‘విరాటపర్వం’లో నానా పటేకర్‌! | Nana Patekar May Played Key Role In Virata Parvam | Sakshi
Sakshi News home page

‘విరాటపర్వం’లో నానా పటేకర్‌!

Published Fri, May 3 2019 10:22 AM | Last Updated on Fri, May 3 2019 10:22 AM

Nana Patekar May Played Key Role In Virata Parvam - Sakshi

రానా, సాయి పల్లవి కాంబినేషన్‌లో రాబోతోన్న చిత్రం విరాటపర్వం 1992. భిన్న చిత్రాలతో ప్రేక్షకులను పలకరిస్తున్న రానా, సాయి పల్లవి జంటగా నటించనున్న ఈ చిత్రంపై మంచి అంచనాలే ఏర్పడ్డాయి. ఈ చిత్రానికి సంబంధించి మరో అప్‌డేట్‌ ఫిలింనగర్‌లో చక్కర్లు కొడుతోంది.

ఈ మూవీలో ప్రియమణి ఓ కీలక పాత్రలో నటించనుందని వార్తలు వినిపించగా.. తాజాగా బాలీవుడ్‌ విలక్షణ నటుడు నానా పటేకర్‌ ప్రతినాయకుడిగా నటించనున్నాడని తెలుస్తోంది. మరి ఈ వార్తలపై చిత్రబృందం అధికారికంగా స్పందించాల్సి ఉంది. ‘నీది నాదీ ఒకే కథ’ అనే చిత్రంతో అందర్నీ మెప్పించిన వేణు ఊడుగుల ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement