53 శాతం వాటాను రూ.1,173 కోట్లకు కొనుగోలు
న్యూఢిల్లీ: అమెరికాకు చెందిన వర్చూసా కంపెనీ చెన్నైకి చెందిన పొలారిస్ కన్సల్టింగ్ అండ్ సర్వీసెస్ కంపెనీలో 53 శాతం వాటాను కొనుగోలు చేయనున్నది. ఈ వాటా కొనుగోలు కోసం పొలారిస్ కన్సల్టింగ్ అండ్ సర్వీసెస్ ఒక్కో షేర్‌కు రూ.221 చొప్పున రూ.1,173 కోట్లు వెచ్చించనున్నామని వర్చూసా తెలిపింది. నిబంధనల ప్రకారం మరో 26 శాతం వాటాను పబ్లిక్ ఆఫర్ ద్వారా కొనుగోలు చేస్తామని పేర్కొంది.
ఈ కంపెనీ కొనుగోలు కారణంగా బ్యాంకింగ్, ఆర్థిక సేవలను, సొల్యూషన్లను పూర్తి స్థాయిలో అంతర్జాతీయంగా అందించగలమని వివరించింది. అంతేకాకుండా భారీ స్థాయిలో కన్సల్టింగ్, అవుట్‌సోర్సింగ్ అవకాశాలను పొందగలమని వివరించింది. ఈ డీల్ పట్ల పొలారిస్ కన్సల్టింగ్ అండ్ సర్వీసెస్ చైర్మన్ అరుణ్ జైన్ సంతోషం వ్యక్తం చేశారు. మార్కెట్ ముగిసిన తర్వాత ఈ డీల్ వివరాలు వెల్లడయ్యాయి. పొలారిస్ షేర్లు బీఎస్‌ఈలో 1% నష్టపోయి రూ.205 వద్ద ముగిశాయి. కాగా ఈ క్యూ2లో పొలారిస్ రూ.47 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది.
వర్చూసా చేతికి పొలారిస్
Published Fri, Nov 6 2015 12:21 AM | Last Updated on Sun, Sep 3 2017 12:04 PM
Advertisement
Advertisement