Virtusa company
-
ఉద్యోగుల కోసం.. వర్చ్యుసా కోవిడ్ కేర్..
కొవిడ్ మహమ్మారి శరవేగంగా వ్యాపిస్తున్న ప్రస్తుత సమయంలో ఉద్యోగుల భద్రత సంస్థలకు అత్యంత ప్రాధాన్యం కలిగిన అంశంలా మారింది. ఉచిత వ్యాక్సినేషన్ దగ్గర్నుంచి విభిన్న రకాలుగా వారికి సాయం అందేలా సంస్థలు వారి క్షేమం పట్ల తమ చిత్తశుధ్దిని చాటుకుంటున్నాయి. పోర్టల్‌తో మద్ధతు.. అదే క్రమంలో డిజిటల్ వ్యూహాలు, డిజిటల్ ఇజనీరింగ్, ఐటి సేవలు, పరిష్కారాలను అంతర్జాతీయంగా అందించే వర్చ్యుసా కార్పొరేషన్... వ్యక్తిగతమైన ఫీచర్లతో రూపొందించిన 24/7 కొవిడ్ 19 కేర్ పోర్టల్‌ను లాంచ్ చేసింది. ఇందులో ఒక విశిష్టమైన అంశం ఏమిటంటే, ప్రతి ఒక్క టీమ్ సభ్యుడు, వారి కటుంబాలకు సంబంధించి ఆరోగ్యపరంగా ప్రతీ విషయాన్నీ ఈ పోర్టల్ పట్టించుకుంటుంది. వారికి 24/7 ప్రత్యక్ష మద్దతు, సహకారాలు అందిస్తూ.. , వ్యాక్సినేషన్లకు సంబంధించి టీమ్ సభ్యుల డేటాను పోర్టల్, కాల్ సెంటర్ పర్యవేక్షిస్తాయి. ‘‘సంస్థ సిబ్బంది మాత్రమే కాదు వారి కుటుంబ సభ్యుల సంరక్షణ కూడా మాకు ప్రధానమే. అందుకే ఈ పోర్టల్ మేం ప్రారంభించాం’’ అని వర్చ్యుసా ఛీఫ్ పీపుల్ ఆఫీసర్ నారాయణన్ తెలిపారు. ‘‘ప్రపంచంలో ఎక్కడైనా ఏ సంక్షోభ పరిస్థితి తలెత్తినా దీనిని వినియోగించుకొనేలా ఓ డిజిటలైజ్ నమూనాను నిర్మించడం మా ఉద్దేశం‘ అన్నారాయన. వార్ రూమ్..రెడీ... ఈ పోర్టల్‌తో పాటు, కొవిడ్19 సంరక్షణ, సేవలను అందించడం కోసం ఒక వార్ రూమ్‌ను కూడా సంస్థ సృష్టించింది. అలాగే సంస్థ సిబ్బందికి ఆసుపత్రులు, ఇళ్ళు, క్వారంటైన్ కేంద్రాల్లో కొవిడ్‌కు ముందు, అనంతర సంరక్షణ కూడా అందిస్తోంది. రవాణా, ఔషధాలు, ఆహారం, ఆసుపత్రుల్లో పడకలు, అంబులెన్స్ లు, ఆక్సిజన్ సిలెండర్లు సంపాదించడంలో సాయం, ఇంట్లో వారి సంరక్షణతో సహా అదనపు సహాయాన్ని కూడా అందిస్తోంది. ఎక్కడి నించి విజ్ఞప్తి వచ్చినా సహాయం అందించేలా ప్రత్యేకమైన ఏర్పాట్లు చేసింది. దీనిలో భాగంగా చెన్నై, హైదరాబాద్‌లలో తాత్కాలిక కొవిడ్ కేంద్రాలు, ఐసోలేటెడ్ ఉద్యోగుల కోసం ఏర్పాటు చేశారు. వీరికి వర్చ్యుసా సిబ్బంది, ఆ ప్రాంతాల్లోని ప్రసిద్ధమైన ఆసుపత్రులకు చెందిన వైద్య నిపుణులు సహకారం అందిస్తున్నారు. దీనితోపాటు, కన్వల్సెంట్ ఫ్లాస్మా దాతల డేటాబేస్‌ను కూడా ఏర్పాటు చేసింది. ఆన్లైన్ కన్సల్టేషన్స్, హామ్ క్వారంటైన్ బీమా.. ఆరోగ్యపరమైన అత్యవసర పరిస్థితుల్లో సహాయం అందించడానికి అందుబాటులో ఉంచడం కోసం ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్లకు వర్చ్యుసా ఆర్డర్లు పెట్టింది. అలాగే. వైద్యులు, పోషకాహార నిపుణులూ, ఆరోగ్య శ్రేయస్సు నిపుణులతో ఉచిత ఆన్లైన్ కన్సల్టేషన్లను కూడా రోజంతా అందిస్తోంది. వైద్యపరమైన అత్యవసర పరిస్థితుల్లో సహాయం అందించడానికి ఉద్యోగుల సంక్షేమ నిధిని వినియోగిస్తోంది, అలాగే టీమ్ సభ్యులలో అవసరం ఉన్నవారెవరికైనా వారి మానసిక, శారీరక ఆరోగ్యం కోసం సాయం అందించడానికి వర్చ్యువల్ కనెక్ట్ నిర్వహిస్తోంది. టీమ్ సభ్యులకూ, వారి కుటుంబాలకూ వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని నిర్వహించింది. హోమ్ క్వారంటైన్ వైద్య బీమా పథకాన్ని కూడా కంపెనీ ప్రవేశపెట్టింది. -
3500 మంది 7500 గంటలు...
సాక్షి, సిటీబ్యూరో: శరవేగంగా అన్ని లావాదేవీలూ డిజిటల్ మయంగా మారిపోతున్న పరిస్థితుల్లో... సంబంధిత అంశాలపై శిక్షణా అవగాహన తరగతులు కూడా ఊపందుకున్నాయి. ఔత్సాహికుల కోసం నిర్వహిస్తున్న ఈ తరహా కార్యక్రమాల్లోనూ పోటీ పెరిగింది. అదే క్రమంలో అలాంటి వాటిలో ఉత్తమమైన వాటిని గుర్తించడమూ ప్రాధాన్యత కలిగిన అంశమైంది. ఈ తరహా సేవలు అందిస్తున్న సంస్థల శిక్షణా సామర్ధ్యానికి గుర్తింపునిచ్చే పురస్కారాలూ షురూ అయ్యాయి. అదే క్రమంలో ఐటి, సొల్యూషన్స్, డిజిటల్ వినియోగంలో అవసరమైన సేవలు, అందించే వర్చ్యుసా కార్పొరేషన్... ఛాంపియన్ ఆఫ్ లెర్నింగ్ గుర్తింపును సాధించింది. ఈ విషయాన్ని సంస్థ ప్రతినిధులు తెలిపారు. అసోసియేషన్ ఫర్ టాలెంట్ డెవలప్మెంట్ (ఎటిడి) నుంచి వర్చ్యుసా ఈ గుర్తింపును అందుకుంది. 3500 మంది 7500 గంటలు... లెర్నర్స్‌వీక్..విశేషాలివీ... గత డిసెంబరు 7వ తేదీ నుంచి 11వ తేదీ వరకూ ఈ లెర్నర్స్ వీక్ నిర్వహించారు. వరుసగా నాలుగో ఏడాది ఈ గుర్తింపును తమ సంస్థ దక్కించుకుందని తమ సంస్థ నిర్వహిస్తున్న లెర్నర్స్ వీక్ వంటి వార్షిక కార్యక్రమాలతో పాటు, ఈ ఏడాది అందించిన 240కిపైగా కోర్సులు వంటివి ఈ గుర్తింపునకు అర్హత సాధించిపెట్టాయని సంస్థ ప్రతినిధులు అంటున్నారు. ఈ ఏడాది టెక్నికల్, ప్రాసెస్, డొమైన్, బిహేవియరల్, కమ్యూనికేషన్ డిసిప్లైన్స్... తదితర అంశాలను తాము అందించామన్నారు. ఈ కార్యక్రమానికి దాదాపుగా 3,500కిపైగా అభ్యర్ధులు లాగిన్ అయ్యారని, 7,500 గంటలకు పైగా శిక్షణ కొనసాగిందని వివరించారు. సెల్ఫ్ ఎన్హాన్స్మెంట్, ఆడియోబుక్స్, వెబ్–సిరీస్, హ్యాండ్స్ ఆన్ అప్లికేషన్ సిమ్యులేషన్స్, డెవ్‌ఓప్స్, డేటా అనలిటిక్స్ వంటివి ఇందులో భాగంగా ఉన్నాయన్నారు. -
వర్చూసా చేతికి పొలారిస్
53 శాతం వాటాను రూ.1,173 కోట్లకు కొనుగోలు న్యూఢిల్లీ: అమెరికాకు చెందిన వర్చూసా కంపెనీ చెన్నైకి చెందిన పొలారిస్ కన్సల్టింగ్ అండ్ సర్వీసెస్ కంపెనీలో 53 శాతం వాటాను కొనుగోలు చేయనున్నది. ఈ వాటా కొనుగోలు కోసం పొలారిస్ కన్సల్టింగ్ అండ్ సర్వీసెస్ ఒక్కో షేర్‌కు రూ.221 చొప్పున రూ.1,173 కోట్లు వెచ్చించనున్నామని వర్చూసా తెలిపింది. నిబంధనల ప్రకారం మరో 26 శాతం వాటాను పబ్లిక్ ఆఫర్ ద్వారా కొనుగోలు చేస్తామని పేర్కొంది. ఈ కంపెనీ కొనుగోలు కారణంగా బ్యాంకింగ్, ఆర్థిక సేవలను, సొల్యూషన్లను పూర్తి స్థాయిలో అంతర్జాతీయంగా అందించగలమని వివరించింది. అంతేకాకుండా భారీ స్థాయిలో కన్సల్టింగ్, అవుట్సోర్సింగ్ అవకాశాలను పొందగలమని వివరించింది. ఈ డీల్ పట్ల పొలారిస్ కన్సల్టింగ్ అండ్ సర్వీసెస్ చైర్మన్ అరుణ్ జైన్ సంతోషం వ్యక్తం చేశారు. మార్కెట్ ముగిసిన తర్వాత ఈ డీల్ వివరాలు వెల్లడయ్యాయి. పొలారిస్ షేర్లు బీఎస్ఈలో 1% నష్టపోయి రూ.205 వద్ద ముగిశాయి. కాగా ఈ క్యూ2లో పొలారిస్ రూ.47 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది.