Visakhapatnam district police
-
భీమిలిలో ఉద్యోగాల పేరుతో జోతిష్కుడు టోకరా
-
30 కేజీల గంజాయి పట్టివేత
విశాఖపట్నం : విశాఖపట్నం జిల్లా అరకు సమీపంలో పోలీసులు బుధవారం తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా 30 కేజీల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అందుకు సంబంధించి ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. అనంతరం వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇటీవల విశాఖ జిల్లా ఏజెన్సీ ప్రాంతంలో భారీగా గంజాయిని అక్రమ రవాణా చేస్తున్నారు. ఈ నేపథ్యంలో పోలీసులు తరచుగా తనిఖీలు నిర్వహిస్తున్నారు. -
400 కేజీల గంజాయి పట్టివేత
విశాఖపట్నం: విశాఖపట్నం జిల్లా రావికమతం మండలం కొత్తకోట సమీపంలో పోలీసులు ఆదివారం తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా 400 కేజీల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అందుకు సంబంధించి ముగ్గురు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి రెండు తుపాకీలతోపాటు బుల్లెట్లను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం వారిని పోలీసు స్టేషన్‌కు తరలించారు. నిందితులకు చెందిన రెండు వాహనాలను పోలీసులు సీజ్ చేశారు. -
డేటా ఎంట్రీ ఆపరేటర్లకు దరఖాస్తులు
విశాఖపట్నం: ఏజెన్సీ పోలీస్ స్టేషన్లలో ఆరు నెలలు పనిచేసేందుకు డేటా ఎంట్రీ ఆపరేటర్ల నియామకానికి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు విశాఖపట్నం జిల్లా పోలీసులు, ఇక్విసిటివ్ ప్రయివేటు సంస్థ సంయుక్తంగా ఒక ప్రకటనలో తెలిపారు. ఇవి పూర్తిగా ప్రయివేటు సంస్థ నియామకాలని స్పష్టం చేశారు. అభ్యర్థులు పోలీస్ స్టేషన్లో మధ్యాహ్నం 12 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు పనిచేయాల్సి ఉంటుందని తెలిపారు. డిగ్రీ లేదా పీజీ విద్యార్హత కలిగి, కంప్యూటర్ డేటా ఆపరేటర్‌గా అనుభవమున్న పురుష అభ్యర్థులు అర్హులని తెలిపారు. 18 నుంచి 35 ఏళ్ల వయసుండాలి. ఎంపికైన వారికి నెలకు రూ.2500 చెల్లిస్తారు. ఆసక్తి ఉన్నవారు 13వ తేదీ ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల్లోగా దరఖాస్తులను ఎన్.ధర్మాజీ, ఏరియా మేనేజర్, ఇవిజిటివ్ (ఎడ్యూ కన్సల్టింగ్ రీసెర్చ్) సంస్థ, నర్సీపట్నం టౌన్ పోలీస్ స్టేషన్ ఎదుట అందజేయాలి. వివరాలకు ఫోన్ న ంబరు 9848098060 నంబరులో సంప్రదించాలి.