ప్రవీణ్ తొగాడియాపై కర్ణాటకలో నిషేధం
బెంగళూరు: విశ్వ హిందూ పరిషత్ కార్యనిర్వాహక అధ్యక్షుడు ప్రవీణ్ భాయ్ తొగాడియాను కర్ణాటక రాష్ట్రంలోకి ప్రవేశించకుండా ఆ రాష్ట్ర హోం శాఖ శనివారం నిషేధం విధించింది. ఈ నెల 9 నుంచి 13 వరకు ఉడుపిలో జరిగే ఓ కార్యక్రమానికి తొగాడియా ముఖ్య అతిథిగా హాజరు కావాల్సి ఉంది. శాంతి భద్రతల పరిరక్షణలో భాగంగా ఆయన ప్రవేశంపై నిషేధం విధిస్తున్నట్లు ఉడుపి జిల్లా ఎస్పీ అన్నామలై విలేకర్ల సమావేశంలో వెల్లడించారు.