Virata Parvam 1992
-
విరాట పర్వం: 30 ఏళ్ల కిందట పేలిన తూటా.. శంకరన్న చేతిలో సరళ బలి
ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఒకప్పుడు మావోయిస్టుల ఖిల్లా. అడుగడుగునా అన్నలు కలియతిరిగిన ప్రాంతం. అడవులన్నీ ఉద్యమపాటలతో ఉర్రూతలూగగా ఆకర్షితులైన యువత మన్యంబాట పట్టేది. ఆ సమయంలో జిల్లాలో తూర్పు.. పశ్చిమ డివిజన్లు ఉండేవి. ఈ రెండు ప్రాంతాలు కేంద్రంగా మావోలు కార్యకలాపాలు కొనసాగించేవారు. కరీంనగర్– నిజామాబాద్ జిల్లాల సరిహద్దులను మావోయిస్టు పార్టీ పశ్చిమ డివిజన్‌గా పరిగణించేది. ఆ పశ్చిమ అడవుల్లో 30 ఏళ్ల కిందట జరిగిన ఘటన ఆధారంగా ఇటీవల ‘విరాట పర్వం’ సినిమా వచ్చింది. సరళ అనే అమ్మాయి నిజజీవితంలో జరిగిన సంఘటనల ఆధారంగా ఆ సినిమాను తెరకెక్కించినా.. రాజన్నసిరిసిల్ల జిల్లాతో సరళ ఘటనకు ముడిపడి ఉంది. నిజామాబాద్ జిల్లా డిచ్పల్లి మండలం సిర్నాపల్లి అడవుల్లో సరళను 1992 జూలైలో హత్య చేశారు. సరళను చంపిన శంకరన్న అలియాస్ దొంతు మార్కండేయ రాజన్న సిరిసిల్ల జిల్లాలోని ఎల్లారెడ్డిపేటవాసి. శంకరన్న అప్పటి పీపుల్స్‌వార్‌లో ఉత్తర తెలంగాణ కార్యదర్శిగా ఉన్నారు. ఆ రోజు ఏం జరిగిందనేదానిపై కథనం.. సిరిసిల్ల: కరీంనగర్–నిజామాబాద్ జిల్లాల సరిహద్దులను మావోయిస్టు పార్టీ పశ్చిమ డివిజన్‌గా పరిగణిస్తోంది. ఆ పశ్చిమ అడవుల్లో 30 ఏళ్ల కిందట జరిగిన ఘటన ఆధారంగా ఇటీవల ‘విరాట పర్వం’ సినిమా వచ్చింది. సరళ అనే అమ్మాయి నిజజీవితంలో జరిగిన సంఘటనల ఆధారంగా సినిమాను తెరకెక్కించినా.. రాజన్న సిరిసిల్ల జిల్లాతో సరళ ఘటనకు ముడిపడి ఉంది. నిజామాబాద్ జిల్లా డిచ్పల్లి మండలం సిర్నాపల్లి అడవుల్లో సరళను 1992 జూలైలో హత్య చేశారు. సరళను చంపిన శంకరన్న అలియాస్ దొంతు మార్కండేయ రాజన్న సిరిసిల్ల జిల్లాలోని ఎల్లారెడ్డిపేటవాసి. శంకరన్న అప్పటి పీపుల్స్‌వార్‌లో ఉత్తర తెలంగాణ కార్యదర్శిగా ఉన్నారు. ఆ రోజు ఏం జరిగింది..? ► ఖమ్మం జిల్లాకు చెందిన తూము సరళ ఇల్లు వదిలి సిర్నాపల్లి అటవీ ప్రాంతానికి చేరింది. వాస్తవానికి అప్పటికే శంకరన్న భార్య జ్యోతి ఎన్కౌంటర్లో మరణించింది. ► ఆ వార్తను పత్రికల్లో చూసిన సరళ, శంకరన్నను కలిసేందుకు ఇల్లు వీడి నిజామాబాద్ జిల్లా సిర్నాపల్లి ప్రాంతానికి చేరింది. ► అటవీ ప్రాంతంలోని డొంకల్, గన్నారం, సిర్నాపల్లి గ్రామాల్లో ఉంటూ.. పార్టీలో చేరాలని, శంకరన్నను కలవాలని ప్రయత్నించింది. ► ఈక్రమంలోనే డొంకల్ అటవీ ప్రాంతంలో పార్టీ జిల్లా కమిటీ సమావేశం జరుగుతుండగా.. సరళను పిలిచి విచారించారు. ► శంకరన్నతోపాటు హరిభూషణ్, కుమార్ దళాలు ఉన్నాయి. సరళను పోలీస్ ఇన్ఫార్మర్గా