Polaris Consulting and Services
-
పొలారిస్ షేర్లకు వర్చూసా ఓపెన్ ఆఫర్
ఒక్కో షేర్ కొనుగోలు ధర రూ.221 న్యూఢిల్లీ: పొలారిస్ కన్సల్టింగ్ అండ్ సర్వీసెస్‌లో మెజారిటీ వాటా కొనుగోలు చేసిన వర్చుసా కంపెనీ మరో 26 శాతం వాటా(2,67,19,942 షేర్ల) కొనుగోలు కోసం ఓపెన్ ఆఫర్‌ను ప్రకటించింది. వర్చుసా కంపెనీ ఒక్కో షేర్‌ను రూ.220.73కు కొనుగోలు చేస్తుందని, మార్చి 11 నుంచి ఈ రూ.590 కోట్ల ఓపెన్ ఆఫర్ ప్రారంభమవుతుందని పొలారిస్ కన్సల్టింగ్ అండ్ సర్వీసెస్ కంపెనీ బీఎస్ఈ నివేదించింది. పొలారిస్‌లో 51.7 శాతం వాటాను వర్చుసా కంపెనీ రూ.1,136.4 కోట్లకు కొనుగోలు చేసిన విషయం తెలిసిందే. పొలారిస్ కన్సల్టింగ్ అండ్ సర్వీసెస్ కంపెనీ షేర్ బీఎస్ఈలో గురువారం రూ.210 వద్ద ముగిసింది. -
వర్చూసా చేతికి పొలారిస్
53 శాతం వాటాను రూ.1,173 కోట్లకు కొనుగోలు న్యూఢిల్లీ: అమెరికాకు చెందిన వర్చూసా కంపెనీ చెన్నైకి చెందిన పొలారిస్ కన్సల్టింగ్ అండ్ సర్వీసెస్ కంపెనీలో 53 శాతం వాటాను కొనుగోలు చేయనున్నది. ఈ వాటా కొనుగోలు కోసం పొలారిస్ కన్సల్టింగ్ అండ్ సర్వీసెస్ ఒక్కో షేర్‌కు రూ.221 చొప్పున రూ.1,173 కోట్లు వెచ్చించనున్నామని వర్చూసా తెలిపింది. నిబంధనల ప్రకారం మరో 26 శాతం వాటాను పబ్లిక్ ఆఫర్ ద్వారా కొనుగోలు చేస్తామని పేర్కొంది. ఈ కంపెనీ కొనుగోలు కారణంగా బ్యాంకింగ్, ఆర్థిక సేవలను, సొల్యూషన్లను పూర్తి స్థాయిలో అంతర్జాతీయంగా అందించగలమని వివరించింది. అంతేకాకుండా భారీ స్థాయిలో కన్సల్టింగ్, అవుట్సోర్సింగ్ అవకాశాలను పొందగలమని వివరించింది. ఈ డీల్ పట్ల పొలారిస్ కన్సల్టింగ్ అండ్ సర్వీసెస్ చైర్మన్ అరుణ్ జైన్ సంతోషం వ్యక్తం చేశారు. మార్కెట్ ముగిసిన తర్వాత ఈ డీల్ వివరాలు వెల్లడయ్యాయి. పొలారిస్ షేర్లు బీఎస్ఈలో 1% నష్టపోయి రూ.205 వద్ద ముగిశాయి. కాగా ఈ క్యూ2లో పొలారిస్ రూ.47 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది.