల మధ్యాహ్నం అన్నదానం చేశారు. సాయంత్రం సర్వవిఘ్నహరుడ్ని వివిధ వాహనాల్లో కొలువుదీర్చి నేత్రపర్వంగా నగరంలో ఊరేగింపు జరిపారు. పలుచోట్ల లడ్డూల వేలాన్ని ఘనంగా నిర్వహించారు. సందడే.. సందడి.. చంద్రమౌళీనగర్, వేదాయపాళెం, నిప్పోసెంటర్, భక్తవత్సలనగర్, పడారుపల్లి, వెంగళరావునగర్, పొదలకూరురోడ్డు, ఫతేఖాన్‌పేట, రామలింగాపురం, పెద్దబజారు, నవాబుపేట, స్టోన్‌హౌస్‌పేట, సుబేదారుపేట, కిసాన్‌నగర్, తదితర ప్రాంతాల నుంచి గణనాథుని ప్రతిమలు ఊరేగింపుగా నగరంలోకి ప్రవేశించాయి. ఆయా విగ్రహాలతో పాటు వచ్చేవారిని సంతపేట వద్ద గణేష్ నిమజ్జనోత్సవ కమిటీ ఆహ్వానించి, పెన్నానది వద్ద తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలియజేశారు. అనంతరం గణనాథుని ప్రతిమలను జాఫర్‌హుస్సేన్ కాలువలో భక్తిశ్రద్ధలతో నిమజ్జనం చేశారు. కార్పొరేషన్, పోలీస్ అధికారులు పెన్నాతీరాన ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. బాలాజీనగర్‌లోని 36 అడుగుల వీరగణపతి విగ్రహాన్ని ఆదివారం, అయ్యప్పగుడి సెంటర్లోని వినాయకుడి విగ్రహాన్ని మంగళవారం నిమజ్జనం చేయనున్నారు.