visaka lands scam
-
భూకబ్జాలో కొత్త కోణం: దళితుల భూమి వదల్లేదు
సాక్షి, విశాఖపట్నం: టీడీపీ మాజీ ఎమ్మెల్యే పల్లా శ్రీనివాస్ రావు సోదరుడు శంకరరావు భూకబ్జాలో కొత్త కోణం వెలుగు చూసింది. శంకరరావు తమ భూమి ఆక్రమించినట్లు పలువురు దళితులు ఫిర్యాదు చేశారు. అజయ్‌బాబు, జైన్ అనే వ్యక్తులతో కలిసి శంకరరావు దళిత భూములు ఆక్రమణకు పాల్పడ్డట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. తుంగలం సర్వే నంబర్ 29/1లోని ఎకరా 30 సెంట్ల స్థలంలో పల్లా శంకరరావు బెదిరించి అక్రమ నిర్మాణాలు చేపట్టారంటున్నారు దళితులు. పల్లా సోదరుడి భూ ఆక్రమణలపై అప్పటి హోంమంత్రి చినరాజప్పకు తాము ఫిర్యాదు చేసినా న్యాయం జరగలేదన్నారు బాధితులు. టీడీపీ హయాంలో ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని తెలిపారు. చదవండి: కొనసాగుతున్న కబ్జా ప్రకంపనలు -
‘పవన్ కల్యాణ్‌కు మతిభ్రమించింది’
సాక్షి, విశాఖపట్నం: జిల్లాలోని దసపల్లా భూములు ప్రభుత్వానికి చెందినట్టు గుర్తించినా టీడీపీ హయాంలో ప్రైవేట్ వ్యక్తులకు అప్పగించారని అనకాపల్లి ఎమ్మెల్యే గుడివాడ అమర్నాథ్ విమర్శించారు. మంగళవారం ఆయన విశాఖలో భూఆక్రమణలపై సిట్ ప్రతినిధులకు ఫిర్యాదు చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. విశాఖపట్నం టీడీపీ కార్యాలయం కూడా రికార్డుల మార్పిడిలో జరిగిన అక్రమ వ్యవహారమే అని మండిపడ్డారు. మెడ్ టెక్ భూముల సేకరణలో భారీ అక్రమం జరిగిందని విమర్శించారు. గత సిట్ కూడా పీలా గోవింద్‌పై అభియోగం మోపినా చంద్రబాబునాయుడు ఆయనకు ఎమ్మెల్యే టికెట్ ఇచ్చారని అమర్నాథ్ దుయ్యబట్టారు. ఈ భూ కుంభకోణాల్లో గత సీఎం ప్రమేయం వుందని ఆరోపించారు. విశాఖలో జరిగిన లక్షల కోట్ల విలువైన భూ వ్యవహారంలో వాస్తవాలు బయటకు వస్తాయన్నారు. ముఖ్యమంత్రి వైస్ జగన్మోహన్రెడ్డి హయాంలో తప్పకుండా బయటకు వస్తాయని నమ్ముతున్నామని ఎమ్మెల్యే అమర్నాథ్ పేర్కొన్నారు. పవన్ కల్యాణ్‌కు మతిభ్రమించింది.. పవన్ కల్యాణ్‌కు మతిభ్రమించిందని.. విశాఖపట్నం వస్తే మానసిక వైద్యశాలలో చికిత్స అందిస్తామని అనకాపల్లి ఎమ్మెల్యే గుడివాడ అమర్నాథ్ ఎద్దేవా చేశారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రికి విశాఖ భూ ఆక్రమణలతో సంబంధం ఉందని అనటంతో పవన్ మానసికస్థితి ఏంటో తెలియజేస్తుందని మండిపడ్డారు.పవన్ కల్యాణ్ సినిమా నిన్నటివరకు టీడీపీని.. ఇప్పుడు కొత్తగా బీజేపీని పొగుడుతుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం జగన్ ప్రజాసంక్షేమ పథకాలను చూసి ఓర్వలేకే పవన్ విమర్శలు చేస్తున్నారని ఎమ్మెల్యే అమర్నాథ్ ధ్వజమెత్తారు. -
