సినిమా షూటింగులో విశాల్‌కు గాయాలు
హీరో విశాల్‌కు ఓ తమిళ సినిమా షూటింగులో గాయాలయ్యాయి. ఆంబల అనే సినిమా షూటింగ్ ప్రస్తుతం ఊటీలో జరుగుతోంది. అందులో ఓ ఫైట్ సన్నివేశం చిత్రీకరిస్తుండగా, మధ్యలో వైరు తెగి పడింది. దాంతో విశాల్ కింద పడిపోయాడు. మధ్యాహ్నం ఫైట్ సన్నివేశం చిత్రీకరిస్తున్నారు. అందులో రోప్ కట్టుకుని కిందకు దూకాలి. అది తెగిపోవడంతో 20 అడుగుల పైనుంచి కిందకు పడ్డాడు. కాళ్లకు తీవ్రగాయాలయ్యాయి. ప్రాథమిక చికిత్స అనంతరం కోయంబత్తూరు తరలించారు. ఒక కాలు బెణికిందని, మరో కాలు ఎముక చిట్లిందని అంటున్నారు. గాయాలు కావడంతో ఆయనను వెంటనే సమీపంలో ఉన్న ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
ఈ సినిమాకు నిర్మాత కూడా స్వయంగా విశాలే. సి.సుందర్ దర్శకత్వం వహిస్తున్నారు. సినిమాలో విశాల్ సరసన హన్సిక హీరోయిన్గా నటిస్తోంది. ఇంకా ప్రభు, వైభవ్ రెడ్డి, మధురిమ, మాధవీలత, రమ్యకృష్్ణ, కిరణ్ రాథోడ్, ఐశ్వర్య ప్రధాన పాత్రల్లో ఉన్నారు.