భావించి, కోవర్టుకు పాల్పడుతోందనే భయంతో ఆమెను విచారించారు. ► సరళ ఎంత కొట్టినా.. తాను పార్టీలో చేరేందుకు వచ్చానని పదే పదే చెప్పినట్లు సమాచారం. ► చివరకు శంకరన్న, సరళను భయపెట్టేందుకు ఫైర్ చేయగా.. అది పొరపాటున సరళకు తగిలి మరణించినట్లు అప్పట్లో పార్టీలో పనిచేసి లొంగిపోయిన మాజీ దళ నేత కుమార్ వెల్లడించారు. అలా సరళ సిర్నాపల్లి అడవుల్లో శవమైంది. సిరిసిల్ల జిల్లాలో గోడలపై సిర్నాపల్లి రాతలు రాజన్న సిరిసిల్ల జిల్లా అటవీ ప్రాంతాల్లోని పల్లెల్లో గోడలపై సరళ ఉదంతాన్ని ఉటంకిస్తూ పీపుల్స్‌వార్‌కు వ్యతిరేకంగా అప్పటి జనశక్తి పార్టీ వాల్ రైటింగ్స్ చేసింది. పీపుల్స్‌వార్ నేత శంకరన్న చేసిన ఘాతుకం అంటూ ప్రచారం చేసింది. నిజానికి సరళ తల్లిదండ్రులు సరోజ, భిక్షమయ్య.. సీపీఐ(ఎంఎల్) న్యూడెమోక్రసీ పార్టీ మద్దతుదారులు కావడంతో జనశక్తి పార్టీ ఈ ఘటనపై వ్యతిరేకంగా ప్రచారం చేసింది. సరళ మృతదేహాన్ని కూడా వారి తల్లిదండ్రులకు ఇవ్వలేదని, అడవుల్లోనే కాల్చివేశారంటూ తీవ్రస్థాయిలో ఖండించారు. పొరపాటును గుర్తించిన శంకరన్న సిర్నాపల్లి అడవుల్లో జరిగిన సరళ ఘటనపై పీపుల్స్‌వార్ పార్టీలో తీవ్రస్థాయిలో చర్చసాగింది. ఆ అమ్మాయిని ఇంటికి పంపించే క్రమంలోనే మిస్ ఫైర్ కారణంగా మరణించిందని శంకరన్న స్పష్టం చేశారు. పార్టీ సమావేశంలో శంకరన్న ఆత్మవిమర్శ చేసుకుని పొరపాటును ఒప్పుకున్నట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. 1993 జనవరి 27న నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని హౌసింగ్‌బోర్డులో శంకరన్న ఎన్కౌంటర్లో మరణించాడు. ఎల్లారెడ్డిపేటకు చెందిన మార్కండేయ పీపుల్స్‌వార్‌లో చేరి ఉత్తర తెలంగాణ కార్యదర్శిగా ఎదిగారు. ఆయన అనేక ఎన్కౌంటర్లలో తప్పించుకున్నారు. చివరికి సరళ ఘటన ఆయన్ని మానసికంగా బాధించిందని పార్టీ వర్గాలు వెల్లడించాయి. మొత్తంగా విరాటపర్వంలో సిరిసిల్ల అధ్యాయంపై ఆసక్తికర చర్చ సాగుతోంది. -
విరాటపర్వం పబ్లిక్ టాక్
-
నిన్నెంత ప్రేమిస్తున్నానో తెలుసా: సాయి పల్లవి
‘‘నువ్వు చేసిన త్యాగాలు.. రాజీపడ్డ అంశాలను రహస్యంగా ఉంచిన తీరు.. నీ ప్రేమ.. నా జీవితానికి నువ్విచ్చిన అర్థం.. నాలో నువ్వు నింపిన సంతోషం.. ఎల్లవేళలా చిరునవ్వు చిందించే నువ్వు.. నీ ఉనికి నా ప్రపంచాన్ని గొప్పగా మార్చింది. 