మూడో రోజు కొనసాగుతున్న సిట్ ఫిర్యాదులు
-
విశాఖ : మూడో రోజు కొనసాగుతున్న సిట్ ఫిర్యాదులు
సాక్షి, విశాఖపట్నం : విశాఖపట్నంలోని సిరిపురం వుడా చిల్డర్డ్స్ ఎరీనా పార్క్‌లో సిట్ ఫిర్యాదుల స్వీకరణ మూడో రోజు ప్రారంభమైంది. సిట్‌కు ఫిర్యాదు చేయడానికి మూడో రోజు అధిక సంఖ్యలో వస్తుండడంతో సిట్ సభ్యులు అనురాధ, భాస్కర్ రావు పరిశీలిస్తున్నారు. ఈ నేపథ్యంలో తొలి రెండు రోజులు వచ్చిన 236 ఫిర్యాదుల్లో 41 సిట్ పరిధిలోకి రాగా, మిగతా 195 దీని పరిధిలోకి రాలేదు. కాగా, రెండవ రోజున మొత్తం 27 సిట్ ఫిర్యాదులు రాగా వాటిలో ఆన్లైన్లో ఏడు, భీమునిపట్నం మూడు, గాజువాక రెండు, గోపలపట్నం ఒకటి, పరవాడ మూడు, పద్మనాభం ఒకటి, పెందుర్తి ఆరు, సబ్వరం రెండు ఉన్నాయి. రెండవరోజు తమ భూములు ట్యాంపరింగ్ జరిగాయంటూ స్వాతంత్ర సమరయోధుల వారసులు సిట్‌కు ఫిర్యాదు చేశారు. గత ప్రభుత్వం తమను మోసం చేసి మా భూములు లాక్కొని తగిన నష్ట పరిహారం కూడా చెల్లించలేదని మెడ్‌టెక్ బాధితులు ఆరోపించారు. -
‘విశాఖ స్కాం వెనక పెద్దల ప్రమేయం’
సాక్షి, శ్రీకాకుళం: విశాఖ భూకుంభకోణంపై సిట్ విచారణ సక్రమంగా జరగలేదని వైఎస్సార్సీపీ నేత ధర్మాన ప్రసాదరావు అభిప్రాయపడ్డారు. శ్రీకాకుళంలో విలేకరులతో మాట్లాడుతూ.. సిట్ నివేదికలో తన పేరు రావడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. ప్రతిపక్షంలో ఉన్నపుడు ఇలాంటివి ఎదురవుతుంటాయని, అయినా తాను భయపడనని అన్నారు. వాటిని తామేం పట్టించుకోవడంలేదని, రెవెన్యూలో పనిచేసిన వారందరికీ తెలుసునని, రెవిన్యూ మంత్రి ఈ వ్యవహరాలు చూడరని అన్నారు. ఇంకా మాట్లాడుతూ.. ‘జిల్లాల్లో కలెక్టర్, ఇతర రెవెన్యూ అధికారుల అజమాయిషీలో ఉండే పనులను నాకు అంటగడుతున్నారు. ప్రజలలో నా పట్ల అపోహలు సృష్టించే ప్రయత్నమే ఇది. సిట్ విచారణ పేరుతో ప్రజల్ని మోసగిస్తున్నారు. అక్కడ రికార్డులు టాంపరింగ్ జరిగింది. టాంపరింగ్ గురించి ఎందుకు పరిశోధించలేదు. ప్రభుత్వ విచారణల్లో నిజాయితీ ఎక్కడుంది? భూ కుంభకోణాలను పోలీసులు ఎలా విచారిస్తారు? సిట్‌లో రెవెన్యూ అధికారులను ఎందుకు పెట్టలేదు? రికార్డుల ట్యాంపరింగ్ జరిగిందని అధికారులు గుర్తించారు. ముఖ్యమంత్రి రెండు జీఓలు జారీ చేశారు. బీజేపీ నేత ప్రశ్నిస్తే ఒక జీఓను రద్దు చేశారు. ముఖ్యమంత్రి సన్నిహితులు ఈ కుంభకోణంలో ఉన్నారు. అందుకే ఇలా వ్యవహరిస్తున్నారు. ప్రజల తరపున నిలదీస్తున్నానని, వైఎస్సార్ కుటుంబంతో సన్నిహితంగా ఉంటున్నానని నన్ను అణగదొక్కాలని ప్రయత్నిస్తున్నారు. వాటికి నేను భయపడను. ప్రజల పక్షాన మాట్లాడుతున్నందుకు ప్రభుత్వం కక్ష సాధిస్తోంద’ని వ్యాఖ్యానించారు. ‘నిభందనలకు విరుద్దంగా రాజధాని భూసేకరణ చేశారు. సుప్రీంకోర్టు స్విస్ ఛాలెంజ్ పద్దతి వద్దంటే నీవు(చంద్రబాబు) సీఆర్డీఏ రూల్స్ మార్చి స్విస్ ఛాలెంజ్ పద్దతే అనుసరించారు. అనుభవం తెచ్చిన పాలనలాగా ఇది లేదు. తప్పులు ఉంటే సరిదిద్దాలి. ల్యాండ్ పూలింగ్ విషయంలో ఫైల్ వేగంగా ఎలా కదిలింది. 500ఎకరాల సేకరణ వెనక పెద్దవాళ్లఎవరు? ఎంతమెత్తం చేతులుమారింది. వీటిని తేల్చలేదు. ప్రతిపాదించిన11 రోజుల వ్యవధిలోనే జీఓ ఎలా బయటకువచ్చింది. సిట్ దర్యాప్తు ఈ విధంగా సాగితే నిజాలు బయటకు వస్తాయా? సిట్ విచారణలో ప్రజలు అడిగిందేమిటి? మీరు చేసిందేమిటి? మీ అదుపాజ్ఞలలో ఉన్న పోలీసులకే ఈ కేసులో చర్యలు తీసుకోమనే అధికారం ఇస్తారా? నిజానికి ఎన్టీఆర్ సీఎంగా మీరు(చంద్రబాబు) రెవెన్యూ మంత్రిగా ఉన్నపుడు1994,నవంబర్‌లో జారీ అయిన జీఓ ప్రకారమే ఇది జరిగింది. అసైన్డ్ ల్యాండ్స్, ఫ్రీడమ్ ఫైటర్స్, ఎక్స్ సర్వీస్ మెన్ల భూములకు సంబంధించి ఆ జీఓ మీ ఆదేశాలమేరకు జారీ అయింది. 1977లో జారీ అయిన జీఓ ప్రకారం ఏ భూములను విక్రయించే అధికారం లేదు. సిట్ రిపోర్ట్ లో తప్పుడు పనులకు పాల్పడిన ప్రభుత్వంలోని పెద్ద ఎవరో ఎందుకు తేల్చలేద’ని పలు ప్రశ్నలు ధర్మాన లేవనెత్తారు. -
ఇప్పటికైనా సీబీఐ విచారణ చేయించాలి
విశాఖపట్నం: విశాఖ భూ కుంభకోణంపై సీబీఐ విచారణ కోరితే రాష్ట్ర ప్రభుత్వ ఆధీనంలోని సిట్ చేత విచారణ చేపట్టారని, కానీ సిట్ నిజాలు బయట పెట్టకుండా అధికార పార్టీకి అనుకూలంగా నివేదిక ఇచ్చిందని వైఎస్సార్సీపీ విశాఖపట్నం నగర అధ్యక్షులు మళ్ల విజయప్రసాద్ ఆరోపించారు. విశాఖపట్నంలో విలేకరులతో మాట్లాడుతూ.. ఇప్పటికైనా ప్రజల్ని మోసగించకుండా సీబీఐ చేత విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. భూ కుంభకోణంలో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు తనయుడు లోకేష్ హస్తం ఉందని ఆరోపణలున్నాయని, కానీ సిట్ లోకేష్ పేరు తప్పించడంతో అనేక అనుమానాలు తలెత్తున్నాయని వ్యాక్యానించారు. వైఎస్సార్సీపీ అధికారంలోకి రాగానే భూకుంభకోణంపై రీ ఎంక్వైరీ వేస్తామని వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇప్పటికే ప్రకటించారని గుర్తు చేశారు. జగన్మోహన్ రెడ్డిపై హత్యాయత్నం జరిగితే సీఎం అవహేళన చేస్తూ మాట్లాడటం జుగుప్సాకరంగా ఉందన్నారు. టీడీపీ నాలుగున్నర సంవత్సరాల పాలన అక్రమాల పుట్టగా సాగిందని, నిజాయతీ ఉంటే సీఎం తన పాలనపై సీబీఐ విచారణ కోరాలని సవాల్ విసిరారు. -
'నిజాలు తొక్కిపెడుతున్నారు..'
విశాఖపట్నం: ఆంధ్రప్రదేశ్‌లో చోటుచేసుకున్న భూకుంభకోణం విచారణ విషయంలో నిజాలను కావాలనే తొక్కిపెడుతున్నారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ కుంభకోణంలో ముమ్మాటికీ ప్రభుత్వ పెద్దల హస్తం ఉందని ఆగ్రహం వ్యక్తం చేసింది. విశాఖపట్నం తదితర భూకబ్జాలపై సీబీఐ విచారణ మాత్రమే జరపాలని వైఎస్ఆర్కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేసింది. విశాఖతోపాటు పలు ప్రాంతాల్లో భారీగా భూకుంభకోణాలు చోటు చేసుకున్న విషయం తెలిసిందే. అయితే, దీనిపై సీబీఐ విచారణ జరిపించాలన్న ప్రతిపక్షాల డిమాండ్‌ను ప్రభుత్వం పక్కన బెట్టింది. -
‘చంద్రబాబుకు ఎందుకంత భయం?’
హైదరాబాద్: చంద్రబాబు ప్రభుత్వం మాఫియా, దోపిడీ ప్రభుత్వంగా మారిందని బొత్స సత్యనారాయణ ఆగ్రహం వ్యక్తం చేశారు. విశాఖ భూకుంభకోణంపై అన్ని రాజకీయ పార్టీలతో కలిసి మహాధర్నా చేపడతామని స్పష్టం చేశారు. చంద్రబాబు ఆధ్వర్యంలో, లోకేశ్ నాయకత్వంలో విశాఖ భూకుంభకోణం జరిగిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆర్నెళ్లుగా పోరాడుతుంటే ప్రభుత్వం కంటితుడుపుగా సిట్ ఏర్పాటు చేసిందన్న ఆయన కుంభకోణంపై సీబీఐ విచారణ జరిగాల్సిందేనని, ఆయన ఎందుకు భయపడుతున్నారని ప్రశ్నించారు. రాష్ట్రం విడిపోయిన తర్వాత ఇంత దోపిడీ ఎన్నడూ చూడలేదని, తమ పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తామని చెప్పారు. రాష్ట్రంలో ప్రైవేట్ బస్సుల ట్రాన్స్పోర్ట్ మాఫియా నడుస్తోందని, పర్మిట్లు రద్దు చేసినా ప్రైవేట్ బస్సులు విచ్చలవిడిగా తిరుగుతున్నాయని చెప్పారు. బస్సులను సీజ్‌చేయడంలో అధికారులు ఎందుకు జాప్యం చేస్తున్నారని, ట్రాన్స్పోర్ట్ మాఫియాకు ప్రభుత్వం లొంగిపోవడం వల్లే అధికారులు వెనుకడుగు వేస్తున్నారని అన్నారు.