ఆశ్చర్యంలో ముంచెత్తిన పెనెట్టా
న్యూయార్క్: యూఎస్ ఓపెన్ మహిళల సింగిల్స్ టైటిల్ ను ఇటలీ క్రీడాకారిణి ఫ్లానియా పెనెట్టా గెల్చుకుంది. తమ దేశానికే చెందిన రొబెర్ట్ విన్సీతో జరిగిన తుదిపోరులో వరుస సెట్లలో విజయం సాధించి విజేతగా నిలిచింది. 7-6, (7-4), 6-2 తేడాతో విన్సీని ఓడించింది. 26 సీడెడ్ పెనెట్టా మొదటి సెట్ లో కాస్త శ్రమించినా రెండో సెట్ ను సునాయంగా గెల్చుకుంది.
గ్రాండ్ స్లామ్ లో ఇటలీ ప్లేయర్స్ సింగిల్స్ ఫైనల్స్ లో తలపడడం ఇదే మొదటిసారి కావడం విశేషం. సెరెనా విలియమ్స్ ను ఓడించి సంచలనం సృష్టించిన 43వ సీడెడ్ విన్సీ 24 గంటలు గడవకముందే తమ దేశానికే చెందిన పెనెట్టా చేతిలో పరాజయం పాలైంది.
33 ఏళ్ల పెనెట్టా టైటిల్ గెలిచిన వెంటనే క్రీడాజీవితాన్ని వీడ్కోలు పలుకుతున్నట్టు ప్రకటించి అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తింది. తాను రిటైర్ కావడానికి ఇదే సరైన సమయమని తెలిపింది. ఘన విజయంతో టెన్నిస్ గుడ్ బై చెప్పాలనుకున్నట్టు వెల్లడించింది.