100 ఏళ్లు వచ్చినా నువ్వు నా బేబీవే. నేను నిన్ను ఎంతగా ప్రేమిస్తున్నానో తెలియాలంటే నువ్వు నాలా మారిపోవాల్సిందే. నా జీవితంలో నువ్వు ఉండటం అదృష్టంగా భావిస్తున్నా. హ్యాపీ బర్త్ డే మంకీ’’ అంటూ హీరోయిన్ సాయిపల్లవి తన సోదరి పూజా కన్నన్‌కు శుభాకాంక్షలు తెలిపారు. మంగళవారం పూజా పుట్టినరోజు సందర్భంగా సోషల్ మీడియాలో చిన్ననాటి ఫొటో షేర్ చేసి తన ప్రేమను చాటుకున్నారు. కాగా ఫిదాతో కుర్రకారు మనసు దోచిన సాయి పల్లవి ప్రస్తుతం.. ‘లవ్‌స్టోరీ’అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్న సంగతి తెలిసిందే. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో నాగచైతన్య హీరోగా తెరకెక్కిన ఈ సినిమా ఏప్రిల్‌లో విడుదల కావాల్సి ఉండగా.. కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో వాయిదా పడింది. ఇక ఈ చిత్రంతో పాటు రానా దగ్గుబాటి ప్రధాన పాత్రలో రూపొందిన ‘విరాటపర్వం’లోనూ సాయి పల్లవి నటిస్తున్నారు. ‘నీదీ నాదీ ఒకే కథ’ ఫేమ్ వేణు ఉడుగుల దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా కూడా వేసవిలోనే విడుదల కావాల్సి ఉండగా వాయిదా పడింది. View this post on Instagram The love, The sacrifices you’ve made, The compromises you conceal, The meaning you add to my life, The happiness you bring to my system, The smile that you ensure on days of all kinds, The very existence of YOU in my world is a blessing. You are my baby n you’ll be that even when you are a 100 years old. You have to be me, to know how much I love you! Today is a reminder, of how lucky I’m to have you in my life. Happy birthday monkey😘❤️ A post shared by Sai Pallavi (@saipallavi.senthamarai) on Apr 21, 2020 at 4:12am PDT -
‘విరాటపర్వం’లో నానా పటేకర్!
రానా, సాయి పల్లవి కాంబినేషన్లో రాబోతోన్న చిత్రం విరాటపర్వం 1992. భిన్న చిత్రాలతో ప్రేక్షకులను పలకరిస్తున్న రానా, సాయి పల్లవి జంటగా నటించనున్న ఈ చిత్రంపై మంచి అంచనాలే ఏర్పడ్డాయి. ఈ చిత్రానికి సంబంధించి మరో అప్డేట్ ఫిలింనగర్లో చక్కర్లు కొడుతోంది. ఈ మూవీలో ప్రియమణి ఓ కీలక పాత్రలో నటించనుందని వార్తలు వినిపించగా.. తాజాగా బాలీవుడ్ విలక్షణ నటుడు నానా పటేకర్ ప్రతినాయకుడిగా నటించనున్నాడని తెలుస్తోంది. మరి ఈ వార్తలపై చిత్రబృందం అధికారికంగా స్పందించాల్సి ఉంది. ‘నీది నాదీ ఒకే కథ’ అనే చిత్రంతో అందర్నీ మెప్పించిన వేణు ఊడుగుల ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. -
విరాటపర్వంలో ప్రియమణి
నీది నాది ఒకే కథ సినిమాతో ఘన విజయం అందుకున్న యువ దర్శకుడు వేణు ఉడుగుల దర్శకత్వంలో తెరకెక్కుతున్న రెండో సినిమా విరాటపర్వం 1992. డిఫరెంట్ కాన్సెప్ట్‌తో పీరియాడిక్ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కుతున్న ఈ సినిమాలో రానా, సాయి పల్లవి హీరో హీరోయిన్లుగా నటిస్తున్నారు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ సినిమాకు నటీనటుల ఎంపిక కూడా జరుగుతోంది. పొలిటికల్ థ్రిల్లర్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో హీరోయిన్ ప్రియమణి కీలక పాత్రలో నటిస్తోంది. పెళ్లి తరువాత సినిమాకు దూరమైన ఈ సినిమా ఇటీవల సిరివెన్నెల సినిమాతో రీఎంట్రీకి రెడీ అవుతోంది. ఈ సినిమాతో పాటు రానా సినిమాలో కీలక పాత్రలో నటించేందుకు ప్రియమణి ఓకె చెప్పినట్టు తెలుస్తోంది. ఇప్పటికే ఈ సినిమాలో టబు నటిస్తోందన్న టాక్ వినిపిస్తోంది. మరి టబు, ప్రియమణి ఇద్దరు ఉన్నారా, లేక టబు ప్లేస్లోనే ప్రియమణిని తీసుకున్నారా అన్న విషయం తెలియాలంటే అఫీషియల్ ఎనౌన్స్మెంట్ వరకు వెయిట్ చేయాల్సిందే. -
నక్సలైట్ పాత్రలో సాయి పల్లవి!
తన నటనతో, లుక్స్‌తో, డ్యాన్సులతో ప్రేక్షకులను కట్టిపడేస్తారు సాయి పల్లవి. ఏ పాత్ర చేసినా మ్యాజిక్ చేసేసి అభిమానులను సంపాదించుకుంటారు. సాయి పల్లవి ఏదైనా సినిమాలో నటిస్తుంది అని అంటే.. ఏదో ఒక స్పెషాలిటీ ఉంటుంది. ప్రస్తుతం సాయి పల్లవి చేయబోయే ఓ సినిమా అప్డేట్ ఆసక్తికరంగా మారింది. నీదీ నాదీ ఒకే కథతో విమర్శకుల ప్రశంసలు అందుకున్న వేణు ఊడుగుల దర్శకత్వంలో విరాటపర్వం 1992 అనే చిత్రం రాబోతోంది. ఈ మూవీలో రానా సరసన సాయి పల్లవి హీరోయిన్గా నటిస్తున్నారు. ఈ చిత్రంలోనే సాయి పల్లవి నక్సలైట్ పాత్రలో నటించనున్నట్లు సమాచారం. మరి మొదటి చిత్రంతోనే ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్న దర్శకుడు ఈ మూవీ ఎలా తెరకెక్కిస్తాడో వేచి చూడాలి. -
రానా హీరోగా ‘విరాటపర్వం 1992’
హీరో, విలన్, క్యారెక్టర్ అన్న తేడా లేకుండా వరుస అవకాశాలతో దూసుకుపోతున్నాడు యంగ్ హీరో రానా. తెలుగుతో పాటు తమిళ, హిందీ భాషల్లోనూ వరుస సినిమాలు చేస్తున్న రానాతో కలిసి పనిచేసేందుకు యువ దర్శకులు క్యూ కడుతున్నారు. ముఖ్యంగా ప్రయోగాత్మక చిత్రాలకు రానా ఫస్ట్ చాయిస్ అవుతున్నాడు. తాజాగా రానా ఖాతాలో మరో డిఫరెంట్ మూవీ వచ్చి చేరింది. నీదీ నాదీ ఒకే కథ సినిమాతో దర్శకుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న వేణు ఉడుగుల తరువాత విరాటపర్వం 1992 అనే కథను సిద్ధం చేసుకున్నాడు. ముందుగా ఈ సినిమాలో నాని హీరోగా నటిస్తాడన్న టాక్ వినిపించింది. తరువాత నితిన్, శర్వానంద్ లాంటి హీరోల పేర్లు వినిపించినా రానా ఫైనల్ అయినట్టుగా తెలుస్తోంది. సాయి పల్లవి హీరోయిన్గా నటిస్తురన్న ఈ సినిమా పీరియాడిక్ డ్రామాగా తెరకెక్కనుందట. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడనుంది.