పొలారిస్ షేర్లకు వర్చూసా ఓపెన్ ఆఫర్
ఒక్కో షేర్ కొనుగోలు ధర రూ.221
న్యూఢిల్లీ: పొలారిస్ కన్సల్టింగ్ అండ్ సర్వీసెస్‌లో మెజారిటీ వాటా కొనుగోలు చేసిన వర్చుసా కంపెనీ మరో 26 శాతం వాటా(2,67,19,942 షేర్ల) కొనుగోలు కోసం ఓపెన్ ఆఫర్‌ను ప్రకటించింది. వర్చుసా కంపెనీ ఒక్కో షేర్‌ను రూ.220.73కు కొనుగోలు చేస్తుందని, మార్చి 11 నుంచి ఈ రూ.590 కోట్ల ఓపెన్ ఆఫర్ ప్రారంభమవుతుందని పొలారిస్ కన్సల్టింగ్ అండ్ సర్వీసెస్ కంపెనీ బీఎస్‌ఈ నివేదించింది. పొలారిస్‌లో 51.7 శాతం వాటాను వర్చుసా కంపెనీ రూ.1,136.4 కోట్లకు కొనుగోలు చేసిన విషయం తెలిసిందే. పొలారిస్ కన్సల్టింగ్ అండ్ సర్వీసెస్ కంపెనీ షేర్ బీఎస్‌ఈలో గురువారం రూ.210 వద్ద ముగిసింది.