
‘మీటూ’ ఉద్యమం బాలీవుడ్‌లో ప్రకంపనలు సృష్టిస్తోంది. పలువురు లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఈ క్రమంలో ప్రస్తుతం తాము చేస్తున్న సినిమాల నుంచి కొందరు తప్పుకుంటున్నారు. మరికొందరిని చిత్రబృందం తొలగిస్తోంది. ‘హౌస్‌ఫుల్–4’ సినిమాలో నటిస్తున్న నానా పటేకర్, చిత్ర దర్శకుడు సాజిద్ ఖాన్‌పై లైంగిక వేధింపుల ఆరోపణలు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ కారణంగా వీరిద్దరూ ఈ సినిమా నుంచి తప్పుకున్నారు. దీంతో సినిమా షూటింగ్‌కి కొద్ది రోజులు బ్రేక్ పడింది.
అయితే నానా పటేకర్, సాజిద్ ఖాన్‌ల స్థానాలను వేరే వారితో భర్తీ చేసి త్వరలో ఈ సినిమా షూటింగ్ మొదలు పెట్టనున్నారట చిత్రబృందం. సాజిద్ ఖాన్ స్థానంలో దర్శకుడిగా ఫర్హాద్ సంజనీని తీసుకున్నారట. నానా పటేకర్ స్థానంలో టాలీవుడ్ హీరో రానాను తీసుకోనున్నారని బాలీవుడ్ టాక్. నానా స్థానంలో జాకీ ష్రాఫ్, అనిల్ కపూర్‌ల పేర్లు వినిపించాయి. తాజాగా రానా పేరు తెరపైకి వచ్చింది. చిత్ర వర్గాలు రానాతో సంప్రదింపులు జరుపుతున్నారట. మరి రానా ఫిక్సా? వెయిట్ అండ్ సీ.
Comments
Please login to add a commentAdd a comment