Vineet
-
కోల్‌కతా సీపీగా మనోజ్ వర్మ
కోల్‌కతా: జూనియర్ డాక్లర్లు డిమాండ్ చేసినట్లుగానే కోల్‌కతా పోలీసు కమిషనర్ వినీత్ గోయల్‌పై వేటు పడింది. కొత్త కమిషనర్‌గా సీనియర్ ఐపీఎస్ అధికారి మనోజ్ కుమార్ వర్మను బెంగాల్ ప్రభుత్వం మంగళవారం నియమించింది. జూడాలకు ఇచి్చన హామీ మేరకు ఆరోగ్య సేవల డైరెక్టర్ దెవాశిష్ హల్దర్, వైద్య విద్య డైరెక్టర్ కౌస్తవ్ నాయక్‌లను మమత సర్కారు తొలగించింది. కోల్‌కతా నార్త్ డివిజన్ డిప్యూటీ పోలీసు కమిషనర్ అభిõÙక్ గుప్తా పైనా వేటు వేసింది. మనోజ్ వర్మ జంగల్‌మహల్ ప్రాంతంలో మావోయిస్టుల ఏరివేతలో కీలకపాత్ర పోషించారు. కిషన్‌జీ (కోటేశ్వర రావు) ఎన్కౌంటర్లోనూ ముఖ్యభూమిక వహించారు. ఆర్.జి.కర్ ఆసుపత్రిలో ట్రైనీ డాక్టర్ హత్యాచార ఘటనను నిరసిస్తూ బెంగాల్లో జూనియర్ డాక్టర్లు 39 రోజులుగా విధులను బహిష్కరిస్తున్నారు. సోమవారం రాత్రి మమతతో సమావేశమయ్యారు. వారి ప్రధాన డిమాండ్లను మమత అంగీకరించడం తెలిసిందే. -
వాషింగ్టన్ పోస్ట్ సీటీవోగా వినీత్ ఖోస్లా
అమెరికాకు చెందిన ప్రముఖ వార్తా సంస్థ ది వాషింగ్టన్ పోస్ట్‌లో భారతీయ-అమెరికన్‌కు కీలక స్థానం దక్కింది. ఉబెర్, యాపిల్ మాజీ ఎగ్జిక్యూటివ్ వినీత్ ఖోస్లా జూలై 31 నుంచి వాషింగ్టన్ పోస్ట్‌లో చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్‌గా చేరనున్నారు. వాషింగ్టన్ పోస్ట్ సీటీవోగా వినీత్ ఖోస్లా సంస్థ సీఈవోకి సీనియర్ సలహాదారుగా వ్యవహరిస్తారు. ఇంజనీరింగ్ బృందానికి, ఆవిష్కరణ వ్యూహానికి నాయకత్వం వహిస్తారు. తద్వారా సంస్థ సాంకేతిక లక్ష్యాల కోసం తోడ్పాటు అందిస్తారు. మీడియా ప్రపంచం వేగంగా మారుతున్న ప్రస్తుత తరుణంలో ది వాషింగ్టన్ పోస్ట్‌కి వినీత్‌ను స్వాగతిస్తున్నందుకు సోంతోషిస్తున్నామని, వాషింగ్టన్ పోస్ట్ తాత్కాలిక సీఈవో పాటీ స్టోన్సిఫర్ ఒక ప్రకటనలో తెలిపారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్, క్లౌడ్ కంప్యూటింగ్‌తో సహా సాంకేతిక పరిజ్ఞానంలో వినీత్‌కు ఉన్న విస్తృత నేపథ్యం తమ తదుపరి దశ ఆవిష్కరణలకు తోడ్పడుతుందని పేర్కొన్నారు. ఖోస్లాకు సాంకేతిక పరిశ్రమలో దాదాపు 20 సంవత్సరాల అనుభవం ఉంది. యాపిల్‌లో సిరి సహజ భాషా ఇంజిన్ కోసం, ఉబెర్‌లో మ్యాప్స్ రౌటింగ్ టీమ్ కోసం ఆయన పనిచేశారు. జార్జియా విశ్వవిద్యాలయం నుంచి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌లో మాస్టర్స్ పట్టా పొందిన వినీత్ ఖోస్లా 2005 నుంచి ఆయన కృత్రిమ మేధపై పని చేస్తున్నారు. -
పంద్రాగస్టుకి గోల్డ్
మెడల్ కాదు. ఒలింపిక్స్ వేదికపై దేశానికి ప్రాతినిథ్యం వహిస్తే చాలనుకునే ప్లేయర్స్ చాలామంది ఉన్నారు. ఎందుకంటే... ఒలింపిక్స్‌లో వివిధ దేశాల తరపున అంతర్జాతీయ ఆటగాళ్లు పాల్గొంటారు. అలా 1948లో ఇంగ్లాండ్‌లో జరిగిన ఒలింపిక్స్‌లో ఇండియన్ హాకీ టీమ్ ఫస్ట్ గోల్డ్ మెడల్ కొట్టింది. పతకం నెగ్గిన సంతోషంతో దేశ పతాకం రెపరెపలాడింది. ఈ మధురమైన సంఘటనల ఆధారంగా హిందీలో రూపొందిన సినిమా ‘గోల్డ్’. ఇండియన్ హాకీ టీమ్ ప్లేయర్ బల్బీర్‌సింగ్ పాత్రలో బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్ నటించారు. రీమా ఖగ్తీ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాలో మౌనీ రాయ్, కునాల్ కపూర్, అమిత్, వినీత్ కీలక పాత్రలు చేశారు. గతేడాది డిసెంబర్లో షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ సినిమాను ఆగస్టు 15న రిలీజ్ చేయనున్నట్లు అధికారికంగా చిత్రబృందం తెలిపింది. అంటే.. పంద్రాగస్టుకి ‘గోల్డ్’ అన్నమాట. గతేడాది ఇండిపెండెన్స్ వీక్‌లో ‘టాయ్‌లెట్: ఏక్ ప్రేమ్‌కథ’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన అక్షయ్ ఈసారి ‘గోల్డ్’ సినిమాతో థియేటర్స్‌లోకి రానుండటం విశేషం. -
సరదా సరదాగా...
కాకర్ల శ్రీధర్, వినీత్, ప్రేయసీ నాయక్, మౌనికా రెడ్డి, మహిమ ముఖ్య పాత్రల్లో తెరకెక్కిన యూత్‌ఫుల్ ఎంటర్టైనర్ ‘వెక్కిరింత’. జంగాల నాగబాబు దర్శకత్వంలో శ్రీ లాస్య క్రియేషన్స్ పతాకంపై రాహుల్ శ్వేత సమర్పణలో కాకర్ల నాగమణి నిర్మించిన ఈ చిత్రం విడుదలకు సిద్ధమవుతోంది. నిర్మాత మాట్లాడుతూ– ‘‘ప్రేమ, వినోదం వంటి అన్ని వాణిజ్య అంశాలున్న చిత్రమిది. యువతతో పాటు కుటుంబ ప్రేక్షకులకూ నచ్చేలా ఉంటుంది. యాక్టర్స్ కొత్తవాళ్లైనా అనుభవం ఉన్నవారిలా నటించారు. జనవరిలో సినిమా విడుదలకు సన్నాహాలు చేస్తున్నాం’’ అన్నారు. ‘‘టైటిల్‌కి తగ్గట్టుగానే ఈ చిత్రం సరదా సరదాగా ఉంటుంది’’ అని దర్శకుడు అన్నారు. ‘‘ప్రేక్షకుల అభిరుచులు మారాయి. కథ బాగుంటే చిన్నా, పెద్దా అనే తేడా లేకుండా అన్ని సినిమాలనూ ఆదరిస్తున్నారు. ఈ చిత్రం సక్సెస్ అవ్వాలి’’ అని సీనియర్ నటి కవిత పేర్కొన్నారు. ‘‘ఈ చిత్రం కేవలం యూత్‌కే కాదు. ఫ్యామిలీ ఆడియన్స్‌కి కూడా నచ్చుతుంది’’ అన్నారు ప్రముఖ దర్శకుడు సాగర్. చిత్రదర్శకుడు నాగబాబు, నిర్మాత సాయి వెంకట్, చిత్రబృందం పాల్గొన్నారు. -
వినీత్ సూపర్ షో
కొచ్చి: నాలుగు నిమిషాల వ్యవధిలో రెండు గోల్స్ చేసిన వినీత్ (85వ, 89వ నిమిషాల్లో).... ఇండియన్ సూపర్ లీగ్ (ఐఎస్ఎల్) ఫుట్‌బాల్ టోర్నమెంట్లో కేరళ బ్లాస్టర్స్ జట్టుకు నాలుగో విజయాన్ని అందించాడు. చెన్నైరుున్ ఎఫ్‌సీతో శనివారం జరిగిన మ్యాచ్‌లో కేరళ బ్లాస్టర్స్ 3-1 గోల్స్ తేడాతో గెలుపొందింది. ఆట 22వ నిమిషంలో మెండీ గోల్‌తో చెన్నైరుున్ 1-0తో ఆధిక్యంలోకి వెళ్లింది. అరుుతే 67వ నిమిషంలో కాడియో గోల్‌తో కేరళ స్కోరును 1-1తో సమం చేసింది. మరో ఐదు నిమిషాల్లో మ్యాచ్ ముగుస్తుందనగా వినీత్ గోల్‌తో కేరళ 2-1తో ఆధిక్యంలోకి వెళ్లింది. చివరి సెకన్లలో వినీత్ మరో గోల్ చేయడంతో కేరళ విజయం ఖాైయెుమంది. తాజా గెలుపుతో కేరళ 15 పారుుంట్లతో రెండో స్థానానికి చేరుకుంది.